ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు : సీఎం చంద్రబాబు
posted on Dec 3, 2025 1:38PM
.webp)
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ముఖ్యమంత్రి పర్యటించారు. ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో భాగంగా రైతులు, రైతు కుటుంబాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణ గోదావరి నదులను అనుసంధానం చేసి పెన్నా వరకు తీసుకెళ్తామన్నారు.
కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ సేవలు ప్రారంభించామని తెలిపారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. రైతన్నకు అండగా ఉంటామనేది మా మొదటి నినాదం. నీటి వనరులు పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. గోదావరి జలాలను కృష్ణా నదికి కలిపాం. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతాం. పెన్నా వరకూ తీసుకెళ్తామని చంద్రబాబు తెలిపారు.