కాకినాడ ఎంపీ పేరుతో సైబర్ నేరగాళ్ల టోకరా!
posted on Sep 11, 2025 9:18AM
.webp)
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాలలో సొమ్ములను కొట్టేస్తున్నారు. వీరి సైబర్ నేరాలకు సామాన్యులే కాదు బడాబాబులు కూడా బలౌతున్నారు. తాజాగా వాట్సాప్ డీపీ మార్చి మోసాలకు పాల్పడుతున్న ఉదంతం వెలుగులోనికి వచ్చింది. ఈ సారి సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుకున్నది ఏకంగా కాకిడాన ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ సిబ్బంది.
కాకినాడ జనసేన ఎంపి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేసి ఏకంగా 92.5 లక్షలు కొల్లగొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ టీ టైమ్ వ్యవస్థాపకుడు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే తాజాగా సిఎఫ్ఓ శ్రీనివాసరావు గంగిశెట్టి కి ఆగస్టు 22వ తేదీన ఓ సైబర్ మోసగాడు వాట్సాప్ లో కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుని మెసేజ్ చేశాడు.అది కొత్త నెంబర్ అని ఎంపీ లాగా నేరగాడు పరిచయం చేసుకున్నాడు. దీంతో అది తన బాస్ ఉదయ శ్రీనివాస్ నెంబర్ అని సీఎఫ్ వో శ్రీనివాసులు నమ్మారు.
ఈ క్రమంలో ఆ సైబర్ మోసగాడు ఎంపీ ఉదయ శ్రీనివాస్ పేరు చెప్పి అత్యవసరంగా డబ్బులు కావాలని వండర్లా బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపించమని చెప్పాడు. శ్రీనివాసరావు కూడా తన యజమాని డబ్బులు పంపమ న్నడని భావించి.. డబ్బులు పంపించాడు.ఇలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 11 సార్లు ఎంపీ పేరు చెప్పి రూ.92.5 లక్షలు వసూలు చేశారు. అయితే ఈ నెల 8న ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాసులు సిఎఫ్ఓ శ్రీనివాస రావు కలుసుకోవ డంతో అసలు విషయం బయట పడింది. డబ్బులు పంపమని తానెన్నడూ కోరలేదని ఎంపీ చెప్పడంతో ఇది సైబర్ మోసమని గుర్తించిన శ్రీనివాసరావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎంపీ పేరుతో ఈ మోసం జరగడంతో దీంతో హైదరాబాద్ లోని సైబరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేశారు. ఇప్పటివరకు పోలీ సులు ఏడు లక్షల రూపాయలను మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. మిగిలిన డబ్బును వెనక్కి తీసుకురా వడానికి పోలీసులు ప్రయత్ని స్తున్నారు. పోలీసులు ఒకవైపు డబ్బులు ఎవరి బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లాయో తెలుసు కునేందుకు బ్యాంక్ రికార్డులు, కాల్ డేటా రికార్డులు, ఐపీ అడ్రస్ లను పరిశీలిస్తూనే.... మరోవైపు నిందితు లను పట్టుకునేం దుకు ప్రయత్నం చేస్తున్నారు.