అమితాబ్ పుట్టినరోజు కానుకగా త్రీడిలో షోలే
posted on Aug 14, 2013 @ 10:20AM
అమితాబ్ ఇప్పుడు బాలీవుడ్ దిగ్గజం, వరల్డ్ సినిమాలో ఓ ఐకాన్ కాని అమితాబ్ ఈ రేంజ్‌కు రావటానికి తొలి బీజం పడింది మాత్రం షోలే సినిమాతోనే.. అందుకే ఈ సినిమాకు బాలీవుడ్ చరిత్రలో ఓ ప్ర్తత్యేక స్థానం ఉంది.. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి వార్తల్లోకి వచ్చింది.
అమితాబ్, ధర్మేంద్ర హీరోలుగా అంజాద్ ఖాన్ విలన్‌గా తెరకెక్కిన ఈసినిమాను ఇప్పుడు త్రీడిలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే అందుకు సంభందించిన వర్క్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. అక్టోబర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకు రావాలనుకుంటున్నారు దర్శకనిర్మాతలు.
ఇప్పటికే మొగల్ ఈ అజమ్ లాంటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలను కలర్ చేసిన భారీ రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు అదే దారిలో కలర్ సినిమాలను 3డిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకలో భాగంగానే అమితాబ్‌కు యాక్షన్ హీరో ఇమేజ్ తీసుకు వచ్చిన షోలే సినిమాను 3డి ఫార్మాట్‌లోకి మారుస్తున్నారు. త్రిడీ పనులు..ముంబయ్ మాయా డిజిటల్ స్టూడియోలో..శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ అక్టోబర్ 11న అమితాబ్ 71వ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నున్నారు. 35 ఏళ్ల క్రితం వచ్చిన షోలేను ఇప్పుడు 3డిలో కి మార్చడం చాలా కష్టంతో కూడుకున్న పని అయినా తమకు ఈ సినిమా ఘనవిజయం సాదిస్తుందన్న నమ్మకం ఉందన్నారు 3డి వర్క్స్ చేస్తున్న ఆర్టిస్ట్‌లు.