శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో వన్యప్రాణులు
posted on Sep 28, 2025 12:24PM

ఎయిర్ పోర్ట్ లో అధికారులేకాక మరెవరికి కూడా ఎటువంటి అనుమానం కలగదని భావిస్తారో ఏమో తెలియదు కానీ... ఈ స్మగ్లర్లు ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ అక్రమంగా స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ వారి ఎత్తులను చిత్తు చేస్తూ అధికా రులు ఎంతో చాక చక్యంగా వారిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపిస్తుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి బ్యాగ్ లో ఉన్న వాటిని చూసి అధికారులు ఆశ్చర్యచకితులయ్యారు.... చివరకు ప్రయాణికుడిని అదుపులోకి తీసు కొనిజైలుకు పంపారు.
బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన ఓ వ్యక్తి అటు... ఇటు చూస్తూ కంగారుగా నడుచుకుంటూ వెళ్తుండగా కస్టమ్స్ అధికారులకు అతనిపై అను మానం కలిగింది... దీంతో అధికారులు వెంటనే అతన్ని ఆపి అతని బ్యాగును తెరిచి చూసి....షాక్ కు గురయ్యారు... బ్యాగులో వన్యప్రా ణులు ఉన్నాయి... ఎయిర్ పోర్ట్ లో ఉండే కస్టమ్స్ అధికారులకు ఎటువంటి అనుమానం కలగకుండా.... ఈ ప్రయాణికుడు బ్యాంకాక్ నుండి వన్యప్రాణు లను బ్యాగ్ అడుగు భాగంలో పెట్టుకొని శంషాబాద్ ఎయి ర్పోర్ట్ కు వచ్చాడు.
కానీ చివరకు అధికారుల చేతికి చిక్కాడు. అధికా రులు అతన్ని అదుపులోకి తీసు కొని అతని వద్ద నున్న ఒక మానిటర్ బల్లి, ఒక రెండు తెల్ల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు, నాలుగు ఆకుపచ్చ ఇగువాన, 12 ఇగువానాస్ స్వాధీ నం చేసుకున్నారు. అనంతరం అధికారులు ఈ వన్య ప్రాణులను తిరిగి బ్యాంకాక్ కు తర లించారు. ప్రయాణి కుడిని అరెస్టు చేసి... ఇతను హైదరా బాద్‌కు వన్యప్రాణు లను ఎందుకు తీసుకో వచ్చాడు? ఎవరి కోసం తీసుకోవ చ్చాడు? అనే కోణంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు.