మంచు తెర మాటున లంబసింగి.. మన్యానికి పోటెత్తుతున్న పర్యాటకులు
posted on Dec 8, 2025 9:55AM

శీతాకాలంలో మంచు తెరల మధ్య మన్యం అందాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా అల్లూరి జిల్లా చింతపల్లి, లంబసింగి వంటి ప్రాంతాలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు మంచు వానలా కురుస్తోంది. ఈ సందర్భంగా మన్యం అందాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అటువంటి అద్భుత అనుభవాన్ని పొందేందుకు పర్యాటకులు మారేడుమిల్లి, లంబసింగి ,తాజంగి డ్యాం, చెరువులు వ్యానo, వ్యూ పాయింట్, కొత్తపల్లి జలపాతం, వంజంగి వ్యూపాయింట్, అరకు చూడటానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు.
లంబసింగిలో ఆదివారం 7డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే చింతపల్లిలో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజులలో ఈ ఉష్ణోగ్రతలు మరింత పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. చలిలో మన్యం అందాలను ఆస్వాదించేందుకు ఓ వైపు పర్యాటకులు పోటెత్తుతుండగా, మరో వైపు చలి, మంచు కారణంగా ఆరోగ్యసమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చలికాలంలో ఆరోగ్య రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు చలికి ఎక్స్ పోజ్ కాకుండా ఉండటం మేలని చెబుతున్నారు.