లోకేష్ విదేశీ పర్యటనలు.. ఆచరణలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్

ఆంధ్రప్రదేశ్ తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇన్వోస్టర్లు భావిస్తున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ విధానమే కారణమని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అక్కర్లేదు. అభివృద్ధి, దార్శనికత విషయాలలో చంద్రబాబుకు ఉన్న ట్రాక్ రికార్డ్ కు లోకేష్ స్పీడ్ తోడుకోవడంతో ప్రపంచం నలుమూలల నుంచీ ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ చెబుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మంత్రి నారా లోకేష్ కేవలం మాటల్లోనే కాదు ఆచరణలో సైతం చూపుతున్నారు. ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు ట్రిలియన్  డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.  ఇందు కోసం దేశ, విదేశీ పెట్టుబడిదారులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. దావోస్ మొదలైన ఈ ప్రయాణం సక్సస్ ఫుల్ గా సాగుతోంది. అదే క్రమంలో  మంత్రి నారా లోకేష్ ఈ నెలలో రెండే దేశాలలో పర్యటించనున్నారు. తొలుత అమెరికాలోనూ, ఆ తరువాత కెనడాలొనూ పెట్టుబడుల వేట కొనసాగించే లక్ష్యంతో లోకేష్ పర్యటించనున్నారు.

ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకూ నారా లోకేష్ డల్లాస్ సహా అమెరికా రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఎన్ఆర్ఐలతో సమావేశం అవుతారు. అలాగే అమెరికాలోని అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు. ఈ భేటీలన్నీరాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా సాగనున్నాయి. అలాగే అమెరికా పర్యటన ముగించుకు వచ్చిన రోజుల వ్యవధిలోనే అంటే డిసెంబర్ 11 నుంచి రెండు రోజుల పాటు కెనడాలో పర్యటించనున్న లోకేష్ ఆ పర్యటనలో పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. ఈ భేటీల లక్ష్యం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే. రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే పారిశ్రామిక వేత్తలకు ఆంధ్రపప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను వారికి వివరించడమే.  లోకేష్ తన పర్యటన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక పెట్టుబడుల హబ్ గా తీర్చిదిద్దడమేనని చెబుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu