కూకట్ పల్లిలో మహిళ దారుణ హత్య

మైనర్ బాలిక సహస్ర హత్య ఉతంతాన్ని మరిచిపోకముందే అలాంటి ఘటనే మరొకటి కూకట్ పల్లిలో  జరిగింది. కూకట్పల్లిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ లోని 13వ అంతస్తు లో ఒక మహిళను అతి దారుణంగా హత్య చేశారు.  కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి కుక్కర్ తో  తలపై గట్టిగా మోది అతి కిరాతకంగా హత్య చేశారు. నెలరోజుల కిందట కార్మికులుగా వచ్చిన జార్ఖండ్ వాసులే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు మహిళ హత్య తర్వాత జార్ఖండ్ వాసులు కనిపించ కపోవడంతో వారిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

కూకట్పల్లిలోని లేక్ స్పాన్ అపార్ట్మెంట్ లో 13 వ అంతస్తు లో రేణు అగర్వాల్(50) అనే మహిళ తన భర్త , కొడుకు తో కలిసి నివాసం ఉంటున్నారు. రేణు అగర్వాల్ భర్త , కొడుకు వ్యాపారం చేస్తుంటారు. ఇంటిలో పని కోసమని ఝార్ఖండ్ నుంచి హర్ష, రోహన్  లను తీసుకొని వచ్చారు.  ఈ ఇద్దరు కార్మికులు నెల రోజుల నుంచి వీరితో పాటే నివాసం ఉంటు న్నారు. కాగా బుధవారం (సెప్టెంబర్ 10) ఉదయం యధాప్రకారం రేణు అగర్వాల్ భర్త, కుమారుడు  షాపుకు వెళ్లిపోయారు.

సాయంత్రం నుంచి రేణు అగర్వాల్  ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏడు గంటల సమయంలో భర్త , కొడుకు ఇంటికి వచ్చారు.ఎంత కొట్టినా   తలుపులు తెరవక పోవడంతో.. భర్తవెంటనే బ్యాక్ డోర్ నుంచి లోపలికి ఒకరిని  పంపించి తలుపులు ఓపెన్ చేయించి చూడగా...ఇంటి హాల్ లో రేణు అగర్వాల్ రక్తం మడుగులో పడి ఉన్నారు.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొ ని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమేరా ఫుటేజీల ఆధారంగా  హర్ష, రోహన్ లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారిరువురూ బైక్ పై బ్యాగ్ తీసు కొని వెడుతన దృశ్యాలు  సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.  వాటిని ఆధారంగా వారిని పట్టుకునేందుకు ఇద్దరినీ పట్టుకు నేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu