హీరోగా మారుతున్న సంగీత కెరటం
posted on Aug 27, 2013 @ 8:47PM
తెలుగు సినిమా సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్. దేవి అనే డివొషనల్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయినా ఎక్కువగా యూత్ ఫుల్ మూవీస్‌తో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు దేవి. అంతేకాదు తన ప్రతి సినిమాలోను హుషారెత్తించే ఐటంసాంగ్ పెట్టే దేవి అలాంటి సాంగ్‌తో బాలీవుడ్ కండల వీరున్ని కూడా బుట్టలో పడేశాడు.
అయితే దేవీ శ్రీ మ్యూజికల్ జర్నీనికాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఈ టాలీవుడ్ సెలబ్రిటీ కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఇన్నాళ్లు తన మ్యూజిక్‌తో పర్ఫామెన్స్‌లతో ఇరగదీసిన దేవి ఇప్పుడు హీరోగా మారనున్నాడట. చాలా రోజులుగా ఈ టాక్ వినిపిస్తున్న సరైన కథ దొరకక దేవి తన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీని పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నాడు.
అయితే ఇన్నాళ్లకు దేవీ శ్రీ తెరంగేట్రానికి రంగం సిద్దమయింది. దేవినీ హీరోగా ఇండట్రడ్యూస్ చేయబోయే డైరెక్టర్ కూడా ఎవరో కాదు తన సినిమాలకు వరుసగా దేవితోనే మ్యూజిక్ చేయించిన సుకుమారే దేవిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఇప్పటికే కథ రాయడం మొదలు పెట్టిన సుక్కు వీలైన త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలొచనలో ఉన్నాడట. మ్యూజిక్ డైరెక్టర్‌గా సెన్సెషన్ సృష్టించిన దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.