సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్‌లో మరో ఏడుగురు అరెస్ట్
posted on Sep 19, 2025 8:27PM

సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది... దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేసి కటక టాల వెనక్కి పంపించారు... మాజీ మంత్రివ ర్యులు ఆఫీసులో పనిచేసిన ఓ నిందితుడికి దురాశ పుట్టింది... దీంతో మరి కొంత మంది తో చేతులు కలిపి నకిలీ లబ్ధిదారులను పుట్టించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జారీ చేసి వాటిని తమ ఖాతాలో జమ చేసుకొని డబ్బులు విత్ డ్రా చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో లక్షల రూపాయలు స్వాహా చేశారు.... ఈ కేసు కాస్త వెలు గులోకి రావడంతో జులై 15వ తేదీన పోలీసులు జోగులా నరేష్ కుమార్, బాలగుని వెంకటేష్, కొర్ల పతి వంశీ, పులిపాక ఓంకార్... అనే నలుగురు నిందితులను అరెస్టు చేసి ... జైలు కు పంపించారు.
ఒకవైపు ప్రభుత్వం మరోవైపు నిజమైన బాధితులను మోసం చేసిన ఈ నిందితులపై ఐపిసి సెక్షన్ ప్రకారం 409,417,419,467,120(b) సెక్షన్లుIT act 66(c) కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. అయితే ఈరోజు ఈ కేసులో పోలీసులు పొట్ల రవి, జంగమ్మ నాగరాజు, మట్టేటి భాస్కర్, ధర్మవరం రాజు, కాంపల్లి సంతోష్, చిట్యాల లక్ష్మి, అసంపెల్లి లక్ష్మి మరో ఏడుగు రిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే నిందితులు ఇప్పటివరకు మొత్తం 8.71 లక్షల రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేసినట్లు పోలీ సులు గుర్తించారు.
అయితే నిందితుల్లో ఒకరు మాజీ మంత్రి వర్యులు ఆఫీసులో పనిచేసేవారు. అతనిలో దురాశ పుట్టి... సీఎం ఆఫీస్ చెక్కులను దుర్విని యోగం చేసినట్లుగా పోలీసులు గుర్తిం చారు. ఈ నిందితు లందరూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరందరూ కలిసి నకిలీ లబ్ధిదారులు గా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తమ ఖాతాలో జమ చేసుకొని డబ్బులు విత్‌డ్రా చేసుకుని వారి ఇష్టానికి డబ్బు లను వాడుకు న్నారు. 2023 ఎన్నికల తర్వాత 230 చెక్కులను అక్రమంగా తీసు కొని గుట్టు చప్పుడు కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్19 చెక్కులను నకిలీ లబ్ధిదారుల పేర్లతో వారి ఖాతాలో జమ చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు... ఇంకా మిగతా నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారిని పట్టుకునేం దుకు గాలింపు చర్యలు చేపట్టారు.