తెలంగాణను వణికిస్తున్న కోల్డ్ వేవ్.. గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. మరి కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. దీంతో జనం సాయంత్రమైతే చాలు బయటకు అడుగుపెట్టాలంటేనే వణుకుతున్న పరిస్థితి. ఉదయం 9గంటల సమయంలో కూడా చలి పులి పంజా విసురుతున్నది. 

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో సోమవారం (డిసెంబర్ 8) అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లాలోని పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మెదక్‌ జిల్లా శివ్వంపేటలో 8.4 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా బేగంపేటలో 8.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ చలి పంజా విసురుతోంది. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 7.4 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 8.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డయింది.

ఇక హైదరాబాద్ నగరం సైతం చలిగుప్పెట్లో వణుకుతోంది. నగర పరిధిలోనూ పలు ప్రాంతాలలో సింగి ల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.  శేరిలింగంపల్లిలో ఆదివారం రాత్రి 8.4 డిగ్రీల  కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది.   మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu