'బిస్కెట్' ఆడియో గ్రాండ్ సక్సెస్! త్వరలో విడుదల!

  యువత, మాస్ ని ఆకర్షించే కొత్త చిత్రం 'బిస్కెట్' విడుదల కు సిద్ధమవుతుంది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఆడియో ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. పాటలకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ వారంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సినిమా ను అక్టోబర్ మూడో వారంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రేక్షకులకు తగిన రీతిలో కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఈ చిత్రం ద్వారా అందనుంది. బ్యానర్: గోదావరి ప్రొడక్షన్స్, డ్రీమ్స్ నటులు: అరవింద్ కృష్ణ, డింపుల్ చోపడే, వెన్నెల కిషోర్, రమేష్, అజయ్, అలీ, ఎమ్ ఎస్ నారాయణ, చలపతి రావు, రఘు,భరత్ తదితరులు కథ,కధనం,దర్శకత్వం, సంగీతం: అనిల్ గోపిరెడ్డి కెమెరా: జయపాల్ రెడ్డి కూర్పు: మధు రెడ్డి నిర్మాతలు: స్రవంతి, రాజ్

'అత్తారింటికి...' పైరసీ కష్టాలు తీరలేదు

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాకు పైరసీ కష్టాలు ఇంకా తీరినట్టు కనిపించడం లేదు. రిలీజ్ కి ముందు పైరసీ బారిన పడిన ఈ సినిమా విడుదల తరువాత కూడా అదే సమస్యలా మారింది. ఒకవైపు 'అత్తారింటికి దారేది' సినిమా విడుదలై కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తుంటే..పైరసీ సీడులు అదే స్థాయిలో దొరుకుతున్నాయి. ఈ చిత్రం పైరసీ సిడీలు మరో సారి హైదరాబాద్ లో బయిటపడి అందరకీ షాక్ ఇచ్చింది. అప్పటడికీ ఈ చిత్ర ప్రొడక్షన్ టీం పైరసీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నా ఫలితం లేకుండాపోతోంది.     మరోవైపు 'అత్తారింటికి దారేది' సినిమాతో పవర్ స్టార్ మరోసారి తన పవర్ ని చూపించాడు. విడుదలైన మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'అత్తారింటికి దారేది' సినిమా తొలిరోజు కలెక్షన్ల లలో కొత్త రికార్డులు సృష్టించింది.ప రిస్థితి చూస్తుంటే సినిమా కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‘అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

పవన్ ‘అత్తారింటికి దారేది' రికార్డ్

        విడుదలకు ముందే శాటిలైట్స్ రైట్స్, ఇతర విషయాల్లో పలు రికార్డులను నెలకొల్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన‘అత్తారింటికి దారేది' చిత్రం విడుదల తర్వాత కూడా రికార్డులు బద్దలు కొట్టడం మొదలు పెట్టింది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా..తొలిరోజు కలెక్షన్ల రికార్డ్ సృష్టించింది. ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీయార్ సినిమా బాద్షా (రూ. 9 కోట్లకుపైగా) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. పరిస్థితి చూస్తుంటే సినిమా కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో అత్తారింటికి దారేది కలెక్షన్లను కలుపుకొంటే తొలిరోజే మొత్తం 13కోట్లు రాబట్టినట్టు సిని వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో పవన్ సరసన సమంత, ప్రణీత నటించారు.   The area wise break up of Attarintiki Daredi 1st day collections is here: Nellore -0.58 cr Ceeded - 2.12 cr Nizam -3.29 cr Guntur -1.41 cr West Godavari - 0.77 cr East Godavari - 1.05 cr Krishna - 0.71 cr Total Attarintiki Daredi Collections in AP: 10.58 cr AP – 10.8 crores US – 2.67 crores Total – 13.47 crores

''అత్తారింట్లో..'' మెగాస్టార్ పై పవర్ స్టార్ సెటైర్

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ 'అత్తారింటికి దారేది' లో ఒక సన్నివేశంలో ఆయన పలికిన సంభాషణలు ఇండస్ట్రీలో పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. చిరంజీవిపై పవన్ కళ్యాణ్ సెటైర్లు విసిరే సంభాషణ కావడంతో దాని పట్ల అందరూ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాలో ఒక సీన్ లో పవన్ టీవిలో చూస్తూ....   పవన్ : ఆయన ఎవరూ'' ఎంఎస్: చిరంజీవి సార్'' పవన్ : యాక్టింగ్ బాగా చేస్తున్నాడు. ఇప్పుడేం చేస్తున్నారు?'' ఎంఎస్: మానేసారు సార్'' పవన్ : ఎందుకు..?'' ఎంఎస్: వాళ్ళబ్బాయి చేస్తున్నాడు. త్రివిక్రమ్ కి చిరంజీవి ఎవరో తెలియదనే సీన్ ఎందుకు సృష్టించాల్సి వచ్చిందో ఎవరి అర్ధం కావడం లేదు. అసలు ఈ ఐడియా త్రివిక్రమ్ దేనా లేక పవర్ స్టార్ దా అని చర్చించుకుంటున్నారు.    

పూరి పుట్టినరోజు

  ఇన్నాళ్లు హీరో అంటే... చెడు పై పోరాడే వీరుడు... మంచి కోసం ప్రాణాలు ఇచ్చే సాహసి తొలి చూపులోనే ప్రేమలో పడేసే సమ్మోహనాస్త్రం కాని ఇప్పుడు ట్రెండ్‌ మారింది... హీరోయిజానికి కొత్త అర్థాలు వచ్చాయి.... కాదు కాదు తీసుకు వచ్చాడు.... ఆయన సినిమాలో హీరో ఓ ఇడియట్‌ , ఓ దేశముదురు, ఓ పోకిరి, దందాను కూడా వ్యాపారంలా ఆర్గనైజ్‌ చేసే బిజినెస్‌మేన్‌ డెబ్బై ఏళ్ల వయసులో కూడా యాక్షన్స్‌, రోమాన్స్‌ చేసే ప్లే బాయ్‌.. ఇలా హీరోయిజానికి కొత్త నిర్వచనం చెప్పిన స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాద్‌.     ఇప్పుడు స్టార్‌ డైరెక్టర్‌గా ఉన్న పూరికి ఆ ప్లేస్‌ అంత ఈజీగా ఏం రాలేదు.... ఎన్నో ఏళ్ల శ్రమ కృషి తరువాత పూరి ఓ స్టార్‌ అయ్యాడు.. స్టార్‌ మేకర్‌ అయ్యాడు... కమర్షియల్‌ తెలుగు సినిమాను కొత్త ట్రాక్‌లో నడిపిస్తున్న పూరి పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్‌ పై ఓ లుక్‌     రామ్‌గోపాల్‌ వర్మ లాంటి స్టార్‌ డైరెక్టర్‌ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన పూరి తొలి అవకాశంతోనే తనేంటో ప్రూవ్‌ చేసుకున్నాడు. ఓ దర్శకుడికి స్టార్‌ హీరోతో సినిమా చేసే అవకాశం వస్తే ఎంత కసిగా సినిమా చేస్తాడో నిరూపించాడు పూరి. రామ్‌గోపాల్‌ వర్మ దగ్గర హిందీ శివ సినిమా నుంచి పని చేసిన పూరి తరువాత కొన్ని టివి సీరియల్స్‌కు కూడా వర్క్‌ చేశాడు. అదే సమయంలో బిగ్‌ స్క్రీన్‌ మీద తనను తాను ప్రూవ్‌ చేసుకోవాలనుకున్న పూరికి అదృష్టం తలుపు తట్టింది. తొలి సినిమానే పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా బద్రి... ఈ సినిమాతోనే తన ఏంటో చూపించాడు పూరి. అప్పటి వరకు పవన్‌కు ఉన్న ఇమేజ్‌కు భిన్నంగా సరికొత్తగా ప్రజెంట్‌ చేశాడు.. అంతే కాదు ఇది పవన్‌ స్టామినా అంటూ ప్రూవ్‌ చేశాడు.... బద్రి సినిమా... పూరి ఫస్ట్‌ సినిమా... కెరీర్‌లో ఫస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌...     తొలి సినిమాతోనే భారీ హిట్‌ అందుకున్న పూరి రెండు సినిమాతో మాత్రం నిరాశపరిచాడు.... రెండో ప్రయత్నంగా చేసిన బాచీ సినిమా పూరికి చేదు అనుభవాన్నే మిగిల్చింది... పూరి రెండో సినిమానే డిజాస్టర్‌, దీంతో పూరి పని అయిపోయిందనుకున్నారు అంతా... తొలి సినిమా సక్సెస్‌ కూడా లక్‌ అన్నారు... అప్పటి వరకు సినిమాలు చేస్తామన్న నిర్మాతలు మోహం చాటేశారు... మళ్లీ స్ట్రగుల్‌ పూరి మళ్లీ తనను తాను ప్రూవ్‌ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.... ఆ సమయంలో తనతో సినిమా చేయాడానికి ఏ స్టార్‌ హీరో ముందుకు రాడనుకున్న పూరి... తానే ఓ స్టార్ ను తయారు చేయాలనుకున్నాడు... అదే సమయంలో పూరితో కలిశాడు, రవితేజ. ఇద్దరిలో ఒకే కసి..... ఇక్కడే బతకాలి... ఇక్కడే నిరూపించుకోవాలి... ఇక్కడే ఎదగాలి...  పూరి, రవితేజల కాంభినేషన్‌ కమర్షియల్‌ సినిమాకు కొత్త రూట్‌ చూపించింది. అప్పటి వరకు తెలుగు సినిమా హీరోకు ఉన్న అర్థాన్ని సరికొత్తగా ఆవిష్కరించింది. ఈ ఇద్దరి కాంభినేషన్లో వచ్చిన ఫస్ట్‌ మూవీ ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం. జీవితంలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఇద్దరు వ్యక్తుల కథను సినిమాగా తెరకెక్కించిన పూరి సక్సెస్‌ సాదించాడు... రెండో సినిమాతో వచ్చిన విమర్శలకు సమాదానం చెపుతూనే తన సక్సెస్‌ లక్‌ కాదు అని ప్రూవ్‌ చేశాడు.     డైరెక్టర్‌గా పూరి ఇప్పుడు  సక్సెస్‌ అండ్‌ సెటిల్డ్‌... కాని ఇంకా ఏదో వెలితి అందుకే మరో సక్సెస్‌ అవసరం ఏర్పడింది. ఈ సారి కూడా తన సినిమాకు హీరోగా రవితేజనే ఎంచుకున్నాడు... అప్పటి వరకు ఉన్న ట్రెండ్‌ మారుస్తూ తిట్టును టైటిల్‌గా మార్చి ఇడియట్‌ సినిమా తెరకెక్కించాడు... ఈ సినిమాతో పూరి జగన్నాద్‌తో పాటు రవితేజ రేంజ్‌ కూడా మారిపోయింది. ఒకేసారి ఈ సినిమాతో రవితేజ స్టార్‌ హీరోగాను, పూరి స్టార్‌ డైరెక్టర్‌గాను మారిపోయారు.. అంతేకాదు అంత వరకు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న రవితేజను  స్టార్‌గా మార్చిన పూరి  స్టార్‌మేకర్‌ అయ్యాడు.     ఇడియట్‌తో మొదలైన పూరి విజయ పరంపర తరువాత ఎదురులేకుండా సాగింది.. రవితేజతో భారి హిట్‌ అందటంతో తన నెక్ట్స్‌ సినిమా కూడా మళ్లీ రవితేజ తోనే ప్లాన్‌ చేశాడు.... అదే అమ్మానాన్న ఓ తమిళమ్మాయి తన ఫస్ట్‌ సినిమా నుంచి టైటిల్‌ విషయంలో స్పెషల్‌ కేర్‌ తీసుకునే పూరి ఈ సినిమా విషయంలో కూడా తన మార్క్‌ చూపించాడు..     అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పూరి రవితేజల కాంబినేషన్‌లో మరో హిట్ హ్యాట్రిక్‌ హిట్‌. దీంతో పూరి సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా స్థిరపడిపోయాడు. అప్పటివరకు మొహం చాటేసిన అవకాశాలు పూరిని వెత్తుక్కుంటూ రావటం మొదలైంది.. కాని పూరి మాత్రం ఇక తడబడదలుచుకోలేదు... ఆచూతూచి అడుగులు వేయాలని డిసైడ్‌ అయ్యాడు... అవకాశాల వెంట పాకులాడకుండా తన కెరీర్‌కు ఉపయోగపడే అవకాశాలను మాత్రమే ఎంచుకోవాలనుకున్నాడు...     వరుస సినిమాలు చేసినా సక్సెస్‌, ఫెయిల్యూర్‌ ఒకదాని వెంట ఒకటి... పూరితో ఆడుకుంటునే ఉన్నాయి...  కాదు ఈ సారి నేనే వాటితో ఆడుకోవాలనుకున్నాడు.. ఎవడు కోడితే బాక్సాఫీస్‌ రికార్డులన్ని బద్దలవుతాయో వాడే పూరి అని తెలియ జేయాలనుకున్నాడు. అందుకే మహేష్‌తో సినిమా చేసే అవకాశం రాగానే తానేంటో మరోసారి చూపించాలనుకున్నాడు. అలా తెరకెక్కిందే పోకిరి...     75 సంవత్సరాలుగా చెదలు పట్టిన టాలీవుడ్‌ రికార్డుల దుమ్ము దులిపిన సినిమా పోకిరి.. మహేష్‌ కు అప్పటివరకు ఉన్న ఇమేజ్‌ను చెరిపేస్తూ ఒక్కసారిగా సూపర్‌స్టార్‌ను చేసిన సినిమా పోకిరి.. ఈ సక్సెస్‌తో పూరి నెంబర్‌ వన్‌ కాంపీటేషన్‌లోకి వెళ్లిపోయాడు.. స్టార్‌ హీరోలు కూడా పూరితో సినిమా చేస్తే చాలు అనే స్టేజ్‌కు వచ్చేశాడు...  ఇక ఎప్పుడు పూరి వెనుతిరగి చూడలేదు వరుస అవకాశాలు... రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా అప్పుడప్పుడు నటునిగా కూడా అలరిస్తున్న స్టార్‌... కాని కాలం అలా ప్రశాతంగా ఎందుకు ఉంటుంది.. అందుకే ఓ మంచి ఓ చెడు ఒకేసారి పూరి తలుపుతట్టాయి. పూరి జీవితంలో ఆటుపోట్లు కామన్‌ అయిపోయాయి... అన్ని రోజులు నమ్మకంగా ఉన్న పూరి ఫ్రెండ్‌ హ్యాండ్‌ ఇచ్చాడు... ఒకటి రెండు కాదు ఏకంగా 30 కోట్ల అప్పు మిగిల్చి వెళ్లిపోయాడు... అయినా పూరి భయపడలేదు... తన దగ్గర ఉన్న టాలెంట్‌ తనను ఎప్పుడు కాపాడుతుందని నమ్మాడు... అదే ధైర్యంతో సినిమాలు చేశాడు.... ఈ టైంలో పూరిని ఓదార్చిన సంఘటనా.. ఒకటి ఉంది... అదే అమితాబ్‌తో సినిమా చేసే అవకాశం...   రామ్‌గోపాల్‌వర్మ రికమండేషన్‌తో అమితాబ్‌తో సినిమా చేసే చాన్స్‌ అయితే వచ్చింది... మరి ఆ సినిమా ఎలా ఉండాలి.. ఇంటర్‌నేషనల్‌ ఫేమ్‌ ఉన్న అమితాబ్‌ను ఎంతో మంది దర్శకులు అన్ని రకాలుగా చూపించేశారు.. కొత్తగా చూపించాలనుకున్నా ఈ వయసులో అమితాబ్‌ ఏం చేయగలడు.....? ఇలాంటి ప్రశ్నలెన్నో....? ఏమైనా చేయగలడు.. అవును బుడ్డా హోగా తేరాబాప్‌ సినిమాతో ఇదే ప్రూవ్‌ చేశాడు పూరి... అమితాబ్‌ను 70 ఏళ్ల వయసులో కూడా యాంగ్రీ యంగ్‌ మేన్‌గా చూపించి బాలీవుడ్‌కే దిమ్మ తిరిగిపోయే హిట్‌ ఇచ్చాడు... చాలా రోజులగా తాత తండ్రి పాత్రలకే పరిమితమైన బిగ్‌బితో రోమాంటిక్‌ యాక్షన్‌ సీన్లు చేయించి అరె వాహ్‌ అనిపించాడు...     మహేష్‌తో బిజినెస్‌మేన్‌, రవితేజతో దేవుడు చేసిన మనుషులు, పవన్‌తో కెమరామేన్‌గంగతో రాంబాబు ఇవన్నీ దాదాపుగా నెల రోజుల్లో కంప్లీట్‌ అయిన సినిమాలే ఇంత స్పీడ్‌గా సినిమా చేయటమే కాదు. అంతే స్పీడ్‌గా టాప్‌ పొజిషన్‌కి వచ్చేశాడు. రచయితగా, దర్శకునిగా, నిర్మాతగా అన్ని విభాగాల్లో అవార్డులు రివార్డులు అందుకున్న పూరి అసలు సిసలైన క్రియేటర్‌.  ఓ మనిషిని కసి ఏ స్థాయికి చేరుస్తుంది అన్న ప్రశ్నకు అసలైన సమాధానం పూరి జీవితం... సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌తో సంబందం లేకుండా తన పని తాను చేసుకు పోతున్న పూరి మరిన్ని హిట్‌ సినిమాలతో మనల్ని అలరించాలని ఆశిస్తూ మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం

మహేష్ బాబు ఇంట్లోకి ఆగంతకుడు

      టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లోకి ఓ దుండగుడు చొరబడి చోరికి ప్రయత్నం చేశారు. ఓ వ్యక్తి ముఖానికి మంఖీ క్యాప్ ధరించి వెనకనుండి అద్దం పగలగొట్టుకుని నేరుగా మహేష్ బాబు బెడ్ రూంలోకి ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నించాడు. అలికిడి విన్న పని మనుషులు, భద్రతా సిబ్బంది అక్కడికి రావడంతో వచ్చిన దారినుండే పారిపోయాడు. ఇంటి వెనుక ఉన్న కిటికీ అద్దాలను పగులకొట్టి సెక్యూరిటీ వారి కళ్లు కప్పి లోనికి వచ్చినట్లు చెబుతున్నారు. అంటే సినిమాలో మాదిరే ఇతడు చోరికి యత్నించినట్లు కనబడుతోంది.   విషయం తెలుసుకున్న మహేష్ బాబు పోలీసులకు పిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన జూబ్లీహిల్స్ పోలీసులు వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. కిటీకీపై పడ్డ వేలిముద్రలను సేకరించారు. ఐపీసీ సెక్షన్ 457, 511 కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

'అత్తారింటికి దారేది' రివ్యూ: పవర్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

      ఎన్నో వాయిదాలు, వివాదాలు అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం త్రివిక్రమ్ తరహా పంచ్ లతో, పవన్ పవర్ ఫెరఫార్మెన్స్ తో అదరకొడుతుందనే నమ్మకం టీజర్ విడుదల అయిననాటి నుంచీ అందరిలో వ్యక్తమవుతోంది. పైరసి బారిన పడిన కారణంగా దసరా కానుకగా రావల్సిన ఈ సినిమా రెండు వారాల ముందే థియేటర్లలోకి వచ్చేసింది. మరీ ఈ సినిమా ఎలా వుందో చూద్దాం:   స్టోరీ: రఘునందన్ (బోమన్ ఇరానీ) మిలాన్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త, అతని మనవడు గౌతమ్ నంద (పవన్ కళ్యాణ్). రఘునందన్ కూతురు సునంద (నదియా) తనకు నచ్చిన వాడిని పెళ్ళి చేసుకోవడంతో ఇంట్లో నుంచి పంపించేస్తాడు. ఆ తరువాత చాలా కాలం వరకు సునంద, రాఘునందన్ మధ్య సంబంధాలు వుండవు. రఘునందన్ ముసలివాడు అయిన తరువాత తన తప్పు తెలుసుకొని తన కూతురుని ఒప్పించి ఎలాగైన ఇండియా నుంచి తిరిగి తీసుకొనిరమ్మని తన మనవడు గౌతమ్ నందని అడుగుతాడు. తాత కోరిక తీర్చడానికి గౌతమ్ నంద 'మిలాన్' నుండి 'ఇండియా'వస్తాడు. ఇండియాకి వచ్చిన గౌతమ్ నంద తన అత్తను ఒప్పించడానికి ఎలాంటి దారిని ఎంచున్నాడు. ఆ దారిలో ఎలాంటి వ్యూహాలు రచించాడనేదే...'అత్తారింటికి దారేది' కథ.   కళాకారుల పెర్ఫామెన్స్: పవన్ కళ్యాణ్ అంటేనే ఎంటర్ టైన్మెంట్...ఈ సినిమాలో పవర్ స్టార్ తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కామెడీ, సెంటిమెంట్, డైలాగ్ డెలివరీ ప్రతి దాంట్లోను బెస్ట్ పెర్ఫామెన్స్ తో అలరించాడు. కేవ్వుకేక’ సాంగ్ కి స్పూఫ్, కాటమరాయుడ సాంగ్ మరియు దానికి ముందు వచ్చే ఓ ఎపిసోడ్ లో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. 'సమంత'  టాలీవుడ్ లో ఆమె గోల్డెన్ రన్ కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఈ సినిమాలో రొమాన్స్ కొంచెం తక్కువగానే వున్న..ఆమె వున్న సన్నివేశాలలో మాత్రం 'సమంత'  ఆకర్షణగా నిలుస్తుంది. ప్రణిత పాత్ర చాలా చిన్నదే అయినప్పటికీ ఉన్నంతవరకూ బాగానే చేసింది. అలాగే బాపు గారి బొమ్మ పాటలో చీరల్లో అందంగా కనిపించింది.   'బోమన్ ఇరానీ' కథకు ముఖ్యమైన పాత్ర. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పవన్ కళ్యాణ్ అత్త క్యారెక్టర్ లో 'నదియా' నటన చాలా బాగుంది. బ్రహ్మానందం సెకండాఫ్ లో బాగా నవ్వించాడు. బ్రహ్మానందంపై తీసిన రెడియేటర్ స్పూఫ్, అహల్య ఎపిసోడ్ చాలా ఎంటర్ టైనింగ్ వున్నాయి. ఎంఎస్ నారాయణ, అలీ, పోసాని కృష్ణమురళి తమ వంతు నవ్వించగా, రావు రమేష్, కోట శ్రీనివాస రావులు తమ పరిధిమేర నటించారు.    సాంకేతిక విభాగం: త్రివిక్రమ్ శ్రీనివాస్..ఈ సినిమాకి మరో స్టార్ అని చెప్పాలి. సింపుల్ స్టోరీ లైన్ ను చాలా బాగా హాండిల్ చేశారు. తన మాటల మంత్రాలతో ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఎంటర్ టైనింగ్ గా చిత్రీకరించారు. సెంటిమెంట్ సన్నివేశాలలో కూడా త్రివిక్రమ్ పదునైన సంభాషణలతో ఆకట్టుకున్నాడు. పవర్ స్టార్ కళ్యాణ్ నుంచి ఏమేమి కోరుకుంటారో ఆ అంశాలన్నిటినీ కలగలిపి ఇచ్చిన ప్యాకేజీనే ‘అత్తారింటికి దారేది'. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ఆయన అందించిన సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది.  ప్రసాద్ మూరెళ్ళ సినిమాకి స్టన్నింగ్ సినిమాటోగ్రఫీ అందించారు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.   నోట్: టాలీవుడ్ లో 'బూతు' ఎక్కువైన ఇలాంటి రోజుల్లో..ఒక పెద్ద స్టార్ సినిమాలో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు, పాటలు లేకుండా 'క్లీన్' సినిమాని తీసినందుకు పవర్ స్టార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ని అభినందించాలి.               పంచ్ లైన్: ''అత్తారింటికి  దారేది''...పవన్ దెబ్బకు పైరసికి దారిలేదు 

అత్తారింటికి రామయ్యా సందడి

  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "అత్తారింటికి దారేది" చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విషయం అందరికి తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలయిన ఈ చిత్రానికి పవన్ అభిమానులతో పాటుగా ఎన్టీఆర్ అభిమానులు కూడా సందడి చేయనున్నారు. ఎందుకంటే ఈ చిత్రం ఇంటర్వెల్ సమయంలో ఎన్టీఆర్ నటించిన "రామయ్యా వస్తావయ్యా" చిత్ర ట్రైలర్ ను ప్రదర్శించనున్నారట. అంతే కాకుండా ఇటీవలే పవన్ సినిమా పైరసీకి గురైనప్పుడు.. ఎన్టీఆర్ ఈ సినిమాకు మద్దతు తెలిపాడు. అందువల్ల ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. అసలే వాయిదాలు పడి పడి విడుదలయిన ఈ చిత్రానికి తెలుగు అభిమానుల సందడితో రికార్డులు తిరగరాయడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు, అభిమానులు. త్రివిక్రమ్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం అభిమానులకు పెద్ద పండగలా ఉంది. ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

హాలీవుడ్‌లో ప్రకాష్‌రాజ్‌

      దాదాపు భారతీయ భాషలన్నింటిలో నటించిన ఓ దక్షిణాది నటుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. హీరో విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అన్ని విభాగాల్లో తానేంటో నిరూపించుకున్న ఆ నటుడు త్వరలో మరో రికార్డ్‌ సృష్టించనున్నాడు.     ప్రకాష్ రాజ్ ఇండియన్ స్క్రీన్ మీద విలక్షణ నటుడు అన్న పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్. తెలుగు తమిళ్తో పాటు భారతీయ భాషలన్నింటిలో నటించిన ఈ అరుదైన నటుడు ఇప్పుడు మరో గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు.     దక్షిణాదిలో విలన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ఇటీవల బాలీవుడ్ సినిమాలతో కూడా ఫాం కొనసాగిస్తున్నాడు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా మంచి నటునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.     నటనతో పాటు నిర్మాతగా కూడా మారిన ప్రకాష్ రాజ్, ఆకాశమంత, గగనం, గౌరవం లాంటి సినిమాలో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను కాకుండా సందేశాత్మక ప్రయోగాత్మక చిత్రాలను మాత్రమే నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ విలక్షణ నటుడికి మరో అరుదైన గౌరవం దక్కింది. దక్షిణాది నటులలో అతి కొద్ది మంది మాత్రమే పొందిన హాలీవుడ్ సినిమా అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు ప్రకాష్ రాజ్.     త్వరలో ఇండో పాక్ నేపధ్యంలో స్పీల్ బర్గ్  ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. అయితే ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే సినిమాకు ప్రకాష్రాజ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చాడట.     అన్నీ అనుకున్నట్టుగా జరిగితే హాలీవుడ్ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేసిన తొలి దక్షిణాది నటునిగా రికార్డ్ సృష్టింస్తాడు ప్రకాష్రాజ్.

రవితేజతో తమన్న,హన్సిక

  బలుపు సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన రవితేజ ఇప్పుడ జోరు పెంచాడు.. తన సినిమాల  సక్సెస్ కోసం తానే చొరవ తీసుకుంటున్నాడు. స్టోరి నుంచి హీరోయిన్ సెలక్షన్ వరకు ప్రతి విషయంలో చాల కేర్ తీసుకుంటున్నాడు మాస్రాజ..  అందుకే తన నెక్ట్స్ సినిమాలో తన మార్క్ మాస్ ఎలిమెంట్స్తో పాటు మరిన్ని అందాలు ఉండేలా చూసుకుంటున్నాడు. ఇన్నాళ్లు ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ ఈ మధ్యే ఫాం లోకి వచ్చాడు. బలుపు సక్సెస్‌తో జోరు మీదున్న మాస్‌ మహరాజ్‌ ఇప్పుడు వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలోలా ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా ఇప్పుడు స్క్రీప్ట్‌ విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటున్నాడు. బలుపు సినిమా తరువాత కాస్త గ్యాప్‌ తీసుకున్న మాస్‌ మహారాజ్‌ ఇప్పుడిప్పుడే సినిమాలు ఒకే చేస్తున్నాడు. బలుపు సినిమాకు కథ రచయిత అయిన బాబి డైరెక్షన్‌లో ఇప్పటికే ఓ సినిమాను ఒకే చేశాడు. వైవియస్‌ చౌదరి నిర్మిస్తున్న ఈసినిమా ఈ నెలఖరునుంచి సెట్స్‌ మీదకు వెళ్లనుంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు వైవియస్‌ చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో వీరి కాంభినేషన్‌లో వచ్చిన నిప్పు సినిమా డిజాస్టర్‌ అయింది. దీంతో నష్టాల పాలయిన వైవియస్‌ను ఈసినిమా తో ఆదుకోవాలనుకుంటున్నాడు రవితేజ. అంతేకాదు ఈ సినిమా ఎలాగైన సక్సెస్‌ చేయటం కోసం సినిమాకు మరింత గ్లామర్‌ యాడ్‌ చేస్తున్నాడు రవితేజ.  ఇంతవరకు రవితేజతో జోడి కట్టని ఇద్దరు అందాల భామలను ఈ సినిమాలో హీరోయిన్లుగా సెలక్ట్‌ చేశాడు. తెలుగులో సూపర్‌ ఫాంలో ఉన్న తమన్నాతో పాటు, తమిళ్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న హన్సికను తన నెక్ట్స్‌ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసుకున్నాడు రవితేజ. తన ఫాంతో పాటు తమన్న, హన్సికల లక్‌ కూడా తొడై ఈ సినిమా ఘన విజయం సాదిస్తుందని ఆశపడుతున్నాడు.     మరి ఈ అందాల భామ కాంభినేషన్‌ మాస్‌ మహరాజ్‌ ఫాంను కొనసాగిస్తుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

పవన్‌ నిర్మాతకు ఎన్టీఆర్‌ సాయం

  పవన్‌ కళ్యాన్‌ లేటెస్ట్‌ మూవీ అత్తారింటికి దారేది సినిమా నెట్‌ రిలీజ్‌ అయిన విషయం అందరికి తెలిసిందే అయితే ఈ సంఘటనతో నష్టపోయిన ఆ సినిమా నిర్మాత బివియస్‌ఎన్‌ ప్రసాద్‌కు టాలీవుడ్‌ ఇండస్ట్రీ అంతా అండగా నిలుస్తుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు నిర్మాతకు మద్దుతు తెలుపగా ఎన్టీఆర్‌ మరో అడుగు ముందుకు వేశాడు. అత్తారింటికి దారేది సినిమాతో తనకు ఎలాంటి సంభందం లేకున్న ఆ సినిమా నిర్మాత ప్రసాద్‌తో ఉన్న స్నేహం కారణంగా ఆయన్ను ఆదుకోవటానికి రెడీ అయ్యాడు ఎన్టీఆర్‌. సినిమా నెట్‌లో రిలీజ్‌ అవ్వటంతో నష్టపోయిన ప్రసాద్‌కు తాను ఓ సినిమా చేసి పెట్టనున్నాడు. ఇప్పటి వరకు ప్రసాద్‌తో సినిమా కమిట్‌ అవ్వని ఎన్టీఆర్‌ తను సుకుమార్‌ డైరెక్షన్‌లో చేయబోయే నెక్ట్స్‌ మూవీని ప్రసాద్‌ బ్యానర్‌లో చేయాలనుకుంటున్నాడు. దీనికి తొడు ఇప్పటి పవన్‌ తన రెమ్యునరేషన్‌లో కొంత భాగం వెనకకు ఇవ్వగా అల్లుఅరవింద్‌ లాంటి వాళ్లు థియేటర్స్‌ విషయంలో సాయం చేస్తున్నారు. వివాదాలు ఆదిపత్యాలు ఎలా ఉన్న మన తెలుగు ఇండస్ట్రీ కలిసే ఉందనటానికి ఈ సంఘటన ఓ నిదర్శనం.

మరోసారి లక్కీ గర్ల్‌తో నితిన్‌

  చాల కాలంగా ఒక్క హిట్‌ కూడా లేని నితిన్‌ ఇష్క్‌ సినిమాతో సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కాడు. అంతేకాదు వెంటనే గుండెజారి గల్లంతయిందే సినిమాతో మరో హిట్‌ అందుకొని తను కూడా సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చినని నిరూపించున్నాడు. అయితే ఈ రెండు సినిమాల్లో నితిన్‌కు ఓ కామన్‌ సెంటిమెంట్‌ వర్క్‌అవుట్‌ అయింది. అదే నిత్యా మీనన్‌.. ఫస్ట్‌ ఇష్క్‌ సినిమాలో కలిసిన నటించిన ఈ జోడి భారీ సక్సెస్‌ సాదించగా, రెండో సినిమా గుండెజారి గల్లంతయిందే తో హిట్‌ పెయిర్‌గా ముద్ర వేయించుకున్నారు. దీంతో నిత్యాని తన లక్కీ గర్ల్‌గా ఫీల్‌ అవుతున్నాడట నితిన్‌. అందుకే ప్రస్థుతం తను నటిస్తున్న కొరియర్‌ బాయ్‌ కళ్యాన్‌ సినిమాలో కలిసి నటించక పోయిన తరువాత పూరి కాంభినేషన్‌లో చేస్తున్న కొరియర్‌ బాయ్‌ కళ్యాన్‌ సినిమాలో మరోసారి నిత్యాతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నాడు. అయితే ఈసినిమాలో నిత్యా ఫుల్‌లెంగ్త్‌ హీరోయిన్‌గా కాదు జస్ట్‌ రోల్‌లో కనిపించనుందని సమాచారం.

