సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
posted on Sep 29, 2025 5:38PM
.webp)
ప్రజలకు సద్దుల బతుకమ్మ సందర్బంగా మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని పూలను పూజించే గొప్ప సంస్కృతికి తెలంగాణ నెలవని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో అక్కాచెల్లెళ్లందరికీ ఆయన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ తెలంగాణ ప్రజల సామూహిక జీవన విధాననికి, ఐక్యతకు నిదర్మనమన్నారు.
బతుకమ్మ విశిష్ఠతను ప్రపంచానికి చాటడానికి సరూర్ నగర్ స్టేడియంలో 10 వేల మందికి మహిళలతో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వేడుకలు నిర్వహింస్తుదని ఆయన తెలిపారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పూల పండుగను మహిళలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకొని, చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే బతుకమ్మ సాంస్కృతిక సంప్రదాయం తెలంగాణ కు ప్రత్యేకమని చెప్పారు. కష్టాలన్నీ తొలగి, ప్రతి ఇల్లూ సుఖసంతోషాలతో నిండేలా, ప్రకృతిమాత బతుకమ్మ దీవెనలు అందించాలని రేవంత్‌రెడ్డి ప్రార్థించారు.