ఒక్క ఫోటోతో ట్రోల్స్ కి చెక్.. డ్రాగన్ రిలీజ్ ఎప్పుడంటే..?
on Dec 7, 2025

జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ కి 'డ్రాగన్'(Dragon) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బక్కగా అయ్యాడు. దీంతో ఆయన లుక్ పై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ఇప్పుడు ఒకే ఒక్క ఫోటోతో.. ఆ ట్రోల్స్ అన్నింటికీ చెక్ పెట్టాడు ఎన్టీఆర్. (NTR Neel)
సినిమా సినిమాకి లుక్ పరంగా వేరియేషన్ చూపించే హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఈ క్రమంలోనే డ్రాగన్ కోసం బక్కగా అయ్యాడు. దీంతో కొందరు.. ఎన్టీఆర్ బాగా బక్కగా అయిపోయాడని, ఫేస్ లో కళ కూడా పోయిందంటూ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఆయన స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. ఫేస్ లో కూడా మునుపటి కళ కనిపిస్తోంది. డ్రాగన్ లో ఎన్టీఆర్ ని నీల్ అదిరిపోయే లుక్ లో చూపించబోతున్నాడని, ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాక అందరూ సర్ ప్రైజ్ అవ్వడం ఖాయమని.. ఈ ఫోటోతో క్లారిటీ వచ్చింది.
కాగా, డ్రాగన్ సినిమాని 2026 జూన్ 25న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా ఈ డేట్ మారనుంది. 2026 చివర్లో లేదా 2027 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



