హాలీవుడ్‌లో ప్రకాష్‌రాజ్
posted on Sep 27, 2013 9:06AM
దాదాపు భారతీయ భాషలన్నింటిలో నటించిన ఓ దక్షిణాది నటుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. హీరో విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అన్ని విభాగాల్లో తానేంటో నిరూపించుకున్న ఆ నటుడు త్వరలో మరో రికార్డ్ సృష్టించనున్నాడు.
ప్రకాష్ రాజ్ ఇండియన్ స్క్రీన్ మీద విలక్షణ నటుడు అన్న పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్. తెలుగు తమిళ్తో పాటు భారతీయ భాషలన్నింటిలో నటించిన ఈ అరుదైన నటుడు ఇప్పుడు మరో గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు.
దక్షిణాదిలో విలన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ఇటీవల బాలీవుడ్ సినిమాలతో కూడా ఫాం కొనసాగిస్తున్నాడు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా మంచి నటునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
నటనతో పాటు నిర్మాతగా కూడా మారిన ప్రకాష్ రాజ్, ఆకాశమంత, గగనం, గౌరవం లాంటి సినిమాలో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను కాకుండా సందేశాత్మక ప్రయోగాత్మక చిత్రాలను మాత్రమే నిర్మిస్తున్నాడు.
అయితే ఇప్పుడు ఈ విలక్షణ నటుడికి మరో అరుదైన గౌరవం దక్కింది. దక్షిణాది నటులలో అతి కొద్ది మంది మాత్రమే పొందిన హాలీవుడ్ సినిమా అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు ప్రకాష్ రాజ్.
త్వరలో ఇండో పాక్ నేపధ్యంలో స్పీల్ బర్గ్ ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. అయితే ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే సినిమాకు ప్రకాష్రాజ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చాడట.
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే హాలీవుడ్ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేసిన తొలి దక్షిణాది నటునిగా రికార్డ్ సృష్టింస్తాడు ప్రకాష్రాజ్.