మూడు విమానాలకు బాంబు బెదరింపు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైన వేళ.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదరింపు తీవ్ర కలకలం సృష్టించింది. విదేశాల నుంచి వస్తున్న మూడు విమానాలకు ఒకే రోజు ఒకే సారి బాంబు బెదరింపు ఈమెయిల్ రావడం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. కన్నూర, ఫ్రాంక్ పర్ట్, లండన్ ల నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ మూడు విమానాలకు సోమవారం (డిసెంబర్ 8) ఈ మెయిల్ ద్వారా బాంబు బెదరింపులు వచ్చాయి. వెంటనే అలర్ట్ అయిన అధికారులు తనిఖీలు చేపట్టారు.  విమా నాశ్రయ సెక్యూరిటీ, సీఐఎస్ఎఫ్, ఎయిర్‌పోర్ట్‌ మేనేజ్మెంట్‌ అత్యవసర ప్రోటోకాల్‌ను అమల్లోకి తీసుకువచ్చాయి.

మూడు విమానాలు ఎలాంటి ప్రమాదం లేకుండా శంషాబాద్‌లో సురక్షితంగా ల్యాండింగ్‌ అయ్యాయి. ల్యాండింగ్‌ అనంతరం ప్రయాణికులందరిని  విమానం నుంచి దింపి, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ జోన్‌లకు ఈ విమానాలను తరలించారు.  

ఇదిలా ఉండగా, మూడు విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.   విమానా శ్రయం పరిధిలో అదనపు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి, మొత్తం ఏరియాను హై అలర్ట్‌లో ఉంచారు.ఈ ఘటనపై  వింగ్‌ ఇప్పటికే విచారణ చేపట్టింది, బెదిరింపు ఇమెయిల్‌ పంపిన వివరాలు తెలుసుకునే పని ప్రారంభించింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu