సోనియాగాంధీకి కోర్టు నోటీసులు.. ఎందుకంటే?

ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ కీలక నేత సోనియాగాంధీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. సోనియాగాంధీ దేశ పౌరసత్వం తీసుకోవడానికి ముందే.. దేశంలో ఓటుహక్కు పొందారన్న విషయంపై దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఇప్పుడు సోనియాకు నోటీసులు జారీ చేసింది. 

భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే సోనియా గాంధీ ఓటరుగా నమోదు చేసుకున్నారని పిటిషనర్ ఆరోపిస్తూ  కోర్టును ఆశ్రయించారు. దీంతో  సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 6కు వాయిదా వేసింది. 

ఇటలీ పౌరురాలైన సోనియా గాంధీ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో వివాహం తర్వాత భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1983 ఏప్రిల్ 30న ఆమెకు భారత పౌరసత్వం లభించింది.  అంతకు మూడేళ్ల ముందే.. అంటే 1980 నాటికే  సోనియాగాంధీ పేరు ఢిల్లీ  ఓటరు జాబితాలో  ఉందని పిటిషనర్ ఆరోపించారు.

భారత పౌరసత్వం పొందకముందే దేశంలో ఓటరుగా నమోదు కావడం చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందని పిటిషన్ పేర్కొన్నారు.  ఓటు హక్కు కోసం సోనియా గాంధీ నకిలీ పత్రాలు సమర్పించి ఉండొచ్చని ఆరోపించారు. 1980లో సోనియా గాంధీ పేరును ఓటరు జాబితాలో చేర్చిన తర్వాత తిరిగి 1982లో తొలగించారని, ఆపై 1983 జనవరిలో తిరిగి ఓటరు జాబితాలో చేర్చారని పిటిషనర్ ఆరోపిం చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu