విడాకుల బాటలో ప్రపంచ సుందరి యుక్తాముఖి

  ఎంత కళ్ళు తిరిగేంత అందగత్తె అయినా, సాక్షాత్తూ ప్రపంచ సుందరి అయినా, పెళ్ళయ్యాక కాపురం దగ్గరకి వచ్చేసరికి ఆమె మహిళలందరి లాంటిదే. భర్తతో సఖ్యత కుదరకపోతే అంతా సర్వనాశనమే. ఇప్పుడీ పరిస్థితి మాజీ ప్రపంచ సుందరి యుక్తాముఖి ఎదుర్కొంటోంది. ప్రపంచ సుందరిగా ఎన్నికైన తర్వాత సినిమాల్లో రాణించాలని కలలు కన్న యుక్తాకి గొప్ప ఛాన్సులేవీ రాలేదు. దాంతో కొంతకాలం వెయిట్ చేసిన ఆమె చివరికి పెళ్ళి చేసుకుని సెటిలవ్వాలని అనుకుంది. రకరకాలుగా అన్వేషించి ప్రిన్స్ తులి అనే యువకుడిని పెళ్ళి చేసుకుంది. అయితే పెళ్ళాయ్యాక వాళ్ళిద్దరికీ పొసగలేదు. మొన్నీమధ్య ప్రిన్స్ తులి మీద, అతని తల్లిదండ్రులు, తమ్ముడి మీద యుక్తాముఖి గృహ హింస చట్టం కింద కేసు పెట్టింది. అలాగే తనను అసహజ లైంగిక పద్ధతులతో వేధిస్తున్నాడని కూడా కేసు పెట్టింది. అతని నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరింది. అలాగే ప్రిన్స్ తులీ కూడా యుక్తా ముఖి మీద రకరకాల కేసులు పెట్టాడు. యుక్తాముఖి తనను మానసికంగా వేధిస్తోందని కేసులు పెట్టాడు. న్యాయస్థానం ఈ రెండు కేసులను విచారణకు తీసుకుని, మీరిద్దరూ చర్చల ద్వారా మీ సమస్యలను కోర్టు బయటే పరిష్కరించుకుంటే మంచిదని తాజాగా సూచించింది. దాంతో ఇద్దరికీ చెందిన పెద్దలు రాయబారాలు మొదలుపెట్టారు. మరి ఈ రాయబారాలు ఫలిస్తాయో లేదో అర్థంకాని పరిస్థితి ఇద్దరి మధ్య వుంది. ఈ ఇద్దరికీ నాలుగేళ్ళ కొడుకు కూడా వున్నాడు. వీరిద్దరి మధ్య ఆ పిల్లాడు నలిగిపోతున్నాడు.

రేప్ కేసులో దొరికిపోయిన సింగర్

ఈమధ్య విడుదలై సూపర్ హిట్ అయిన హిందీ చిత్రం ‘ఆషికి-2’లో సూపర్ హిట్ అయిన పాట ‘సున్ రహాహైనా’ను పాడిన గామయకుడు అంకిత్ తివారీని ఢిల్లీ పోలీసులు రేప్ కేసులో అరెస్టు చేశారు. అంకిత్ స్నేహితురాలు, మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ అయిన యువతి తనను అంకిత్ రేప్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను రేప్ చేసిన తర్వాత పెళ్ళి చేసుకుంటానని అంకిత్ ప్రామిస్ చేశాడని, ఆ తర్వాత తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో అంకిత్ సోదరుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. మానభంగానికి గురైనట్టు చెబుతున్న యువతి సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదు. ఆమె తన సోదరితో కలసి నివసిస్తోంది. అంకిత్ తివారీతో స్నేహం కుదిరిన ఆమె అనేకసార్లు అంకిత్ ఇంటికి వచ్చి వెళ్ళిందని తెలుస్తోంది.  

లోదుస్తులు కనిపించేలా ప్రియాంక డ్రస్.. ఢిల్లీలో హాట్ టాపిక్

      సెలబ్రిటీలు ఏం చేసినా సంచలనం అవుతుంది. ఏం చేయకపోయినా సంచలనం అవుతుంది. నలుగురి దృష్టీ పడే సెలబ్రిటీలు కాస్తంత జాగ్రత్తగా వుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు అంతటా వున్నాయి. సెలబ్రిటీలు.. ముఖ్యంగా లేడీ సెలబ్రిటీలు బయటకి వెళ్తే లక్షలాది కళ్ళు వాళ్ళని తడిమేస్తాయి. ఆ చూపులకు దొరికిపోతే లేనిపోని వివాదాలు తలెత్తుతాయి.   బాలీవుడ్ కథానాయిక ప్రియాంక చోప్రా ఇప్పుడు ఇలాంటి వివాదంలోనే ఇరుక్కుంది. ప్రియాంక చోప్రా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంది. ‘ఐ కాంట్ మేక్ యూ లవ్ మీ’ అనే మ్యూజిక్ ఆవిష్కరణ కార్యక్రమం అది. ప్రియాంకా చోప్రా ఆ కార్యక్రమానికి మామూలు డ్రస్‌లో వచ్చి వెళ్తే ఎలాంటి ఇబ్బందీ వుండేది కాదు. అయితే ప్రియాంక పైన సగం టీషర్టు, కింద ఒక స్కర్టు వేసుకుని వచ్చింది. ఇది కూడా పెద్ద సమస్య కాదు. అయితే సదరు స్కర్టు ఒక జల్లెడ లాంటి క్లాత్‌తో కుట్టిన స్కర్ట్. సదరు స్కర్ట్ ని చూస్తుంటే ప్రియాక చోప్రా వేసుకున్న లో దుస్తులు కూడా కనిపిస్తున్నాయి. ఈ స్కర్ట్ వేసుకున్న ప్రియాంక ఆ ఫంక్షన్‌లో ఉత్సాహంగా గంతులు వేస్తే అందరూ కళ్ళు తెరుచుకుని చూశారు. అయితే ఆ తర్వాతే విమర్శకులు తమ నోళ్ళకి పదును పెట్టారు. ప్రియాంక చోప్రా కాస్తంత సెక్సీగా వుండే డ్రస్ వేసుకొస్తే పర్లేదుగానీ, మరీ లో దుస్తులు కనిపించే డ్రస్ వేసుకు రావడం భావ్యంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీ సెలబ్రిటీ వరల్డ్ లో ప్రియాంక వేసుకొచ్చిన డ్రస్సే హాట్ టాపిక్‌గా మారింది.

విడాకుల బాటలో విద్యాబాలన్?

బాలీవుడ్ కథానాయిక విద్యాబాలన్ పెళ్ళి పెటాకులు కాబోతోందా? మొన్నీమధ్యే జరిగిన ఆమె పెళ్ళి మూడునాళ్ళ ముచ్చట కాబోతోందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. విద్యాబాలన్ బాలీవుడ్ నిర్మాత, వ్యాపారవేత్త సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని 2012లో పెళ్ళి చేసుకుంది. సిద్ధార్థ్ రాయ్ కపూర్ కపూర్ తక్కువోడేం కాదు. అయ్యగారికి గొప్ప ఫ్లాష్ బ్యాక్‌లే వున్నాయి. మామూలుగా టాప్ హీరోయిన్లందరికీ సెకండ్ హ్యాండ్ భర్తలే దొరకుతారన్న అభిప్రాయం వుంది. అయితే విద్యాబాలన్‌కి మాత్రం థర్డ్ హ్యాండ్ భర్త దొరికాడు. సిద్ధార్థరాయ్ కపూర్ పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చాలా చిన్న వయసులోనే తన క్లాస్‌మేట్‌‌ని పెళ్ళి చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమెకి విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత టీవీ సీరియళ్ళు నిర్మించే ఒకామెని పెళ్ళి చేసుకున్న సిద్ధార్థ్ 2011లో ఆమెకీ చెల్లుచీటీ రాశాడు. 2012లో విద్యాబాలన్‌ని పెళ్ళి చేసుకున్నాడు. ఇప్పుడీ జంట కూడా విడాకుల బాటలో పయనిస్తోందని సమాచారం. విద్యాబాలన్ పిల్లల్ని కనాలని సిద్ధార్థ్ కోరుకుంటుంటే, విద్యాబాలన్ మాత్రం అప్పుడే నాకు పిల్లలేంటీ అంటోందట. ఈ విషయంలో భార్యభర్తలిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వున్నాయట. అలాగే గత ఏడాది విద్యాబాలన్ విదేశీ పర్యటనలలోనే బిజీగా వుంది. దాంతో సిద్ధార్థ్ ఒక హీరోయిన్‌కి చేరువయ్యాడట. ఇది విద్యాబాలన్‌కి ఆగ్రహం తెప్పించిందట. ఇలా రకరకాల కారణాల వల్ల వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం.

డిగ్గీతో అమృతా రాయ్ రొమాన్స్ ఫోటో: ఫిర్యాదు

      దిగ్విజయ్ సింగ్, టీవి యాంకర్ అమృతా రాయ్ మధ్య వున్న ఎఫైర్ సడన్ గా బయటపడడం, అమృతని పెళ్ళి చేసుకోబోతున్నానని దిగ్విజయ్ ప్రకటించడం దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేవిధంగా తన కంప్యూటర్ని, ఈ మెయిల్‌నీ ఎవరో హ్యాక్ చేశారని అమృత వాపోయింది. దిగ్విజయ్, తాను సన్నిహితంగా వున్న ఫొటోలు నా కంప్యూటర్లో, ఈ మెయిల్లో వున్నాయి. వాటిని ఎవరో సంపాదించి ఇంటర్నెట్‌లో లీక్ చేశారని చెప్పింది. తాజాగా ఆమె హ్యాకింగ్ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమృతా రాయ్ గురువారం తన జీ మెయిల్, ఫెస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు ఫిర్యాదు చేసిందని, క్రైం బ్రాంచ్ ఐటి యాక్ట్ కింద్ కేసును నమోదు చేశారని ఢిల్లీ క్రై బ్రాంచ్ పోలీసు అధికారులు చెప్పారు.

వెయిట్ లాస్‌ కోసమెళ్తే ప్రాణమే లాస్

      కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందనేది పాత సామెత. ఇప్పుడు ఆ సామెతకి తగ్గ సంఘటన ఇండోర్‌లో జరిగింది. అయితే ఈ సంఘటనలో నాలుక ఊడిపోలేదు. ఏకంగా ప్రాణమే పోయింది. టీవీ సీరియల్స్‌ లో నటించిన రాకేష్ దివాన్ అనే నటుడు చాలా లావుగా వుంటాడు. ఆ లావు పర్సనాలిటీ కారణంగా కొనేళ్ళక్రితం టీవీలో వచ్చిన రామాయణం సీరియల్‌లో కుంభకర్ణుడి పాత్ర ఆయనకి దక్కింది. ఆ పాత్ర ద్వారా రాకేష్ దివాన్ బాగా పాపులర్ అయ్యాడు.   అయితే ఆయనకి సడెన్‌గా సన్నబడిపోవాలన్న కోరిక కలిగింది. వెంటనే ఇండోర్‌లోని ఓ ఆస్పత్రిని సంప్రదించాడు. ఆస్పత్రి వాళ్ళు ఆయన ఒంట్లోని కొవ్వు తీసేయడానికి ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ జరుగుతూ వుండగానే రాకేష్ దివాన్ ప్రాణాలు కోల్పోయాడు. దివాన్ కుటుంబ సభ్యులు హాస్పిటల్‌ వాళ్ళు నాసిరకం వైద్యం చేశారన విమర్శిస్తుంటే, సదరు హాస్పిటల్ వాళ్ళు మాత్రం దివాన్ చనిపోయింది అతని అనారోగ్యం కారణంగానే తప్ప తమ వెయిట్‌లాస్ ఆపరేషన్ కారణంగా కాదని అంటున్నారు. ఏది ఏమైనా వెయిట్ లాస్ ఆపరేషన్ కారణంగా ఒక ప్రాణమే లాసయింది.

హీరో రాజా పెళ్ళాం నల్లపిల్ల!

      సాధారణంగా తెల్లటి అమ్మాయిలకి నల్లటి అబ్బాయి మొగుడుగా వస్తాడు. తెల్లటి అబ్బాయికి నల్లటి అమ్మాయి పెళ్ళాంగా దొరుకుతుంది. పొట్టి వాళ్ళు పొడుగువాళ్ళని, పొడుగువాళ్ళు పొట్టివాళ్ళని లైఫ్ పార్టనర్‌గా ఫిక్స్ చేసుకుంటారు. ఈ సూత్రం హీరో రాజా విషయంలో కూడా మరోసారి ప్రూవ్ అయింది. రాజా పెళ్ళి శుక్రవారంనాడు చెన్నైలో జరిగింది. చైన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అమృతతో రాజా పెళ్ళి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగింది. తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యతోపాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన జంటని ఆశీర్వదించారు.   మన రాజా ఎంత అందగాడు.. ఎంత తెల్లగా వుంటాడు. ఇప్పుడంటే ఫామ్‌లో లేడు కాబట్టి సరిపోయిందిగానీ, ‘ఆనంద్’ హిట్టయిన రోజుల్లో రాజా పేరు చెబితే అమ్మాయిలకి పూనకం వచ్చేసేది. అలాంటి రాజా పెళ్ళి చేసుకున్న అమృత నిఖార్సయిన నల్లపిల్ల. అందగత్తేగానీ, రాజా అంత  అందం మాత్రం లేదు. తన నలుపు దాచుకోవడానికి మేకప్ దట్టించిందిగానీ, వర్కవుట్ కాలేదు. అయినా సరదాకి అన్నాంగానీ, రంగులో ఏముంది? ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోనే అంతా వుంది. రాజా, అమృత పిల్లాపాపలతో, మనవళ్ళు మనవరాళ్ళతో వర్ధిల్లాలని ఆశీర్వదించేద్దాం.

గర్ల్ ఫ్రెండ్‌ని పెళ్ళాడిన ప్రముఖ హీరోయిన్

      ఇప్పటికే ఎంతోమంది మగాళ్ళను పెళ్ళి చేసుకుని వదిలేసిన ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ జోడీ ఫాస్ట్రర్‌కి మగాళ్ళంటే బోర్ కొట్టేసినట్టుంది. అందుకు ఇప్పుడు తన సహనటి, స్నేహితురాలు అయిన అలెగ్జాండ్రా హెడిసన్‌ని పెళ్ళి చేసుకుంది. జోడీ ఫాస్ట్రర్‌తో జోడీ కట్టిన అలెగ్జాండ్రా గతంలో జోడీతో కలసి ‘టాక్సీ డ్రైవర్’, ‘సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్’, ‘ది అక్యూజ్డ్’ సినిమాల్లో కలసి నటించింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ‘స్నేహం’ కొనసాగుతోంది. అలాగే అమెరికాలోని ఒక టాక్ షో హోస్ట్ అయిన ఎలెన్ డీజెనెరస్‌కి ప్రియురాలిగా ఈమె కొంతకాలం కొనసాగింది. ప్రస్తుతం ఈమె జోడీ ఫాస్ట్రర్‌కి వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తోంది. వీరిద్దరి అనుబందం ఎంత గొప్పదంటే, వీరిద్దరూ కలసి గతంలో హాలీవుడ్ నటుడు సిడ్నీ బెర్నార్డ్ తో జాయింట్‌గా సంబంధం కొనసాగించారు. ఇప్పుడు ఇద్దరూ కలసి బెర్నార్డ్ కి గుడ్ బై చెప్పి, ఇద్దరూ పెళ్ళి చేసుకుని ఒక ఇంటివారయ్యారు. బుధవారం లాస్ ఏంజెల్స్ లో చాలా నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

రాణి ముఖర్జీ, ఆదిత్య చోప్రాకి ఇటలీలో పెళ్ళి

  ప్రముఖ బాలీవుడ్ కథానాయిక రాణిముఖర్జీ పెళ్ళి చేసుకుంది. రాణీ పెళ్ళాడింది ఎవర్నో కాదు.. ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’, ‘మొహబ్బతే’, ‘రబ్ నే బనాదీ జోడీ’ తదితర చిత్రాల దర్శకుడు, యష్‌రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రాతో. ఈమధ్యకాలంలో వీరిద్దరి ‘అనుబంధం’పై బాలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ పుకార్లను నిజం చేస్తూ వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. సోమవారం రాత్రి ఇటలీలో సమీప బంధువుల సమక్షంలో వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. ఈ విషయాన్ని యష్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. బాలీవుడ్ హీరోయిన్లందరూ రెండో పెళ్ళివాడిని చేసుకోవడం అనే సంప్రదాయం అనేకమంది హీరోయిన్ల విషయంలో జరిగింది. ఆదిత్య చోప్రాకి గతంలో పాయల్ ఖన్నాతో పెళ్ళయింది. విభేదాల కారణంగా వీరిద్దరూ 2009లో విడిపోయారు.

ఆత్మహత్య చేసుకొన్న దర్శకుడు

  రంగురంగుల సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలుకానివారు ఎల్లపుడూ ఉంటూనే ఉన్నారు. కానీ వారిలో ఏకొద్దిమంది కలలు మాత్రమే సాకారం అవుతాయి. మిగిలిన వారికి జీవితాంతం నిరాశ, నిస్ప్ప్రుహలు, ఆర్ధిక సమస్యలు వెన్నాడుతూనే ఉంటాయి. అవి తట్టుకోలేనివారు అర్ధంతరంగా జీవితం ముగించి తమ కుటుంబ సభ్యులను, మందు మిత్రులను విషాదంలో ముంచి వెళ్ళిపోతారు.   ఇటీవలే సినీరంగంలో అడుగుపెట్టిన జగదీశ్ (40) అనే యువదర్శక నిర్మాత, ఆర్ధిక సమస్యల కారణంగా శనివారం మధ్యాహ్నం వైజాగ్ సింహపురి కాలనీ సమీపంలో ఒక విద్యుత్ స్తంభానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఆయన ఐదు రోజుల క్రితమే విజగ్ లో తన మొట్ట మొదటి సినిమా ‘బూచోడు’ షూటింగ్ ప్రారంభించారు. దానిని స్వీయ దర్శకత్వంలో ఆయనే నిర్మిస్తున్నారు. అన్ని సమకూర్చుకొని సినిమా అయితే మొదలుపెట్టగాలిగారు కానీ, అది ఆర్ధికంగా పెనుభారం అవడంతో అప్పులపాలయ్యారు. బహుశః ఆ ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. జగదీశ్ కి భార్య, ఇంజినీరింగ్, ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పవన్ కళ్యాణ్‌తో రామ్‌చరణ్ కటీఫ్ : ‘పవర్’కి గుడ్ బై?

  చిరంజీవిని ఆయన అభిమానులు ‘మెగాస్టార్’ అని పిలుచుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్‌ని ‘పవర్‌స్టార్’ అని పిలుచుకుంటూ వుంటారు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ని ఈ రెండు స్టార్లూ మిక్స్ చేసి ‘మెగా పవర్ స్టార్’ అని పిలుస్తున్నారు. చిరంజీవి కొడుక్కి పెట్టిన బిరుదులో పవన్ కళ్యాణ్ బిరుదుని ఎందుకు మిక్స్ చేశారో ఆ అభిమానులకి, ఆ దేవుడికే తెలియాలి. తప్పో ఒప్పో రామ్‌చరణ్‌ని ఆయన అభిమానులు ‘మెగా పవర్ స్టార్’ అని పిలుస్తున్నారు. నిన్నటి వరకూ ఈ బిరుదు విని రామ్‌చరణ్ పులకరించిపోయేవాడు. అయితే ఇప్పుడు ఆ బిరుదు వింటేనే రామ్‌చరణ్‌కి చిర్రెత్తుకొస్తున్నట్టు తెలుస్తోంది. తన తండ్రి చిరంజీవికి వ్యతిరేకంగా రాజకీయ రంగంలో పనిచేయడమే కాకుండా, కుటుంబపరంగా కూడా తమకు చాలా దూరమైపోయిన పవన్ కళ్యాణ్ బిరుదు తన బిరుదులో ఎందుకు వుండాలని రామ్‌చరణ్ భావిస్తున్నట్టు సమాచారం. ఇకపై అభిమానులు తనను ‘మెగా పవర్ స్టార్’ అని సంబోధించవద్దని రామ్ చరణ్ తన అభిమానులకు ఇప్పటికే సూచించినట్టు తెలుస్తోంది. ఇక ఏ సందర్భంలోనూ తనను ఆ పేరుతో పిలవటాన్ని తాను ఇష్టపడనని రామ్‌చరణ్ ఫ్యాన్స్ కి స్పష్టం చేసినట్టు సమాచారం. అలాగే ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతూ సెట్స్ మీద వున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా టైటిల్స్ లోగానీ, పబ్లిసిటీలోగానీ ‘మెగా పవర్ స్టార్’ అనే అక్షరాలు కనిపించకూడదని నిర్మాతకు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది.

నా బంగారు తల్లి : తెలుగు సినిమారంగం సిగ్గుపడాలి!

  ఈసారి జాతీయ సినిమా అవార్డులలో తెలుగు సినిమా ‘నా బంగారు తల్లి’ సినిమాకి తెలుగులో ఉత్తమ చిత్రం అవార్డుతోపాటు మరో రెండు విభాగాల్లో అవార్డులు రావడం తెలుగు సినిమా రంగానికి సంతోషానిన కలిగిస్తోంది. చాలాకాలం తర్వాత జాతీయ సినిమా రంగంలో తెలుగు సినిమా ఈ స్థాయిలో వినిపించింది. ఇది తెలుగు సినిమా రంగం గర్వించదగ్గ అంశమని చాలామంది సినిమావాళ్ళు అంటున్నారు. అయితే ఈ సినిమా సాధించిన ఘనతను తెలుగు సినిమా రంగం తన అకౌంట్లో వేసుకోవడానికి ముందు సిగ్గుపడాలి. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడు తెలుగువాడు కాదు. రాజేష్ టచ్ రివర్ అని మలయాళ దర్శకుడు. నిర్మాతలు కూడా రెగ్యులర్‌గా తెలుగు సినిమాలు తీసే నిర్మాతలు కాదు. మంచి సినిమా మీద ఆసక్తితో వచ్చిన వ్యక్తులే నిర్మించారు. ఈ సినిమా తీసినవాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో ఈ చిత్రాని విడుదల చేసే శక్తిలేక ఊరుకున్నారు. వీళ్ళు సినిమా విడుదల చేయాలంటే, సినిమా నిర్మాణానికి ఎంత ఖర్చయిందో అంతకంటే నాలుగైదు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాలి. అలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఎలా విడుదలవుతుంది. కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న అనేక మంచి సినిమాల్లో కూడా ‘నా బంగారు తల్లి’ కూడా ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా ఇంకా కొంతకాలం విడుదల కాకుండా వుంటే, ఎన్నో వందల సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా కీర్తిశేషురాలైపోయేది. తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ సినిమా మన రాష్ట్రంలో రిలీజ్ కాలేక ఉత్త చిత్రంగా మిగిలిపోయేది. అయితే ఇప్పుడు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి కాబట్టి ఇది అర్జెంటుగా ‘మన తెలుగు సినిమా’ అయిపోయింది. ఈ సినిమా సాధించిన విజయాన్ని తన అకౌంట్లో వేసుకోవడానికి తెలుగు సినిమా రంగం రెడీ అయిపోయింది.

తల్లి కాబోతున్న మనీషా!

        బాలీవుడ్‌తోపాటు దక్షిణాది సినిమా రంగాన్ని కూడా ఒక ఊపు ఊపి, ఆ తర్వాత పెళ్ళి చేసుకుని, ఆ పెళ్ళికాస్తా పెటాకులైపోయి, అనంతరం కేన్సర్ బారిన పడి కోలుకున్న మనీషా కోయిరాలా తల్లి కావాలని కోరుకుంటోంది. వైవాహిక జీవితం ముగిసిపోయన 44 సంవత్సరాల మనీషా కొయిరాలాకి ఇప్పుడు తల్లి కావాలన్న కోరిక పుట్టింది. ఈ వయసులో మనీషాకి ఇదేం కోరిక అని ఆశ్చర్యపోతున్నారా? మనీషా ఇప్పుడు తల్లి కావాలనుకోవడం తానేదో గర్భం ధరించి తల్లి కావడం కాదు.. ఒక అనాథ బాలికను దత్తత తీసుకుని ఆ పాపని సొంత కూతురిలా పెంచి పెద్ద చేసి, ప్రయోజకురాలిని చేయాలన్నది మనీషా కోరికట. తాను దత్తత తీసుకునే పాప కోసం మనీషా అన్వేషణ కూడా ప్రారంభించింది. కేన్సర్ నుంచి బతికి బయటపడ్డ తన జీవితానికి ఒక ఆలంబనలా వుండేలా దత్తత తీసుకునే అమ్మాయిని పెంచుకుంటానని మనీషా చెబుతోంది. కేన్సర్‌ని జయించిన మనీషా ప్రస్తుతం కేన్సర్ అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటోంది.

మోహన్ బాబు 'పద్మశ్రీ'ని వాడొద్దు: సుప్రీం

      ప్రముఖ నటుడు మోహన్ బాబుకు పద్మశ్రీ అవార్డ్ వివాదంలో సుప్రీంకోర్ట్ షాకిచ్చింది. 'పద్మశ్రీ' పేరును ఇప్పటి వరకూ ఉపయోగించిన ప్రతి చోట నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకముందు పద్మశ్రీ పేరును సినిమాల్లో, మరెక్కడా, కనీసం ఇంటి నేమ్ ప్లేట్ మీద కానీ వాడుకోనని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్ట్ సూచించింది. ఈ కేసు విచారణను 17వతేదికి వాయిదా వేసింది. దేనికైనా రెడీ సినిమా టైటిల్స్ లో మోహన్ బాబు తన పేరు ముందు 'పద్మశ్రీ' పేరును వాడడంతో ఈ వివాదం మొదలైంది. బీజేపి నేత ఇంద్రసేనా రెడ్డి మోహన్ బాబు 'పద్మశ్రీ'ని దుర్వినియోగం చేస్తున్నారని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు 'పద్మశ్రీ' ని తిరిగి ఇచ్చేయాలని ఆదేశించడంతో మోహన్ బాబు సుప్రీంకోర్ట్ ను ఆశ్రయించారు.

ముద్దులిస్తా.. బికినీ వేస్తా: అలియా భట్

  సినిమాల్లో హీరోలకి ఎన్ని ముద్దులు ఇవ్వడానికైనా తనకి ఎంతమాత్రం అభ్యంతరం లేదని బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ సిగ్గుపడకుండా చెప్పేసింది. అలాగే బికినీ వేసుకోవడంలో కూడా తనకి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా కుర్రాళ్ళకి నచ్చే ఈరకం హాట్ కామెంట్లు చేసింది.   బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కూతురైన అలియా తాను పెళ్ళి విషయంలో తన తండ్రి నడిచిన బాటలోనే నడుస్తానని చెప్పింది. తన తండ్రి ఆయన తండ్రికి చెప్పకుండా పెళ్ళి చేసుకున్నాడని, తాను కూడా తన తండ్రికి చెప్పకుండానే పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పింది. బాలీవుడ్‌లో ఎంటరై చాలా తక్కువకాలమే అయినా అలియాభట్ తన అందచందాలతో కుర్రకారుని అల్లాడిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ సినిమాలో మొత్తం 21 ముద్దు సీన్లలో నటించిన కుర్రాళ్ళ గుండెల్ని ఛిద్రం చేసింది. అలాగే ఆ సినిమాలో బికినీ వేసుకున్న అలియాని చూసి కుర్రకారు హోల్‌సేల్‌గా కిర్రుమన్నారు. ముద్దుల విషయంలో, బికినీ విషయంలో ఎంతమాత్రం మొహమాటపడనని చెప్పిన అలియా బట్టలు లేకుండా నటించమంటే మాత్రం తనవల్ల కాదని చేతులెత్తేసింది. అబ్బో... పిల్లకి ఎంత సిగ్గో!

పోటీపై డిసైడ్ అవ్వలేదు: బాలయ్య

      నందమూరి నటసింహం బాలకృష్ణ 'లెజెండ్' సినిమా విజయవంతమైన సందర్బంగా ఈ రోజు కరీంనగర్ ధర్మపురిలోని లక్ష్మీ నరసింహ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో పోటీ చేసే దానిపై ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు. పార్టీ తరపున తెలంగాణాలో కూడా ప్రచారం చేస్తానని వెల్లడించారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే దానిపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. అయితే గతంలో తన తండ్రి నందమూరి తారక రామారావు ప్రాతినిధ్యం వహించిన హిందూపురం స్థానం నుంచే తాను పోటీ చేయాలని భావిస్తున్నట్లు బాలకృష్ణ తన ఆకాంక్షను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

సోనాక్షికి అంకుల్సే ఇష్టమట!

      బాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సోనాక్షి సిన్హాకి కుర్ర హీరోల కంటే అంకుల్స్ హీరోలంటేనే ఎక్కువ ఇష్టమట. అలాంటి వాళ్ళ సరసన నటించడమంటేనే ఇష్టమని కొన్ని పేర్ల లిస్టు కూడా చెప్పింది. సోనాక్షి ఇప్పటికే తన తండ్రి శత్రుఘ్న సిన్హా కంటే ఎక్కువ వయసున్న రజనీకాంత్‌తో కలసి నటించడానికి అంగకరించిందని సమాచారం. అలాగే ‘రియో 2’ అనే హాలీవుడ్ సినిమాలో సోనాక్షి నటించింది. ఆ అనుభవం గురించి చెబుతూ, హాలీవుడ్‌లో ఎక్కువ సినిమాల్లో నటించాలన్న ఆసక్తి ‘రియో 2’లో నటించాక నాకు కలిగింది. హాలీవుడ్‌లో జార్జ్ కూలెనీ, బ్రాడ్ పిట్, టామ్ క్రూయిజ్ లాంటి అంకుల్స్ పక్కన హీరోయిన్‌గా నటించాలని ఆశిస్తున్నాను అని సోనాక్షి చెప్పింది.

లెస్బీ కిస్ సంచలనం!

      హిందీ సినిమాల్లో లిప్ టు లిప్ కిస్ సీన్లు మామూలైపోయాయి. ఏదైనా సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లిప్ కిస్ లేకపోతే ఆ సినిమా దర్శక నిర్మాతలకు టేస్ట్ లేదని ప్రేక్షకులు డిసైడైపోతున్నారు. ఇదిలా వుంటే సన్నీ లియోన్ నటించిన ‘రాగిణి ఎంఎంఎస్-2‘ సినిమా ఈ మధ్య విడుదలైంది. ఈ సినిమాలో సన్నీ లియోన్, సంధ్యా మృదుల్ మధ్య ఒక లిప్ టు లిప్ లెస్బీ కిస్ సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలోనే ఇది అత్యంత హాట్ సీన్ అని, హీరో హీరోయిన్ల లిప్ కిస్ కంటే ఇద్దరు హీరోయిన్ల లిప్ కిస్ ఎక్కువ కిక్ ఇస్తోందని ప్రేక్షకులు అంటున్నారు.   అసలే హాట్ గర్ల్ అయిన సన్నీ లియోన్ ఈ లిప్ కిస్ సీన్‌లో పూర్తిగా లీనమై నటించిందని చెబుతున్నారు. మొత్తం సినిమా అంతా ఒక ఎత్తు. లిప్ టు లిప్ లెస్బీ కిస్ ఒక ఎత్తు అని అంటున్నారు. హాలీవుడ్ సినిమాల్లో లెస్బీ కిస్‌లు మామూలేగానీ, బాలీవుడ్‌లో మాత్రం ఎప్పుడోగానీ ఇలాంటి సందర్భాలు రాలేదు. ‘ఫైర్’ సినిమాలో షబానా ఆజ్మీ, నందితాదాస్ మధ్య చిత్రీకరించిన కిస్ సీన్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాగే ‘ఐ కాంట్ థింక్ స్ట్రెయిట్’ అనే హిందీ సినిమాలో లీసారే, శీతల్ సేథ్ మధ్య చిత్రీకించిన లిప్ లాక్ సీన్ కలకలం సృష్టించింది. పరిస్థితులను చూస్తుంటే ముందు ముందు హిందీ సినిమాల్లో మరిన్ని ఇలాంటి కిస్‌లు వుండే అవకాశాలున్నాయని సినీ పండితులు భావిస్తున్నారు.