తమిళనాడు తొక్కిసలాటపై నలుగురిపై కేసు నమోదు

 

తమిళనాడు కరూర్‌లో విజయ్‌ టీవీకే వ్యవస్థాపకుడు నిర్వహించిన ర్యాలీకి అనుమతులు 10,000 మందికే తీసుకున్నట్లు డీజీపీ జి. వెంకట్రామన్‌ వెల్లడించారు. అయితే సోషల్‌ మీడియాలో తప్పుదోవ పట్టించే ప్రకటనల కారణంగా ఫ్యాన్స్ ముందుగానే భారీ సంఖ్యలో హాజరయ్యారని చెప్పారు. రాత్రి 7.30 గంటలకు విజయ్‌ రాకముందే జనసందోహం ఏర్పడి తొక్కిసలాట జరిగింది. 

అధికారులు ఈ కార్యక్రమానికి 1.2 లక్షల చదరపు అడుగుల స్థలం కేటాయించినప్పటికీ, ఊహించిన దానికంటే ఎక్కువ మంది రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని ఆయన వివరించారు. ఘటన స్థలానికి వెంటనే 2,000 మంది సిబ్బంది, సీనియర్‌ పోలీసు అధికారులను పంపించామని, ఒకే సభ్య కమిషన్‌తో దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

విజయ్‌ సహాయకులపై కేసు

ఈ ఘటనలో విజయ్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్‌, జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ నిర్మల్‌ కుమార్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీపీ ఎస్‌. డేవిడ్‌సన్‌ ధృవీకరించారు. ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. అలాగే మెగాస్టారక సినీ నటుడు చిరంజీవి ఎక్స్‌లో స్పందిస్తూ – “కరూర్‌ ర్యాలీ దుర్ఘటన బాధాకరం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి” అని పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu