అమరావతిలో సీఆర్డీయే నూతన భనవం ప్రారంభం ఎప్పుడో తెలుసా?
posted on Sep 23, 2025 3:44PM

అమరావతిలో సీఆర్డీయే కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. విజయదశమి రోజున ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. 4.23 ఎకరాల్లో 2.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎనిమిది అంతస్తులలో ఈ భవన నిర్మాణం జరిగింది. వాస్తవానికి ఈ భవనాన్ని ఆగస్టు 15న ప్రారంభించాలని భావించినప్పటికీ భారీ వర్షాల కారణంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఈ సీఆర్డీయే భవనంలో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ భవనలో సీసీటీవీలు, డ్రోన్లతో కూడిన కమాండ్ కంట్రోల్ రూమ్, సెక్రటేరియెట్, రాజ్ బవన్ నమూనాలు ప్రదర్శించే ఎక్స్ పీరియెన్స్ సెంటర్ ఉన్నాయి. అలాగే పైకప్పుపై ఈవెంట్ స్పేస్, జాతీయ జెండా ఉంటాయి.
కాగా భవనం ఇనాగ్యురేషన్ కు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో మంత్రి నారాయణ ఈ భవనాన్ని మంగళవారం (సెప్టెంబర్ 23) పరిశీలించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. మూమూలుగా అయితే ఈ సీఆర్డీయే భవనం 2019 నాటికే రెడీ అవ్వాలనీ, అయితే గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా నిలిచిపోయిందని నారాయణ తెలిపారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత టెండర్లు పిలిచి సీఆర్డీయే భవన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు.