ఏపీ డిప్యూటీ సీఎం కృషి ఫలించింది.. ఎర్రమట్టి దిబ్బలకు యునెస్కో గుర్తింపు

విశాఖ జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బలకు యునెస్కో గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు కోసం, ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ కోసం జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృషి ఫిలించింది.  తాజాగా యునెస్కో రూపొందించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో తిరుమల కొండలతో పాటుగా ఎర్రమట్టిదిబ్బలకు కూడా స్థానం దక్కింది.  

అత్యంత సహజంగా వేల ఏళ్ల నుంచీ ఎగురుతూ వచ్చిన ఇసుక రేణువులతో ఏర్పడిన ఈ ఎర్రమట్టి దిబ్బలు విశాఖ జిల్లా భీమిలి సముద్ర తీరానికి 200 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి సముద్ర మట్టానికి పది నుంచి 90 మీటర్ల ఎత్తులో ఉన్నాయి ఈ ఎర్రమట్టి దిబ్బలకు యునెస్కో గుర్తింపు దక్కడం రాష్ట్రానికి గర్వకారణంగా చెప్పుకోవాలి. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురై కనుమరుగైపోతాయన్న ఆందోళన రేకెత్తించిన ఈ ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ కోపం, వీటికి అంతర్జాతీయ గుర్తింపు కోసం పవన్ కల్యాణ్, ఆయన నేతృత్వంలోని జనసేన నేతలు, కార్యకర్తలు అలుపెరుగని కృషి చేశారు.  

 జనసేన   అధినేత పవన్ కళ్యాణ్  ఎర్ర మట్టిదిబ్బలను  ప్రత్యేక నిధి గా అభివర్ణించారు.   వాటిని రక్షిం చడానికి ఈ ప్రదేశాన్ని  బఫర్ జోన్‌ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.  డిమాండ్ చేసి ఊరుకోవడమే కాకుండా పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా గళమెత్తారు.  ఆయన కృషి ఫలితంగా ఎర్రమట్టి దిబ్బలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ ఏడాది ఆగస్టులో యునెస్కో అధికారికంగా ప్రకటిం చిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితా 2025లో ఎర్రమట్టిదిబ్బలకు చోటు దక్కింది. ఈ గుర్తింపు ఎర్రమట్టిదిబ్బల రక్షణకు ఎంతగానో దోహదపడుతుందనడంలో సందేహం లేదు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu