ఏపీ లిక్కర్ కేసులో ఈడీ భారీ నగదు స్వాధీనం

 

ఏపీ లిక్కర్ స్కామ్‌లో దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్,  బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్‌పుర్, ఢిల్లీ, ఏపీలలో అధికారులు తనిఖీలు చేపట్టారు. లెక్కల్లో చూపని రూ.38 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.  

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రభుత్వ  ఖజానాకు రూ.4వేల కోట్ల నష్టం వాటిల్లిందని సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. సోదాల్లో పలు కీలకమైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రధాన మద్యం బ్రాండ్ల స్థానంలో నిందితులు కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ పేర్కొంది. దీని ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu