పోలీసు శాఖను మూసివేయడం మంచిది.. పరకామణి కేసులో హైకోర్టు సీరియస్

తిరుమల పరకామణిలో అక్రమాలపై ఏపీ హైకోర్టు పోలీసుశాఖపై తీవ్ర సీరియస్ అయ్యింది. ఈ అక్రమాలకు సంబంధించి లోక్‌ అదాలత్‌లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్‌ చేయాలన్న తమ ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పోలీసు శాఖ నిద్రపోతోందని వ్యాఖ్యానించింది. అంతే కాకుండా సాక్ష్యాలను తారుమారు చేయడానికి సహకరిస్తోందని హైకోర్టు పేర్కొంది.

 తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణికి సంబంధించిన కేసులో గత నెల 19న ఇచ్చిన ఆదేశాలను పోలీసు శాఖ బేఖాతరు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి లోక్ అదాలత్ లో రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్ చేయాలని హైకోర్టు గత నెల 19న ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీసు శాఖ, డీజీపీ ఈ ఆదేశాలను పట్టించుకోలేదంటూ సీరియస్ అయ్యింది. ఇలా అయితే పోలీసు శాఖను క్లోజ్ చేయడమే మంచిదని హెకోర్టు వ్యాఖ్యానించింది. రికార్డులు సీజ్‌ చేసి హైకోర్టు ముందు ఉంచాలని సీఐడీ డీఐజీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu