రవితేజ నా దేవుడు
posted on Aug 22, 2013 @ 9:04PM
షాక్ లాంటి భారీ డిజాస్టర్‌తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మిరపకాయ్ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాతో డైరెక్టర్‌గా నిలదొక్కుకున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. అందుకే వరుసగా తనకు రెండు సినిమాలు ఇచ్చిన ఆదుకున్న మాస్ మహరాజ్ రవితేజనే తనకు దేవుడంటున్నాడు హరీష్ అంతేకాదు తాను ఎంత పెద్ద డైరెక్టర్ అయిన రవితేజతో సినిమా చేయడానికే ఇంట్రస్ట్ చూపిస్తానంటూ స్వామి భక్తి చూపిస్తున్నాడు.
మిరపకాయ్ సినిమా తరువాత గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో ఒక్కసారిగా టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు హరీష్.. ఈ లైన్‌లోనే ప్రస్థుతం ఎన్టీఆర్ హీరోగా రామయ్య వస్తావయ్యా అంటూ ఓ మంచి ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. దీని తరువాత ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా కమిట్ అయ్యాడు.
అయితే ఈ గ్యాప్‌లోనే రవితేజ హీరోగా ఓ సినిమా చేయడానిక ప్లాన్ చేస్తున్నాడు హరీష్ శంకర్.. ప్రస్థుతం రవితేజ కెరీర్‌కు ఓ భారీ హిట్ అవసర్ ఉండటంతో ఆ హిట్ తనే ఇవ్వాలనుకుంటున్నాడు హరీష్ శంకర్. తనకు లైఫ్ ఇచ్చిన రవితేజకు ఓ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చి ఋణం తీర్చుకోవాలనుకుంటున్నాడు.ఇప్పటికే రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ పవర్‌ఫుల్ కథ రెడీ చేసుకున్న హరీష్ శంకర్ రవితేజ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు.