మల్లికా స్వయంవరం
posted on Aug 23, 2013 7:37AM
మరో అందాల తార స్వయంవరం ద్వారా తన వరున్ని ఎంపిక చేసుకోవాలడానిక రెడీ అవుతుంది. గతంలో రాఖీసావంత్ లాంటి వాళ్లు ఇలాంటి ప్రయోగం చేసిన అది అంతగా సక్సెస్ అవ్వలేదు.. అయిన ఇప్పుడు మరోసారి ఓ బాలీవుడ్ బేర్ బ్యూటి అదే సాహసానికి రెడీ అవుతుంది.
ఇన్నాళ్లు సినిమాలు సంచలనాలతో వార్తల్లో ఉన్న హాట్ బ్యూటి మళ్లికా శెరావత్. తన అంత అభినయంతో పాటు అడపాదడపా వివాదాలతో కూడా ఈ అమ్మడు అభిమానులకు దగ్గరవుతూ ఉండేది.. అయితే ఇప్పుడు అలాంటి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లబోతుంది మళ్లిక.
ఇన్నాళ్లు తన అందాల విందుతో కుర్రకారు మతులు పోగొట్టిన మళ్లిక త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. అయితే ఈ విషయంలో కూడా తన స్టైల్ ఆఫ్ పబ్లిసిటీకి ట్రై చేస్తుంది ఈ బ్యూటి.
తన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కోసం త్వరలో గాలింపు ప్రారంభిస్తోంది. అందుకోసం ఓ స్వయం వరాన్ని నిర్వహించాలనుకుంటుందట మళ్లి,. గతంలో రాఖీసాంవత్ కూడా ఇలాగే తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంది. అయితే మూళ్లన్నలకే ఆ బందం తెగిపోయిందనుకోండి.
అయితే మళ్లిక మాత్రం ‘ది బ్యాచెలరెట్ ఇండియా’ ‘మేరే ఖయాలోంకీ మల్లిక’ అనే షోలొ తన కలల రాకుమారుడిని ఎంపిక చేసుకోవాలనుకుంటుంది. ఈ షోలో పాల్గొంటున్న 30మంది అందగాళ్లలో ఒకరిని తన భర్తగా పొందనుంది మళ్లిక.
సినిమాలు లేక ఫారిన్లో టైం పాస్ చూసిన మళ్లిక ఈ మద్య ఇండియాకు వచ్చింది. త్వరలోనే ఈ రియాల్టీషో షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అవుతుంది.. ఈ కార్యక్రమాన్ని లైఫ్ ఒకె చానల్ ప్రసార్ చేయనుందట.
మరి మల్లిక స్వయంవరం ఫలించి ఈ అందాలరాశికి తగ్గ వరుడు దొరుకుతాడో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..