హైదరాబాద్ లో ట్రంప్ రోడ్డు!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబస్ సమ్మిట్ కు ముందు మరో కీలక నిర్ణయం తీసుకుంది. భాగ్యనగరంలోని రోడ్లకు గ్లోబల్ ఐకాన్ ల పేర్లు పెట్టాలని నిర్ణయించుకుంది.  ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, ప్రతిభామంతుల  గౌరవార్థం రాష్ట్రంలోని పలు ప్రధాన రహదారులకు వారి పేర్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అందులో భాగంగానే..  ఓ ఆసక్తికరమైన, పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చే సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ పక్కన ఉన్న హై ప్రొఫైల్ రహదారికి  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ విషయమై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు మరియు అమెరికా రాయబార కార్యాలయానికి రాష్ట్రం ఇప్పటికే లేఖలు రాసింది.  అక్కడ నుంచి అనుమతి లభించి ఈ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టడం జరిగితే..  అమెరికా వెలుపల ఒక సిట్టింగ్ అధ్యక్షుడి పేరు మీద వెలిసిన తొలి రోడ్డు మార్గం ఇదే అవుతుంది. 

ఇక పోతే.. రావిర్యాల ప్రాంతంలో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును రేడియల్ రింగ్ రోడ్డుతో  కలిపే గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించింది. దేశ పారిశ్రామిక రంగానికి, ప్రజాహితానికి రతన్ టాటా చేసిన  సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది.   అలాగే.. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌కు గౌరవంగా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఒక ప్రముఖ రహదారికి గూగుల్ స్ట్రీట్ గా నామకరణం చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.  తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రానికి  గ్లోబల్ కనెక్టివిటీ, పెట్టుబడులకు ద్వారాలు తెరవడమే కాకుండా,  బ్రాండ్ తెలంగాణను అంతర్జాతీయ వేదికపై బలోపేతం చేయడానికి దోహదపడుతుందంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu