మురగదాస్ సింప్లిసిటీ
posted on Aug 13, 2013 @ 9:19PM
గజిని, స్టాలిన్, తుపాకీ ఈ సినిమాల పేరు చెప్తే చాలు అవి తెరకెక్కించిన డైరెక్టర్ రేంజ్ ఏంటో తెలియడానికి.. మరి ఇతంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన ఆ డైరెక్టర్ రేంజ్ ఎలా ఉండాలి. అతని మెయిన్‌టెనెన్స్ ఎలా ఉండాలి.. కాని అలాంటి ఆడంబరాలకు నేను దూరం అంటున్నాడు క్రియేటివ్ జీనియస్ మురగదాస్..
గజిని సినిమాతో దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న మురగదాస్ ప్రస్థుతం తను తమిళ్‌తో తెరకెక్కించిన తుపాకి సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నాడు. గతంలో మురగదాస్ బాలీవుడ్‌లో రీమేక్ చేసిన గజిని సినిమా రికార్డు కలెక్షన్లు వసూలు చేయటంతో ఇప్పుడు ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.
అయితే తుపాకీ రీమేక్ కోసం ముంబైలో ఉంటున్న మురగదాస్‌కు ఓ కాస్ట్లీ ఫైవ్ స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేశాడు సదరు చిత్ర నిర్మాత.. అయితే ఇటీవల ఆ హోటల్ బిల్స్ పే చేసిన నిర్మాత అవాక్కయ్యాడట. ఎందుకంటే ఈ బిల్స్ మురగదాస్ భోజనానికి సంబందిన బిల్స్ ఒక్కటి కూడా లేదట.. ఎప్పుడు సందేశత్మక చిత్రాలను తెరకెక్కించే మురగదాస్ నిజ జీవితంలో కూడా అదే లైఫ్ స్టైల్ మెయిన్‌టెయిన్ చేస్తున్నాడు.
తన ఖర్చులు నిర్మాతకు భారం కాకుడదని భావించిన మురగదాస్ రోజూ తనకు ఇచ్చిన ఫైవ్‌స్టార్ హోటల్ భోజనం కాకుండా బయటికి వెళ్లి పక్కనే ఉన్న చిన్న హోటల్‌లో భోజనం చేసి వచ్చేవాడట.. ఏందుకలా అని అడిగిన నిర్మాతకు నేను తినే సౌత్ ఫుడ్‌కు ఇంత ఖర్చు ఎందుకు ఆ చిన్న హోటల్ సరిపోతుందిలే అన్నాడట.. అది విన్న నిర్మాతకు నోట మాటరాలేదు.. తెర మీద హీరోలను తయారు చేసే మురగదాస్ నిజజీవితంలో తానే ఓహీరో అనిపించుకున్నాడు.