అ౦గట్లో 'అత్తారింటికి దారేది'

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా విడుదల కాకముందే పైరసీకి గురికావడంపై చిత్రపరిశ్రమ షాక్ కి గురైంది. దీనిపై ఫిలించాంబర్ ఆగమేఘాల మీద స్పందించి నెట్‌లో ఈ సినిమా లింకులను తొలగించేలా చేయడంతో పాటు.. ఈ సినిమా సీడీల విక్రయం గురించి ఎవరికి తెలిసినా తమకు తెలియజేయాలంటూ ఒక ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ ఇచ్చింది. అయితే దాదాపు 90 నిమిషాల నిడివిగల విజువల్స్ నెట్‌లో ఎలా లీకయ్యాయి? దీని వెనుక ఎవరి హస్తం ఉంది? ఇది బయటివాళ్లెవరైనా కావాలని చేశారా? లేక.. యూనిట్ సిబ్బందిలోనే ఎవరో ఒకరు ఇంత సంచలనానికి కారణమయ్యారా? అనేది ఇప్పటికి తెలియలేదు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కొందరు రివర్స్‌ట్రాకింగ్ పద్ధతిలో ఈ వీడియోను తొలిసారిగా ఎక్కడ ఎవరు అప్‌లోడ్ చేశారో కనుక్కునే ప్రయత్నం చేశారు. ఇది క్యాలిఫోర్నియా ఫ్రీమాంట్ ప్రాంతానికి చెందిన ఐపీ అడ్రస్ నుంచి అది అప్‌లోడ్ అయిందని తెలిసింది. ఇప్పటికే పైరసీ రాకాసితో బెంబేలెత్తిపోతున్న దర్శక, నిర్మాతలు ఈతరహా చర్యలతో పూర్తిగా కుదేలైపోవడం ఖాయం.

అది నిజమేనంటున్న చైతు

  నాగచైతన్య త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని, అదే విధంగా హీరోయిన్ అనుష్కతో నాగచైతన్యకు నిశ్చితార్థం కూడా అయ్యిందని పుకార్లు షికార్లు చేసాయి. అయితే తాజాగా నాగచైతన్య గతకొద్ది రోజులుగా ఓ యువ కథానాయికతో ప్రేమలో మునిగితెలుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్త నిజమేనని తేల్చేశాడు. నేను ఒక అమ్మాయిని చూస్తున్న మాట నిజమే... కానీ ఆమె ఎవరు అనే విషయం చెప్పానని అన్నాడు. అంటే త్వరలోనే నాగచైతన్య పెళ్లిపీటలు ఎక్కిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి నాగచైతన్య తన అభిమానుల కోసం సినిమాలతో బిజీ అవుతాడో... లేక తను ప్రేమించిన అమ్మాయి కోసం సినిమా కెరీర్ ను మెల్లిగా కొనసాగిస్తాడో త్వరలోనే తెలియనుంది.

నిర్మాతగా మారుతున్న నాని

  అష్టా చమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయిన నాని తరువాత వరుస సినిమాలతో చిన్న సినిమాల స్టార్‌ హీరోగా ఎదిగాడు, రాజమౌళి, కృష్ణవంశీ లాంటి గ్రేట్‌ డైరెక్టర్స్‌తో వర్క్‌ చేసి మంచి నటుడిగా కూడా గుర్తింపు తెచ్చకున్నాడు. అయితే దర్శకత్వ శాఖలో కెరీర్‌ ప్రారంభించిన నాని ఇప్పుడు కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఇన్నాళ్లుగా హీరోగానే అలరించిన నాని ఇప్పుడ నిర్మాతగా మారనున్నాడు. డీ ఫర్‌ దోపిడి అనే సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించనున్నాడట. చాలా రోజుల క్రితమే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా ఇంత వరకు రిలీజ్‌ కాలేదు. అయితే ఈసినిమా ఇటీవల వాయిస్‌ ఓవర్‌ చెప్పిన నాని, సినిమా తెగ నచ్చేయటంతో తాను కూడా నిర్మాతగా జాయిన్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాడట. వరుణ్‌ సందేశ్‌, సందీప్‌ కిషన్‌ హీరోలుగా నటించిన ఈ సినిమాను బాలీవుడ్‌ దర్శకులు రాజ్‌ నిడిమోర్‌, కృష్ణా డికె సంయుక్తంగా నిర్మించారు. సిరాజ్‌ కల్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు నాని కూడా వన్‌ ఆఫ్‌ ది ప్రొడ్యూసర్‌గా యవహరించనున్నాడు. మరి నిర్మాతగా నాని ఎంతవరకు సక్సెస్‌ అవుతాడో చూడాలి.