డాన్ బ్రాడ్ మన్ వరల్డ్ రికార్డ్.. 87ఏళ్లుగా పదిలం

టెస్ట్ క్రికెట్ చరిత్రలో సర్ డాన్ బ్రాడ్ మన్  అద్భుత ఆటగాడిగానే కాదు.. ఎన్నో ఎన్నెన్నో ప్రపంచ రికార్డులు సృష్టించిన గోప్ప క్రికెటర్. రికార్డులు అన్నవి బ్రేక్ అవుతూ ఉంటాయి. డాన్ బ్రాడ్ మన్ పేరిట ఎన్నో ఏళ్లుగా ఉన్న హయ్యస్ట్ టెస్ట్ సెంచరీల రికార్డును మన లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ బద్దలు కొట్టాడు. ఆ గావస్కర్ రికార్డును మన సచిన్ టెండూల్కర్ బ్రేక్ చేశాడు. అలాగే టెండూల్కర్ నెలకొల్పిన ఎన్నో రికార్డులను కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు. అయితే డాన్ బ్రాడ్ మన్ వరుసగా ఆరు టెస్టుల్లో  ఆరు సెంచరీల రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది.  1937 జనవరి 1న ఇంగ్లండ్‌పై మొదలైన సెంచరీల ప్రవాహం.. 1938 జులై 22 వరకు కొనసాగింది. ఈ 87 ఏళ్లలో మరే ఇతర బ్యాటర్ కూడా వరుసగా ఆరు మ్యాచుల్లో సెంచరీలు చేయలేకపోయారు.

అయితే ఈ అరుదైన ఘనతకు  ఒకింత చేరువగా వచ్చిన వాళ్లు లేకపోలేదు. ప్రస్తుత టీమ్ ఇండియా కోచ్.. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వరుసగా ఐదు టెస్టుల్లో ఐదు సెంచరీలు చేశాడు. అలాగే సౌతాఫ్రికాకు చెందిన జాక్వెస్ కల్లిస్, పాకిస్థాన్ కు చెందిన  మహ్మద్ యూసుఫ్ కూడా వరుసగా 5 మ్యాచుల్లో సెంచరీలు చేశారు. అయితే డాన్ బ్రాడ్ మన్ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయారు. చూడాలి మరి మరో 13 ఏళ్లు బ్రాడ్ మన్ రికార్డు అన్ బ్రేకబుల్ గా మిగిలి.. శతాబ్దపు రికార్డుగా రికార్డు పుటల్లో నిలిచిపోతుందేమో.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu