ఇడుపులపాయలో తండ్రి వైయస్ కు జగన్ నివాళులు

 

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16 వ వర్ధంతి సందర్భంగా  కడపజిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్  వద్ద ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంగళవారం (సెప్టెంబర్ 2) ఘన నివాళులర్పించారు.

తల్లి విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులు , వైసీపీ ముఖ్యనేతలతో కలిసి ఇడుపులపాయలో వైఎస్ కు నివాళులర్పించిన జగన్.. ఆ తరువాత   ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.తల్లి విజయమ్మతో పాటు భార్య వైఎస్ భారతి రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోహార్ వైఎస్సార్ అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో  ఇడుపులపాయ ఘాట్ ప్రాంతం మార్మోగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu