ముందు చండీగా ఆమెనే అనుకున్నారట

  ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "చండీ". ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ.. ఇది ఒక ప్రతీకారం తీర్చుకొనే యాక్షన్ చిత్రం. అయితే ఈ చిత్రం కోసం ముందుగా అనుష్కని అనుకున్నాము. కానీ ఆమెను ఇదివరకే "అరుంధతి"లో చేసిన నటనను చుసేసాము. కాబట్టి ఈ పాత్రకు ప్రియమణి అయితే బాగుంటుందని అనుకొని, ప్రియమణిని తీసుకోవడం జరిగింది. ఈ చిత్రంలో ప్రియమణి చాలా అధ్బుతమైన నటన కనబర్చింది. ఈ చిత్రం కోసం ప్రియమణి కత్తి యుద్ధం, అర్చెరీ లలో శిక్షణ తీసుకుంది. ఈ చిత్రంలో అవినితీ రాజకీయ నాయకులపై పోరాడే పాత్రలో ప్రియమణి నటించింది. అదే విధంగా నటులు కృష్ణంరాజు, శరత్ కుమార్ లు వారి వారి పాత్రలకు జీవం పోసారు. అని అన్నారు.

మసాలా సెన్సార్ రిపోర్ట్

  వెంకటేష్, రామ్ కలిసి నటించిన తాజా మల్టీస్టారర్ చిత్రం "మసాలా". హిందీలో "బోల్ బచ్చన్" చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇటివలే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్ళింది. ఈ సినిమాకు సెన్సార్ వారు ఎలాంటి కటింగ్ లు చేయకుండా క్లీన్ U సర్టిఫికేట్ ఇచ్చారు. పేరుకే "మసాలా" అయినా కూడా సినిమాలో ఎలాంటి మసాలాలు లేకపోవడంతో ఇది కుటుంబ సమేతంగా చూడవచ్చని, అందుకే క్లీన్ U సర్టిఫికేట్ ను ఇచ్చినట్లు తెలిసింది.దీంతో చిత్ర యూనిట్ సభ్యులు తెగ ఆనందపడిపోతున్నారు. కామెడి ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అంజలి, రామ్ సరసన షాజన్ పదాంసీ హీరోయిన్లుగా నటించారు. తమన్ అందించిన పాటలు ఇటివలే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 14న రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

బాహుబలికి పోటీగా అనుష్క దేవసేన

  "అరుంధతి" చిత్రంతో తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ అనుష్క పుట్టినరోజు నేడు. అనుష్క ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "బాహుబలి" చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో అనుష్క దేవసేన పాత్రలో కనిపించబోతుంది. అయితే అనుష్క పుట్టినరోజు సంధర్భంగా ఈ చిత్రంలో అనుష్క ఎలా ఉంటుందనే ఊహాగానాలకు మరింత పెంచే విధంగా ఓ మేకింగ్ వీడియో ను విడుదల చేశాడు దర్శకుడు రాజమౌళి. ఈ వీడియోలో కేవలం అనుష్క మాత్రమే కనిపించేలా తయారుచేశారు. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని 2015లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి అనుష్క పుట్టినరోజు సంధర్భంగా తనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగువన్.కామ్

వావ్.... కత్తిలా ఉన్న రుద్రమదేవి!

  అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "రుద్రమదేవి". ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. అయితే ఈ చిత్రానికి సంబందించిన మొదటి టీజర్ ను నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రంలో అనుష్క రుద్రమదేవిగా ఎలా కనిపించనున్నదో అనే అంచనాలను మరింతగా పెంచే విధంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రుద్రమదేవి గెటప్ లో ఉన్న అనుష్క పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే... రుద్రమదేవి పాత్రలో అనుష్క అదరగొట్టేలా ఉన్నట్లుగా అనిపిస్తుంది. మరి భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై గుణశేఖర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రానా, బాబా సెహగల్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆమెపై కాజల్ నోటి దురద

  "మగధీర" చిత్రంతో హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కాజల్ కు ఈ మధ్య తెలుగులో సరిగ్గా అవకాశాలేమి అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే ఇటీవలే ఈ అమ్మడు తమిళంలో కార్తి‌ హీరోగా రానున్న ‘ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీవీ ప్రమోషన్‌ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి అక్కడి వారందరిని షాక్ కి గురిచేసింది. "మీ దృష్టి‌లో ఏ హీరోయిన్ రిటైర్ అయితే బెటర్"అని యాంకర్ ప్రశ్న వేసింది. దాంతో ఆలోచించకుండా వెంటనే శ్రియ అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. దాంతో అక్కడున్న హీరో కార్తితోపాటు చాలామంది ఖంగుతిన్నారు. అంతే కాకుండా దీనిని అలాగే టెలికాస్ట్ చేసేసారు. దాంతో ఈ విషయం శ్రియ వరకూ వెళ్లింది. కాజల్ ఈ విధంగా మాట్లాడటంతో శ్రియ కూడా అంతేస్థాయిలో రియాక్ట్ అయ్యిందని తెలిసింది. ప్రస్తుతం ఈ టాపిక్ అటు కోలీవుడ్ తో పాటు, టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. మరి కాజల్ నోటి దురదకు శ్రియ ఎలా స్పందించనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

పవన్ రికార్డ్స్ ను ఆమె బ్రేక్ చేస్తుందా...?

  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "అత్తారింటికి దారేది" చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసి, కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే అదే విధంగా కోలీవుడ్ లో నయనతార నటించిన "రాజా రాణి" చిత్రం కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తారని అనుకుంటే, రీమేక్ కాకుండా కేవలం డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో "రాజు రాణి" పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నయనతార, ఆర్య జంటగా నటించారు. మురుగదాస్ నిర్మించిన ఈ చిత్రానికి అట్లీకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే తెలుగులో విడుదల చేయనున్నారు. మరి తెలుగులో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

యమదొంగ ఇంట్లో చోరీకి ప్రయత్నం

  ఈ మధ్య సినీతారల ఇంట్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవలే మహేష్ బాబు ఇంట్లో దొంగలు చోరీకి ప్రయత్నించిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ ఇంట్లో కూడా చోరీ చేయడానికి ఒక ఆగంతకుడు ప్రయత్నించినట్లుగా తెలిసింది. అయితే ఎన్టీఆర్ ఇంటి సెక్యురిటీగార్డ్ అప్రమత్తంగా ఉండడంతో ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ దొరకలేకపోయాడని తెలిసింది. చేతిలో ఒక తుపాకీతో, నెంబర్ లేని వాహనంలో ఆ దొంగ వచ్చినట్లుగా సమాచారం. అయితే ఎన్టీఆర్ ఇంటి పక్కనే ఉన్న లగడపాటి రాజగోపాల్ ఇంటి ముందున్న సీసీ కెమెరాల్లో ఆ దొంగ మొహం గుర్తించినట్లు తెలిసింది. అయితే వెంటనే ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో, విచారణ చేపట్టిన పోలీసులు త్వరలోనే ఆ అగంతకుడిని పట్టుకుంటామన్నారు.

అతనితోనే వారసుడిని పరిచయం చేస్తాడా...?

  "అత్తారింటికి దారేది" వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ చేయబోయే చిత్రం ఎవరితో అనేది ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. మొన్నటి వరకు పవన్, మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లతో కలిసి త్రివిక్రమ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా త్రివిక్రమ్ జాబితాలోకి అక్కినేని అఖిల్ కూడా వచ్చేసాడు. అఖిల్ సినిమా రంగ ప్రవేశాన్ని త్రివిక్రమ్ వంటి దర్శకుడితో పరిచయం చేయాలని నాగార్జున అనుకొని, త్రివిక్రమ్ ను కోరగా... దానికి త్రివిక్రమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జునే స్వయంగా నిర్మించనున్నాడని తెలిసింది. మరిన్ని విషయాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఆనంది చిత్ర షూటింగ్ పూర్తి

  తెలుగు వారికి అవికా గొర్ అంటే తెలియకపోవచ్చు కానీ, "చిన్నారి పెళ్లి కూతురు" ఆనంది అంటే తెలియని వారుండరు. అంతటి అభిమానం సంపాదించుకున్న ఆనంది అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం కానుంది. ప్రస్తుతం ఈ అమ్మడు "ఉయ్యాలా జంపాలా" అనే చిత్రం తెరకెక్కుతుంది. డి. సురేష్ బాబు సమర్పణలో సన్ షైన్ సినిమాస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో అక్కినేని నాగార్జున, రామ్మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విరించి వర్మ దర్శకత్వం వహించాడు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రం ద్వారా రాజ్ తరుణ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్ర ఆడియోని ఈ నెలలోనే విడుదల చేసి, త్వరలోనే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఆ ముగ్గురి కలయికలో సినిమా చేస్తున్నాం...!

  కృష్ణవంశీ దర్శకత్వంలో వెంకటేష్, రామ్ చరణ్ లు కలిసి మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ చిత్రం నుండి వెంకటేష్ తప్పుకున్నాడని పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలన్నింటికి తెరపడింది. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించనున్నాడు. ఈ చిత్రం గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ..."కృష్ణవంశీ- చరణ్ - వెంకటేష్ కలయికలో సినిమా చేస్తున్నాము. ఆ సినిమాకు నేనే నిర్మాత. ఈ సినిమా కథ విషయంలో ఏర్పడిన అడ్డంకులు అన్నీ కూడా ఇపుడు తొలగిపోయాయి. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన చెప్పుకొచ్చాడు.

పవన్ నెంబర్ 1, మహేష్ నెంబర్ 2

  పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మరియు ప్రిన్స్ మహేష్ బాబులకున్న ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిరువురి సినిమాలకి ఇప్పుడు మన రాష్ట్రంలోనే గాక పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో, విదేశాలలో కూడా చాలా డిమాండ్ ఉంది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలలో స్థిరపడిన లక్షలాది ప్రవాసాంధ్రుల ఆదరణ పొందుతున్న కారణంగా వీరి సినిమాలు హాలివుడ్ సినిమాలకు కూడా గట్టి పోటీనిస్తున్నాయి. అందుకే ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రముఖ అమెరికన్ దినపత్రికలు కూడా వీరి సినిమాల గురించి వ్రాయక తప్పని పరిస్థితి ఏర్పడింది.   ఇటీవల న్యూయార్క్ టైమ్స్ భారత్ కి చెందిన 10 టాప్ హీరోల కోసం నిర్వహించిన ఒక ఆన్ లైన్ సర్వేలో బాలివుడ్ నటుడు షారూక్ ఖాన్ నెంబర్:1 స్థానంలో నిలువగా, పవన్ కళ్యాణ్-5, మహేష్ బాబు-6 స్థానాలను కైవసం చేసుకొన్నారు. ఆ పత్రిక సర్వే ప్రకారం సల్మాన్ ఖాన్-2, అక్షయ్ కుమార్-3, హృతిక్ రోషన్-4, పవన్ కళ్యాణ్-5, మహేష్ బాబు-6, విజయ్-7, అమీర్ ఖాన్-8, రణబీర్ కపూర్-9, మరియు అజయ్ దేవగన్-10వ స్థానంలో నిలిచారు. ఈ ప్రకారం చూస్తే దక్షిణాది సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ నెంబర్ 1 స్థానంలో మహేష్ బాబు నెంబర్ 2స్థానంలో ఉన్నట్లవుతుంది.   అయితే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న తమిళ్ హీరోలు రజని కాంత్ మరియు కమల హస్సన్ పేర్లు ఈ లిస్టులో ఎందుకు కనబడలేదో తెలియదు మరి.

ఈసారి నాగ్ తడాఖా చూపిస్తాడా...?

  నాగార్జున హీరోగా నటించిన "భాయ్" చిత్రం ఇటీవలే విడుదలై అట్టర్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే నాగార్జున మాత్రం తన సినిమాలు తను చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం "మనం" చిత్ర షూటింగ్ లో ఉన్న నాగార్జున త్వరలోనే మరో చిత్రం నటించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. "తడాఖా" చిత్రంతో మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు బాబీ దర్శకత్వంలో నాగార్జున ఓ చిత్రం చేయనున్నాడని తెలిసింది. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నాడట. ప్రస్తుతం నాగార్జున కోసం బాబీ ఓ పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడట. ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

మారుతి రాధ పాత్రలో వెంకీ

  "కొత్తజంట" చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న మారుతి మరో చిత్రానికి సిద్ధమవుతున్నాడు. వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి "రాధ" అనే టైటిల్ ను ఖరారు చేశారు. యూనివర్సల్ మీడియా బ్యానర్ లో నిర్మాత డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు మారుతి. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నయనతారను ఖరారు చేసినట్లుగా తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి. ప్రస్తుతం వెంకటేష్ నటించిన "మసాలా" చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది.