డాక్టర్లంటే హడలిపోయేలా చేసిన... ఢిల్లీ కారు పేలుళ్ల ఘటన
posted on Nov 12, 2025 9:49AM

ఒకప్పుడు డాక్టర్ సింబల్ ఉన్న వాహనాలంటే వెంటనే వారిని వదిలేసేవారు పోలీసులు. అదే ఇప్పుడు ఢిల్లీ ఘటన తర్వాత మొత్తం మారిపోయిందని వాపోతున్నారు వైద్యులు. కారణం ఈ పేలుళ్ల వ్యవహారంలో మొత్తం డాక్టర్లే ఎక్కువగా ఉండటం చాలా పెద్ద తలనొప్పిగా తయారైంది వైద్యరంగానికి. మరీ ముఖ్యంగా ఢిల్లీ పేలుళ్ల సూత్రధారి డాక్టర్ షాహీన్ గా గుర్తించారు.
అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ షాహిన్ జైషే మహమ్మద్ లేడీ వింగ్ నియామకాలను పర్యవేక్షిస్తున్ట్టుగా గుర్తించారు.. ఈమె ఉగ్రకార్యకలాపాలను సైతం హ్యాండిల్ చేసినట్టు ఐడెంటిఫై చేశారు.
అంతే కాదు రిసిన్ అనే విషంతో సామూహిక మారణ హోమం సృష్టించాలనుకున్న సయ్యద్ సైతం డాక్టర్ కావడంతో.. డాక్టర్ చదువు చదువుకునేది మనుషులను బతికించడానికా? లేక చంపడానికా అన్న మాట కూడా వెలుగులోకి రావడంతో డాక్టర్లకు తల కొట్టేసినంత పని అవుతోంది.
2900 కిలోల IED తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్న ముజ్జామిల్ షకీల్ కూడా ఒక డాక్టరే. ఫరీదాబాద్ లో నివసిస్తున్నాడు. సరిగ్గా అదే టైంలో ఇది పుల్వామాకు చెందినవాడు కూడా.
ఇప్పుడు రైళ్లలో. బస్సుల్లో పరిస్థితి ఎలా తయారైందంటే.. ఈ పేలుడు తర్వాత గడ్డంతో, టోపీతో కనిపించేవారందరినీ చెక్ చేస్తున్నారు. నిజానికి వారిలో చాలా మంది అమాయకులే అయి ఉంటారు. కానీ వారి దురదృష్టం ఎలాంటిదంటే కేవలం కొందరంటే కొందరు చేసిన ఈ పనికి ఇప్పుడు వారెవరికీ పెద్ద గొప్పగా గౌరవం లేకుండా పోతోంది.
వీరికిప్పుడు సిటీలోనే కాదు ఊళ్లలో కూడా ఎక్కడా ఇళ్లు అద్దెకు ఇచ్చేలా కనిపించడం లేదు. ఇక ఎయిర్ పోర్టులో పరిస్థితి కూడా చాలా చాలా దారుణంగా ఉండబోతుంది. కారణం చాటు మాటుగా తమ లగేజీలో వీరు ఏ పేలుడు, రసాయన పదార్ధాలు తీస్కెళ్తున్నారో అన్న భయం వారిని మరింతగా వెంటాడనుంది. ఇక అంతర్జాతీయ విమానాశ్రయాల పరిస్థితి మరింత దారుణం కానుంది.
విదేశాల్లో వీరికి మరింత సమస్య ఎదురు కానుంది. ఇప్పటికే ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ ని సైతం తమ ప్రార్ధనాలయం చేసేసుకుంటారన్న కామెంట్లు ట్రోలు మంటున్నాయ్. ప్యారీస్ నిండా టోపీవాలాలే అన్న ఆందోళన ఫ్రెంచి వాసులను తీవ్రంగా వెంటాడుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వీరి పరిస్థితి రాను రాను అగమ్యగోచరంగా తయారయ్యేలా తెలుస్తోంది.