జంతర్ మంతర్.. ఇంద్రజ అసలు పేరేంటో తెలుసా..?
on Dec 7, 2025

యమలీల మూవీతో ఇంద్రజ అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది. ఆ పేరు అలాగే ఇప్పటికీ స్థిరపడిపోయింది. ఐతే ఇంద్రజ అసలు తన ఒరిజినల్ నేమ్ కాదంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "రాజాతి అనేది నా రియల్ నేమ్. అది కూడా ముద్దు పేరు. ఇక్కడ కన్నా, బుజ్జి అని ఎలా పిలుస్తారో అలా రాజాతి అని ముద్దుగా పిలిచేవారు. నేను చేసిన ఫస్ట్ మూవీ జంతర్ - మంతర్. భరత్ గారి డైరెక్షన్ లో ఆ మూవీ చేసాను. హీరోయిన్ గా ఆయనే నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆ మూవీలో నా క్యారెక్టర్ నేమ్ ఇంద్రజ. ఫస్ట్ డే పూజ రోజున ఆయన క్యారెక్టర్స్ ని నేరేట్ చేస్తూ ఇంద్రజ పాత్రలో ఈ అమ్మాయి నటిస్తుంది అని చెప్పారు. దాంతో ఆ పేపర్ మీద ఇంద్రజ - శ్రీకాంత్ అని పేరు పడిపోయింది. అప్పుడు మా నాన్న ఒక మాట అన్నారు. పేరు మార్చడం ఎందుకు అలా ఫాలో ఇపోదాం" అని చెప్పారు.
"మీ నవ్వుకు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఫాన్స్ ఉన్నారు" అని హోస్ట్ చెప్పింది. "అది నాకే తెలీదు జబర్దస్త్ వచ్చేవరకు. నన్ను నాకు తెలియజేసింది జబర్దస్త్ అనే ప్రతీ ఇంటర్వ్యూలో చెప్తాను. ఈటీవీ షోస్ చేస్తున్న దగ్గర నుంచి నన్ను ఇలా ఇష్టపడుతున్నారు అని తెలిసింది. సినిమాలో క్యారెక్టర్స్ లో నటిస్తాం కానీ ఇక్కడ షోస్ లో మనం మనలా ఉండొచ్చు. ఇప్పుడు నేను నాలుగు మూవీస్ లో నటిస్తున్నా. ఇంకా రెండు సినిమాలకి టైటిల్ ఫిక్స్ అవలేదు. చాలా ఇంటరెస్టింగ్ సబ్జెక్టులు నా వరకు వస్తున్నాయి. ఐతే ఈటీవీ, మల్లెమాల వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ గా ఏదైనా సబ్జెక్టు చేయాలనీ ఈ ఒక్క షోతో స్టిక్ అయ్యి ఉన్నాను." అని చెప్పింది ఇంద్రజ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



