కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్‌

 

తెలంగాణ ప్రభుత్వ కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ వేసి, ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల ఫీజు విధించడం అన్యాయమని వాదించారు. లాటరీలో షాప్‌ రాకపోతే ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకుండా ఎక్సైజ్‌ శాఖకు జమచేస్తున్నారని ఆరోపించారు.

లాటరీలో దుకాణం దక్కని వారికి, వారు చెల్లించిన దరఖాస్తు ఫీజును తిరిగి చెల్లించాలని కోర్టును అభ్యర్థించారు. అలాగే, లిక్కర్‌ షాప్‌ పొందిన దరఖాస్తుదారుల నుంచి ఇప్పటికే రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను, స్పెషల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ పన్ను, టర్నోవర్‌ పన్ను వసూలు చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

లిక్కర్‌ పాలసీపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కూడా పిటిషనర్‌ కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ శ్రవణ్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆబ్కారీశాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేస్తూ, కేసు విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu