గ్లోబల్ సమ్మిట్ గెస్టులకు తెలంగాణ చిరుతిళ్లు
posted on Dec 8, 2025 9:19AM

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిథులు, విశిష్ఠ అతిథుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్ కోసం ప్రత్యేక కిట్ ను రూపొందించింది. ఉదయం నేపాల్, బ్యాంకాక్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల ఆదివారం (డిసెంబర్ 7) ఉదయమే వచ్చిన ప్రతినిధులకు తెలంగాణ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికి ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరానికి తోడ్కోని వెళ్లింది. అక్కడ నుంచి వారికి కేటాయించిన హోటల్స్ కు తరలించింది.
అక్కడ వారికి ఈ ప్రత్యేక కిట్ ను అందజేసింది. ఈ కిట్ లో తెలంగాణ చిరుతిళ్లు సకినాలు, చెక్కగారెలు, నువ్వుల లడ్డూ, ఇప్పపువ్వు లడ్డూ, మక్క పేలాలు, బాదమ్‌కీ జాలి వంటివి ఉన్నాయి. ఇలా ఉండగా తెలంగాణ రైజిగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరయ్యే వారిని ఆహ్వానించేందుకు డిప్యూటీ కలెక్టర్ స్థాయికి చెందిన వంద మంది అధికారులతో ఒక బృందాన్ని నియమించింది.
ఇక సమ్మిట్ జరిగే సమయంలో హైదరాబాద్ ధమ్ బిర్యానీ, పాయా, మటన్ కర్రీతో పాటు వెజ్, నాన్‌వెజ్‌కు సంబంధించిన పలు వంటలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే విధంగా విదేశీ ప్రతినిధుల కోసం ఆయా దేశాలకు చెందిన వంటలను కూడా సిద్ధం చేస్తోంది.