ఐపీల్ మినీ వేలం.. వెలవెల బోతుందా?
posted on Dec 9, 2025 1:47PM

ఐపీఎల్ 2026 మెగా టోర్నీ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మినీ వేలం ఈ నెల 16న అబుదాబీ వేదికగా జరగనుంది. వేలం కోసం అప్లై చేసుకున్న 1,355 మందిలో కేవలం 350 మంది మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ మేరకు బీసీసీఐ ఇందుకు సంబంధించిన జాబితా ప్రకటించింది. ఇందులో బీసీసీఐ అనూహ్యంగా 1,005 మంది పేర్లను జాబితా నుంచి తొలగించింది. 35 మంది కొత్త ఆటగాళ్ల పేర్లను చేర్చింది.
350 మంది ఆటగాళ్లకు సంబంధించిన ఆక్షన్ ఈ నెల 16 మధ్యాహ్నం అబుదాబీలో జరగనుంది అని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పంపిన మెయిళ్లలో బీసీసీఐ పేర్కొంది. మొదట బిడ్డింగ్ ప్రక్రియ.. బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్-బ్యాటర్లు, పేసర్లు, స్పిన్ బౌలర్లు అనే విభాగాల వారీగా క్యాప్డ్ ఆటగాళ్లతో వేలం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు కూడా ఇదే వరుస క్రమంలో వేలం జరిగే అవకాశముంది.
నివేదికల ప్రకారం ఓ ఫ్రాంచైజీ సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ పేరును జాబితాలో చేర్చమని కోరడంతో అతడికి జాబితాలో స్థానం దక్కిన్నట్లు తెలుస్తోంది. డికాక్ గతంలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి.. మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల వైజాగ్ వేదికగా టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీతో చెలరేగాడు. రానున్న ఆక్షన్‌లో క్వింటన్ డికాక్ కనీస ధర రూ.కోటి ఉండనున్నట్లు సమాచరాం. అయితే గత వేలంతో పోల్చుకుంటే అతడి ధర 50 శాతం తగ్గింది. గతంలో కేకేఆర్ అతడిని రూ.2కోట్లకు దక్కించుకుంది.