బడిలో బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన కీచక టీచర్

 

నేటి సమాజంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా అయిపో యింది. కామాంధు లకు కళ్ళు మూసు కుపోయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆడపిల్ల కనిపిస్తే చాలు లైంగిక వేధిం పులకు గురి చేస్తు న్నారు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని బయటకి పంపించాలంటేనే భయంతో వణికి పోతున్నారు. అయితే దేవాలయం లాంటి బడిలో కూడా కామాంధులు అభం శుభం తెలియని చిన్నారు లను కాటు వేసేం దుకు సిద్ధమవుతు న్నారు. అక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది. 

సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామంలో ఓ కీచక టీచర్ కన్ను ఓ విద్యార్థిని పై పడింది. దీంతో ఆ విద్యార్థిని పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లి దండ్రులు పోలీసు లను ఆశ్రయించడం తో ఈ ఘటన వెలు గులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలంలో ఉన్న లక్ష్మక్క పల్లి గ్రామంలోని వెరీటాస్ సైనిక్ స్కూల్లో ప్రణయ్ అనే వ్యక్తి తెలుగు టీచర్ గా పని చేస్తున్నాడు. 

అదే స్కూల్లో బాధిత బాలిక 8వ తరగతి చదువుతున్నది. సెప్టెంబర్ 4వ తేదీన టీచర్స్ డే సెలబ్రే షన్స్ ప్రోగ్రాం జరిగిన అనంతరం తెలుగు టీచర్ ప్రణయ్ క్లాస్ రూమ్ కి వచ్చాడు.  బాధిత బాలికను మాత్రమే క్లాస్ రూమ్ లో ఉండాలని ఆదేశించాడు. క్లాస్ రూమ్ లో ఉన్న మిగతా విద్యార్థులం దరినీ బయటకు పంపించాడు. అనంతరం క్లాస్ రూమ్ డోర్ మూసి వేసి సదరు బాలికపై అత్యా చారం యత్నానికి పాల్పడ్డాడు. 

దీంతో బాలిక గట్టి గట్టిగా అరవడంతో ఎవరైనా వస్తారే మోనని... భయపడి పోయిన తెలుగు టీచర్ ప్రణయ్ అక్కడి నుండి పారిపోయాడు. అనంతరం బాలిక ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేసింది. అయినా కూడా స్కూల్ యజమా న్యం ఈ విషయాన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు.

అయితే స్కూల్లో ప్రిన్సిపల్ ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది... దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కీచక టీచర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu