బల్క్ డ్రగ్ పరిశ్రమ పనులు నిలిపివేత

 

బల్క్ డ్రగ్ పరిశ్రమ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని హోం మంత్రి అనిత ఆదేశించారు. 16 రోజులుగా మత్స్యకారులు పరిశ్రమ ఏర్పాటు వెనక్కి తీసుకోవాలని  డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనకాపల్లి వచ్చిన హోం మంత్రి అనిత కాన్వాయ్‌ను మత్స్యకారులు అడ్డుకుని పరిశ్రమ పనులు ఆపేయాలని ఆందోళనలు చేయటంతో పార్క్ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు. సమస్యను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

 అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజ్యపేటలో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు తక్షణమే రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా  నిరసనలో సేపడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం హాస్యాస్పదమని అన్నారు. ప్రమాదకర అతి కాలుష్యకరమైన బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ వల్ల మత్స్య సంపద హాని కలుగుతుందని, పరిశ్రమ వ్యర్ధాలు వల్ల మత్స్య సంపద నాశనం అయిపోద్దని, గాలి,నీళ్లు, సహజ సంపద కలుషితం అవుతుందని అన్నారు. పరిశ్రమ నిర్మాణాన్ని అనుమతులు రద్దు చేసే వరకు పోరాటం ఆగదని కూటమి ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu