కన్న తండ్రే కాలయముడు... బాలుడిని హత్య చేసిన తండ్రి

 

అమ్మ ప్రేమ..... అయితే నాన్నా బాధ్యత..... అమ్మ తన ప్రేమ నంత రంగడించి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. కానీ పైపైకి కఠినంగా కనిపించే నాన్నా బాధ్యతతో వ్యవహరిస్తాడు. తన పిల్లలు మంచి ఉద్యోగంలో చేరి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాం క్షిస్తూ అందుకొరకు పగలు, రాత్రి అనే తేడా లేకుండా అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాడు. తన పిల్లలు  బాగా చదువుకొని ఉన్నత స్థాయిలోకి వచ్చాక ఆ తండ్రి లోలోపల పడే ఆనందం అంతా ఇంతా కాదు. 

ప్రతి పిల్లలకి తండ్రి ఒక హీరో.... అలాంటి తండ్రి తన పిల్లలకి ఏదైనా రోగం వచ్చిందంటే తన ప్రాణాలను సైతం లెక్కచేయ కుండా తన పిల్లల్ని రక్షించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అయితే డబ్బు లేకపోతే దాతలను అర్ధించి మరి తన పిల్లల్ని రక్షించుకుం టున్న ఘటనలు ఎన్నో జరుగుతు న్నాయి. కానీ పాతబస్తీ పరిధిలో జరిగిన ఓ ఘటన మాత్రం పలువురిని కంటతడి పెట్టిం చింది. ఓ తండ్రి తన కొడుకును  హత్య చేసి మూసి నదిలో పడేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపు తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

హైదరాబాద్ పాతబస్తీ బండ్ల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూరి నగర్ లో మహ మ్మద్ అక్బర్(35), సనా బేగం దంపతులు... వీరికి పెద్దబాబు (07), చిన్నబాబు మహమ్మద్ అనాస్(03) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. మహమ్మద్ అక్బర్ కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండగా... సనా బేగం నీలోఫర్ కేర్ టేకర్ గా పనిచేస్తుంది. కొడుకు గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నాడు. 

ఎన్నెన్నో హాస్పిటల్ లో చూపించాడు. అయినా కూడా కొడుకు అనారోగ్య సమస్య పరిష్కారం కాలేదు. అయితే దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరుగుతూ ఉండేది. దీంతో మహమ్మద్ అక్బర్ అనారోగ్య సమ స్యతో బాధపడు తున్న తన కొడుకు ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.. ఈ నేపథ్యంలోనే తన భార్య సనా బేగం శుక్రవారం రాత్రి డ్యూటీ కి వెళ్ళిన తర్వాత శనివారం తెల్లవారుజామున అనారోగ్య సమస్యతో బాధపడుతున్న చిన్న కొడుకు తలపై దిండితో ఊపిరాడకుండా చేసి చంపాడు. 

అనంతరం బాలుడి మృతదేహాన్ని సంచిలో పెట్టుకొని బైక్ పై తీసుకెళ్లి నయాపూల్ బ్రిడ్జి పై నుంచి మూసిలో పడేసాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి తన కొడుకు కనిపించడం లేదంటూ... బంధువులు తీసుకువెళ్లి బిడ్డను తిరిగి ఇంటి దగ్గర దింపినట్లు ఫోన్ చేశారని... కానీ తన కొడుకు అప్పటి నుండి కనిపించడం లేదని బోరున విలపిస్తూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న సమయంలో తండ్రి అక్బర్ ఫోన్ ని చెక్ చేయడంతో ఎటువంటి కాల్ రాలేదని పోలీసు లకు అర్థమైంది. 

అంతేకాకుండా అతను చేసే ఓవర్ యాక్షన్ చూసి పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా తెల్లవారుజామున బైక్ పై ఏదో పెద్ద సంచి పెట్టుకొని తీసుకువెళ్లినట్లుగా దృశ్యాలు కనిపించాయి. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారణ చేయడంతో అసలు నిజం బయటికి వచ్చింది.

తన కొడుకుని తానే హత్య చేశానని తర్వాత మృతదే హాన్ని తీసుకువెళ్లి మూసిలో పడేసా నని మహమ్మద్ అక్బర్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. దీంతో బండ్లగూడ పోలీ సులతో పాటు హైడ్రా ఎన్డీఆర్ఎఫ్ అధికారులు మూసి లో బాలుడి మృత దేహం కోసం జల్లెడ పడుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu