పూరి పుట్టినరోజు
posted on Sep 28, 2013 8:20AM
ఇన్నాళ్లు హీరో అంటే...
చెడు పై పోరాడే వీరుడు...
మంచి కోసం ప్రాణాలు ఇచ్చే సాహసి
తొలి చూపులోనే ప్రేమలో పడేసే సమ్మోహనాస్త్రం
కాని ఇప్పుడు ట్రెండ్ మారింది...
హీరోయిజానికి కొత్త అర్థాలు వచ్చాయి....
కాదు కాదు తీసుకు వచ్చాడు....
ఆయన సినిమాలో హీరో ఓ ఇడియట్ , ఓ దేశముదురు, ఓ పోకిరి,
దందాను కూడా వ్యాపారంలా ఆర్గనైజ్ చేసే బిజినెస్‌మేన్
డెబ్బై ఏళ్ల వయసులో కూడా యాక్షన్స్, రోమాన్స్ చేసే ప్లే బాయ్..
ఇలా హీరోయిజానికి కొత్త నిర్వచనం చెప్పిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాద్.
ఇప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఉన్న పూరికి ఆ ప్లేస్ అంత ఈజీగా ఏం రాలేదు.... ఎన్నో ఏళ్ల శ్రమ కృషి తరువాత పూరి ఓ స్టార్ అయ్యాడు.. స్టార్ మేకర్ అయ్యాడు... కమర్షియల్ తెలుగు సినిమాను కొత్త ట్రాక్‌లో నడిపిస్తున్న పూరి పుట్టిన రోజు సందర్భంగా ఆయన
కెరీర్ పై ఓ లుక్
రామ్‌గోపాల్ వర్మ లాంటి స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన పూరి తొలి అవకాశంతోనే తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఓ దర్శకుడికి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వస్తే ఎంత కసిగా సినిమా చేస్తాడో నిరూపించాడు పూరి. రామ్‌గోపాల్ వర్మ దగ్గర హిందీ శివ సినిమా నుంచి పని చేసిన పూరి తరువాత కొన్ని టివి సీరియల్స్‌కు కూడా వర్క్ చేశాడు.
అదే సమయంలో బిగ్ స్క్రీన్ మీద తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్న పూరికి అదృష్టం తలుపు తట్టింది. తొలి సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బద్రి... ఈ సినిమాతోనే తన ఏంటో చూపించాడు పూరి. అప్పటి వరకు పవన్‌కు ఉన్న ఇమేజ్‌కు భిన్నంగా సరికొత్తగా ప్రజెంట్ చేశాడు.. అంతే కాదు ఇది పవన్ స్టామినా అంటూ ప్రూవ్ చేశాడు.... బద్రి సినిమా... పూరి ఫస్ట్ సినిమా... కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్ బస్టర్...
తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్న పూరి రెండు సినిమాతో మాత్రం నిరాశపరిచాడు.... రెండో ప్రయత్నంగా చేసిన బాచీ సినిమా పూరికి చేదు అనుభవాన్నే మిగిల్చింది... పూరి రెండో సినిమానే డిజాస్టర్, దీంతో పూరి పని అయిపోయిందనుకున్నారు అంతా... తొలి సినిమా సక్సెస్ కూడా లక్ అన్నారు... అప్పటి వరకు సినిమాలు చేస్తామన్న నిర్మాతలు మోహం చాటేశారు... మళ్లీ స్ట్రగుల్ పూరి మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.... ఆ సమయంలో తనతో సినిమా చేయాడానికి ఏ స్టార్ హీరో ముందుకు రాడనుకున్న పూరి... తానే ఓ స్టార్ ను తయారు చేయాలనుకున్నాడు...
అదే సమయంలో పూరితో కలిశాడు, రవితేజ. ఇద్దరిలో ఒకే కసి..... ఇక్కడే బతకాలి... ఇక్కడే నిరూపించుకోవాలి... ఇక్కడే ఎదగాలి... పూరి, రవితేజల కాంభినేషన్ కమర్షియల్ సినిమాకు కొత్త రూట్ చూపించింది. అప్పటి వరకు తెలుగు సినిమా హీరోకు ఉన్న అర్థాన్ని సరికొత్తగా ఆవిష్కరించింది. ఈ ఇద్దరి కాంభినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం. జీవితంలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఇద్దరు వ్యక్తుల కథను సినిమాగా తెరకెక్కించిన పూరి సక్సెస్ సాదించాడు... రెండో సినిమాతో వచ్చిన విమర్శలకు సమాదానం చెపుతూనే తన సక్సెస్ లక్ కాదు అని ప్రూవ్ చేశాడు.
డైరెక్టర్‌గా పూరి ఇప్పుడు సక్సెస్ అండ్ సెటిల్డ్... కాని ఇంకా ఏదో వెలితి అందుకే మరో సక్సెస్ అవసరం ఏర్పడింది. ఈ సారి కూడా తన సినిమాకు హీరోగా రవితేజనే ఎంచుకున్నాడు... అప్పటి వరకు ఉన్న ట్రెండ్ మారుస్తూ తిట్టును టైటిల్‌గా మార్చి ఇడియట్ సినిమా తెరకెక్కించాడు... ఈ సినిమాతో పూరి జగన్నాద్‌తో పాటు రవితేజ రేంజ్ కూడా మారిపోయింది. ఒకేసారి ఈ సినిమాతో రవితేజ స్టార్ హీరోగాను, పూరి స్టార్ డైరెక్టర్‌గాను మారిపోయారు.. అంతేకాదు అంత వరకు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న రవితేజను స్టార్‌గా మార్చిన పూరి స్టార్‌మేకర్ అయ్యాడు.
ఇడియట్‌తో మొదలైన పూరి విజయ పరంపర తరువాత ఎదురులేకుండా సాగింది.. రవితేజతో భారి హిట్ అందటంతో తన నెక్ట్స్ సినిమా కూడా మళ్లీ రవితేజ తోనే ప్లాన్ చేశాడు.... అదే అమ్మానాన్న ఓ తమిళమ్మాయి తన ఫస్ట్ సినిమా నుంచి టైటిల్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే పూరి ఈ సినిమా విషయంలో కూడా తన మార్క్ చూపించాడు..
అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పూరి రవితేజల కాంబినేషన్‌లో మరో హిట్ హ్యాట్రిక్ హిట్. దీంతో పూరి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా స్థిరపడిపోయాడు. అప్పటివరకు మొహం చాటేసిన అవకాశాలు పూరిని వెత్తుక్కుంటూ రావటం మొదలైంది.. కాని పూరి మాత్రం ఇక తడబడదలుచుకోలేదు... ఆచూతూచి అడుగులు వేయాలని డిసైడ్ అయ్యాడు... అవకాశాల వెంట పాకులాడకుండా తన కెరీర్‌కు ఉపయోగపడే అవకాశాలను మాత్రమే ఎంచుకోవాలనుకున్నాడు...
వరుస సినిమాలు చేసినా సక్సెస్, ఫెయిల్యూర్ ఒకదాని వెంట ఒకటి... పూరితో ఆడుకుంటునే ఉన్నాయి... కాదు ఈ సారి నేనే వాటితో ఆడుకోవాలనుకున్నాడు.. ఎవడు కోడితే బాక్సాఫీస్ రికార్డులన్ని బద్దలవుతాయో వాడే పూరి అని తెలియ జేయాలనుకున్నాడు. అందుకే మహేష్‌తో సినిమా చేసే అవకాశం రాగానే తానేంటో మరోసారి చూపించాలనుకున్నాడు. అలా తెరకెక్కిందే పోకిరి...
75 సంవత్సరాలుగా చెదలు పట్టిన టాలీవుడ్ రికార్డుల దుమ్ము దులిపిన సినిమా పోకిరి.. మహేష్ కు అప్పటివరకు ఉన్న ఇమేజ్‌ను చెరిపేస్తూ ఒక్కసారిగా సూపర్‌స్టార్‌ను చేసిన సినిమా పోకిరి.. ఈ సక్సెస్‌తో పూరి నెంబర్ వన్ కాంపీటేషన్‌లోకి వెళ్లిపోయాడు.. స్టార్ హీరోలు కూడా పూరితో సినిమా చేస్తే చాలు అనే స్టేజ్‌కు వచ్చేశాడు... ఇక ఎప్పుడు పూరి వెనుతిరగి చూడలేదు వరుస అవకాశాలు... రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా అప్పుడప్పుడు నటునిగా కూడా అలరిస్తున్న స్టార్... కాని కాలం అలా ప్రశాతంగా ఎందుకు ఉంటుంది.. అందుకే ఓ మంచి ఓ చెడు ఒకేసారి పూరి తలుపుతట్టాయి.
పూరి జీవితంలో ఆటుపోట్లు కామన్ అయిపోయాయి... అన్ని రోజులు నమ్మకంగా ఉన్న పూరి ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చాడు... ఒకటి రెండు కాదు ఏకంగా 30 కోట్ల అప్పు మిగిల్చి వెళ్లిపోయాడు... అయినా పూరి భయపడలేదు... తన దగ్గర ఉన్న టాలెంట్ తనను ఎప్పుడు కాపాడుతుందని నమ్మాడు... అదే ధైర్యంతో సినిమాలు చేశాడు.... ఈ టైంలో పూరిని ఓదార్చిన సంఘటనా.. ఒకటి ఉంది... అదే అమితాబ్‌తో సినిమా చేసే అవకాశం... రామ్‌గోపాల్‌వర్మ రికమండేషన్‌తో అమితాబ్‌తో సినిమా చేసే చాన్స్ అయితే వచ్చింది... మరి ఆ సినిమా ఎలా ఉండాలి..
ఇంటర్‌నేషనల్ ఫేమ్ ఉన్న అమితాబ్‌ను ఎంతో మంది దర్శకులు అన్ని రకాలుగా చూపించేశారు.. కొత్తగా చూపించాలనుకున్నా ఈ వయసులో అమితాబ్ ఏం చేయగలడు.....? ఇలాంటి ప్రశ్నలెన్నో....? ఏమైనా చేయగలడు.. అవును బుడ్డా హోగా తేరాబాప్ సినిమాతో ఇదే ప్రూవ్ చేశాడు పూరి... అమితాబ్‌ను 70 ఏళ్ల వయసులో కూడా యాంగ్రీ యంగ్ మేన్‌గా చూపించి బాలీవుడ్‌కే దిమ్మ తిరిగిపోయే హిట్ ఇచ్చాడు... చాలా రోజులగా తాత తండ్రి పాత్రలకే పరిమితమైన బిగ్‌బితో రోమాంటిక్ యాక్షన్ సీన్లు చేయించి అరె వాహ్ అనిపించాడు...
మహేష్‌తో బిజినెస్‌మేన్, రవితేజతో దేవుడు చేసిన మనుషులు, పవన్‌తో కెమరామేన్‌గంగతో రాంబాబు ఇవన్నీ దాదాపుగా నెల రోజుల్లో కంప్లీట్ అయిన సినిమాలే ఇంత స్పీడ్‌గా సినిమా చేయటమే కాదు. అంతే స్పీడ్‌గా టాప్ పొజిషన్‌కి వచ్చేశాడు. రచయితగా,
దర్శకునిగా, నిర్మాతగా అన్ని విభాగాల్లో అవార్డులు రివార్డులు అందుకున్న పూరి అసలు సిసలైన క్రియేటర్. ఓ మనిషిని కసి ఏ స్థాయికి చేరుస్తుంది అన్న ప్రశ్నకు అసలైన సమాధానం పూరి జీవితం... సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబందం లేకుండా తన పని తాను చేసుకు పోతున్న పూరి మరిన్ని హిట్ సినిమాలతో మనల్ని అలరించాలని ఆశిస్తూ మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం