శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

 

 

తిరుమల శ్రీవారిని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

టీటీడీపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ధార్మిక సంస్థ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఇకపై అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశామన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu