సెల్‌ఫోన్లు వాడితే నరికేస్తారంటా...!
ఈ మధ్య కాలంలో పైరసీ ఎక్కువగా జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇటీవలే పవన్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్రం విడుదలకు ముందే పైరసీ అవడంతో సినీ పరిశ్రమ అంతా తమ సినిమాల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మోహన్ బాబు ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో విష్ణు, మనోజ్, తనీష్, వరుణ్ సందేశ్ లు కలిసి నటిస్తున్నారు. అయితే తమ చిత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పైరసీ కాకూడదని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. మోహన్ బాబు. అక్కడ ఒక హెచ్చరిక నోటిస్ కూడా పెట్టారంట. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ప్రొడ్యూసర్లు, మేనేజర్లు తప్ప,యూనిట్ సభ్యులెవరూ సెల్‌ఫోన్స్ వాడరాదని గట్టి హెచ్చరిక జారీ చేశాడట."సెల్‌ఫోన్లు వాడిన వారిని నరకబడును" అని ఆ నోటీసులో ఉందట! శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రణీత, హన్సిక హీరోయిన్లు గా నటిస్తున్నారు.