దుండిగల్‌ వద్ద రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

హైదరాబాద్ లో సోమవారం (డిసెంబర్ 8) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలోని జ్యోతి మిల్క్ కంపెనీ సమీపంలో ఓ టిప్పర్ లారీ టూవీలర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.    

ఈ ప్రమాదంలో  రాపిడో బైక్‌పై ప్రయాణిస్తున్న డ్రైవర్, మహిళ ప్రయాణికురాలు  మరణించారు.  ప్రమాదం జరగగానే టిప్పర్ లారీ డ్రైవర్ పరారయ్యాడు. పరారీలో ఉన్న టిప్పర్ లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu