ఏసీబీ కస్టడీకి ఐఏఎస్ అధికారి సంజయ్
posted on Sep 2, 2025 10:25AM

ఐపీఎస్ అధికారి సంజయ్ ను మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీ కస్టడీకిఅనుమతిస్తూ ఏసీబీ కోర్టు సోమవారం (సెప్టెంబర్ 1) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం (సెప్టెంబర్ 2) నుంచి ఏసీబీ ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.
జగన్ హయాంలో అగ్నిమాపక శాఖ, ఆ తరువాత ఏపీ సీఐడీ చీఫ్ గా సంజయ్ పని చేసిన సంగతి తలిసిందే. ఆయన అగ్నిమాక శాఖలో ఉన్న సమయంలో ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోళ్లలో జరిగిన అక్రమాల కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న సంజయ్ ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ పై గత వారం వాదనలు ముగియగా, కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇప్పుడు అంటే సోమవారం (సెప్టెంబర్ 2) సంజయ్ ను మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ తీర్పు వెలువరించింది.
దీంతో మంగళవారం (సెప్టెంబర్ 2) నుంచి మూడు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 4 వరకూ ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ ఏసీబీ సంజయ్ ను అదుపులోనికి తీసుకుని విచారించనుంది. కోర్టు ఆదేశాల మేరకు ఏరోజు కారోజు విచారణ పూర్తయిన తరువాత సాయంత్రం ఆరుగంటలకు విజయవాడ జిల్లా జైలులో అప్పగించనుంది. ఇదిలా ఉండగా ఆరోగ్య కారణాలు చూపుతూ సంజయ్ దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 4కు వాయిదా వేసింది.