ఎవడు రిలీజ్ ఇప్పట్లో లేనట్టేనా..?
posted on Aug 3, 2013 @ 8:17PM
రామ్‌చరణ్ సినిమాల రిలీజ్ విషయంలో సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పటి నుంచో రిలీజ్ విషయంలో మీనమేషాలు లెక్కపెడుతున్న జంజీర్, తుఫాన్ సినిమాల రిలీజ్ డేట్‌లు ఇంకా ఎనౌన్స్ కాలేదు. ఇప్పటికే వాయిదా పడిన ఎవడు రిలీజ్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు.
ఈ గత నెల 31నే ఎవడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఏర్పడ్డ అనిశ్చితితో ఎవడు సినిమా రిలీజ్‌ను మూడు వారాల పాటు వాయిదా వేశారు. అంతకు ముందు ప్రెస్‌మీట్ పెట్టి మరి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ వాయిదా వేసేది లేదని చెప్పిన దిల్‌రాజు సమైఖ్య సెగల నేపధ్యంలో వెనుక తగ్గక తప్పలేదు.
అయితే ఇప్పుడు మరో సారి ఎవడు సినిమా వాయిదా వేయాలని అనుకుంటున్నారట చిత్రయూనిట్. ఇప్పటికే నెల రోజులు పాటు వాయిదా పడ్డ ఈ సినిమా మరోసారి వాయిద పడటం సినిమా రిజల్ట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ఈ నెల 21న ఎవడు సినిమా రిలీజ్ చేయాలని భావించినా వచ్చే సెప్టెంబర్ 9 న రామ్‌చరణ్ బాలీవుడ్ ఎంట్రీతో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌రిలీజ్ అవుతున్న జంజీర్ సినిమా రిలీజ్ కూడా ఉండటంతో ఇప్పుడు ఎవడు సినిమాను మరోసారి వాయిదా వేయాలి అనుకుంటున్నారట.
రెండు సినిమాలకు కనీసం నెల గ్యాప్ అయినా ఉండేలా చూసుకోవాలనుకుంటున్న చెర్రీ ఇక జంజీర్ తరువాతే ఎవడు రిలీజ్ చేయడం బెటర్ అని భావిస్తున్నాడట. అందుకే ఎవడు సినిమాను ఏకంగా అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని బావిస్తున్నాడట. చెర్రీ ప్లానింగ్ మాట ఎలా ఉన్నా ఈ దెబ్బకు దిల్‌రాజు దిమ్మ తిరగటం మాత్రం కాయం అంటున్నారు విశ్లేషకులు.