ఎనిమిదో రోజూ కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం
posted on Dec 9, 2025 9:48AM

ఇండిగో విమానయాన సంస్థ నిర్వహణ సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఎనిమిదో రోజు కూడా ఆ సంస్థకు చెందిన విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. ఇక హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలు దేరాల్సిన, విమానాశ్రయానికి రావాల్సిన విమానాలు కూడా భారీగా రద్దయ్యాయి. మంగళవారం (డిసెంబర్ 9) దేశ వ్యాప్తంగా ఇండిగో సంస్థకు చెందిన వందల విమాన సర్వీసులు రద్దయ్యాయి. వీటిలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన, విమానాశ్రయానికి రావాల్సిన 58 విమాన సర్వీసులు ఉన్నాయి.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నిర్వహణ సంక్షోభం వరుసగా ఎనిమిదో రోజూ కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి . విమాన సర్వీసుల క్యాన్సిలవడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులు పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానా శ్రయంలో మొత్తం 58 విమానాల రద్దయ్యాయి. వీటిలో శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 44 విమానాలు , హైదరాబాద్‌కు రావాల్సిన 14 విమాన సర్వీసులు ఉన్నాయి.