కొత్తగూడెం రైల్వేస్టేషన్‌‌లో బాంబు పేలుడు

 

భద్రాది కొత్తగూడెం రైల్వేస్టేషన్‌‌లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన ఓ సంచిలో ఉన్న బాంబును వీధి కుక్క రైల్వే ట్రాక్‌‌పైకి నోటితో లాక్కెళ్లింది. ఆ సంచిలో ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్న బాంబును కుక్క కొరింది. దీంతో భారీ శబ్దంతో బాంబు పేలుడు సంభవించింది. కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. ఈ బాంబు పేలుడుతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో.. కొత్తగూడెం 3వ పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. 

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకా ఏమైనా బాంబులు ఉన్నాయా అంటూ పోలీస్ జాగిలాలతో రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో ఆగంతకుడు ఎటువైపు నుంచి వచ్చాడు. ఎటువెళ్లాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరిగిన మరసటి రోజే ఈ ఘటన జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu