చరణ్ ఫస్ట్ లుక్ ప్లాన్ చేసిన వంశీ

  రాంచరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. ఇందులో చరణ్ న్యూ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన చరణ్ ఫస్ట్ లుక్ ను మార్చి27 చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తమిళనాడులో జరుగుతుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

స్టార్ హంట్ పెట్టిన వెంకీ

  వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలలో తెరకెక్కనున్న తాజా చిత్రం "దృశ్యం" ఇటీవలే ముహూర్త కార్యక్రమాలు జరుపుకుంది. శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలోని రెండు ముఖ్య పాత్రల కోసం స్టార్ హంట్ నిర్వహిస్తున్నారు. "అంజలి అనే పాత్ర కోసం 14-17 ఏళ్ల అమ్మాయి. అను అనే పాత్ర కోసం 8-12 ఏళ్ల అమ్మాయిని ఎంపిక చేయాలనుకుంటున్నాం. దానికోసమే ఈ స్టార్ హంట్. ఆసక్తి ఉన్నవారు drishyam.telugu@gmail.com కి ఫోటోలు మెయిల్ చేయవచ్చు" అని నిర్మాతలు తెలిపారు. ఇందులో నదియా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

అవిక లవ్ లో పడిపోయిందట

  అవికా గోర్, శౌర్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం "లక్ష్మీ రావే మా ఇంటికి". నంద్యాల రవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ సీనియర్ పాత్రికేయులు గిరిధర్ నిర్మిస్తున్నారు. ఈ గురువారం హైదరాబాదులో చిత్ర ముహూర్తపు కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ...మంచి కథతో సినిమా నిర్మించాలని నా ఆశ. ఈ సినిమాతో నా కోరిక నెరవేరుతుంది. నంద్యాల రవి చక్కని కథ తయారు చేశారు. అవికా కోసం ఆరు నెలలు ఎదురు చూశాం. ఆమెతో సినిమాకు గ్లామర్ వచ్చింది. "ఇడియట్" సినిమాతో రవితేజకు ఎంత మంచి పేరొచ్చిందో.. ఈ చిత్రం ద్వారా శౌర్యకి కూడా మంచి పేరు వస్తుంది" అని అన్నారు. అవికా మాట్లాడుతూ... కథ వినగానే.. నా పాత్రతో నేను లవ్ లో పడిపోయాను. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది" అని ఆశాభావం వ్యక్తం చేసారు.

విశ్వనాధ్ గారి బర్త్ డే స్పెషల్

      విశ్వనాద్ సినిమాలు తెలుగంతా తీయగా...తీపంత హీయిగా..హాయిగొలిపే తీరుగా..సెలయేరులా, గలగల పారే గోదావరిలా...గోదారిలోని నావలా, నావతెరచాపలా..మురిపిస్తూ..మై మరపిస్తుంటాయి...తెలుగన్న తెలుగు సినిమాలన్న మక్కువ గలవారు..ముందుగా విశ్వనాధ్ సినిమాలే చూడాలనుకుంటారు....ఆయన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ వుండవు..భారి సెట్టింగ్స్ వుండవు....ద్వంద్వార్ధపు సంభాషణలు అర్ధం పర్ధంలేని సన్నివేశాలు అసలుండవు.. ఆయనా అయిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతాయ్..   ఎంతో మంది కళాకారుల్ని అందించిన గుంటూరు జిల్లానే విశ్వనాధుణ్నీ అందించింది..సత్సాంప్రదాయపు కుటుంబం లో జన్మించిన ఆయన సాంప్రదాయబద్దంగా పెరిగారు..విశ్వనాధ్ చిన్నతనం కళలతో సంబంధం లేకుండా సాగింది అని అంటే ఎవ్వరు నమ్మరు..విశ్వనాధ్ తండ్రి వాహిని ప్రొదక్షన్ లో రిజినల్ మేనేజర్ గా చేసేవారు దాంతో ఆయన విద్యబ్యాసం విజయవాజ,గుంటూరులో సాగంది..               డిగ్రీ పూర్తి చేసిన విశ్వనాధ్ ఎక్కడో చోట పనిచేయాలని తన మేనమామ సలహ పై ఆయన తండ్రి ఆయన్ను మద్రాస్ వాహిని స్టూడియొలో సౌండ్ విభాగం లో రికార్డిస్ట్ గా చేర్పించారు....ఆ విధం గా జీవనోపాధి కోసమే చిత్రరంగ ప్రవేశం చేసారు తప్పితే విశ్వనాధ్ కు చిన్నప్పటినుంచీ కళా దృష్టి వుందని అనుకోవలసిన అవసరం లేదు...అలా టెక్నీషియన్ గా విశ్వనాధ్ కెరీర్ సినిమాలతోనే ప్రారంభమైయింది            మహమహుల సమక్షం లో తన కెరీర్ కు గట్టి పునాదులు వేసుకున్నారు విశ్వనాధ్..సౌండ్ రికార్డస్ట్ గా చేయడం వల్ల దాదాపు అన్ని రకాల సినిమాలకు పని చేస్తూ, అందరు ప్రముఖులతోనూ పరిచయం పెంచుకుంటూ..తనలోని దర్శకుణ్ని వెలికి తీసారు..శంకరాభరణం,సాగరసంగమం, సిరివెన్నెల,స్వాతి ముత్యం, స్వాతికిరణం,స్వయంకృషి, స్వర్ణకమలం వంటి ఎన్నో సినిమాలు ఆయన కళాతృష్ణకి తార్కాణాలు. ఆయన సినిమాల్లోని సంగీతం అజరామరం. ఎన్ని పాటలున్నా,ఎన్నిపాటలు విన్నా ఆయన సినిమాల్లోని పాటలు వింటేనే మనసుకి ఆహ్లాదం, శాంతి సంగీత నృత్యాల నేపథ్యం తీసుకొన్నా ప్రతిచిత్రం ఒక భిన్నమైన చిత్రమే.             విశ్వనాద్ చిత్రాల్లో నాటకీయత, కృత్రిమత్వం అసలేమాత్రం వుండవు..పాత్రలు చాలా సహజం గా ప్రవర్తిస్తాయి తప్పితే...నటించినట్టే అనిపించదు..అందుకే ఆయన సినిమాలకు ఇప్పటికీ జీవముంటుంది.. తెలుగు అనే పదానికి విశ్వనాద్ నిలువెత్తు నిదర్శనం..సత్సాంప్రదాయాన్ని సంగీతం తో ఎంతో ఇంపుగా వినసొంపుగా చూపించడం ఈయన శైలి అందుకే విశ్వనాధుని చిత్రాలు విశ్వజనరంజకం అయ్యాయి...  

ఓ ముగ్గురి కథ కొంచెం విడుదలయ్యింది

  దయా పిక్చర్స్ అనే నూతన నిర్మాణ సంస్థ "ఓ ముగ్గురి కథ" అనే చిత్రాన్ని తెరకేక్కిస్తుంది. ఈ చిత్రం ద్వారా కిరణ్, ఫణి ప్రకాష్, వర్ధన్, హిమజలు తెలుగుతెరకు పరిచయమవుతున్నారు. దయా దర్శకత్వంలో కె.నరేందర్ రెడ్డి, కె.వరలక్ష్మి రెడ్డి నిర్మిస్తున్నారు. 25 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్ర ట్రైలర్స్ ను, పోస్టర్స్ ను ఫిల్మ్ ఛాంబర్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిధిగా విచ్చేసారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నేడు బాలయ్య విలన్ బర్త్ డే

  25 సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో హీరోగా రాణిస్తూ, తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు జగపతిబాబు పుట్టినరోజు నేడు. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా హీరోలతో, దర్శకులతో మల్టీస్టారర్ చిత్రాలలో కూడా నటించే మనస్తత్వం కలవాడు. ప్రస్తుతం ఆయన ప్రతినాయకుడిగా మరో కొత్త రూపంలో కనిపించబోతున్నాడు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న "లెజెండ్" అనే చిత్రంలో జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడు. నేడు ఈయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. అంతే కాకుండా ప్రస్తుతం "పిల్లా నువ్వులేని జీవితం", "రారా కృష్ణయ్య" వంటి చిత్రాలలో మంచి పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.   ఈ సందర్భంగా జగపతిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగువన్.కామ్

మధురగాయకుడు ఘంటసాల 40వ వర్ధంతి

      గొంతులో తీపి, హృదయంలో మధురిమ గల గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆయనది జన్మతహ గంభీరమైన స్వరం. అర్ధ శతాబ్దంపాటు పలు తరాల నటులకు, తెలుగు సినిమా పాటలకు గాత్రదానం చేశారు.శ్రోధల మదిలో చిరకాలం నిలిచిపోయే వరాన్ని పొందారు.                          ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపథ్య గాయకులలో ప్రముఖులు. 1922 డిసెంబర్‌ 4న గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు.  ఆయనను అంతా 'బాల భరతుడు' అని పిలిచేవారు. సూర్యనారాయణ మరణించే ముందు సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి గొప్ప సంగీత విద్వాంసుడివి కమ్మని కోరారు. ఆయన మరణంతో ఘంటసాల కుటుంబ పరిరక్షణను రత్తమ్మగారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్యగారు చూసుకోవడం మొదలుపెట్టారు.            తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరినా, ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేశారు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వులపాలయ్యారు. అప్పటినుండి ఆయనలో పట్టుదల పెరిగింది. తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళలో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నారు... ఆలస్యమయినా తన తప్పు తెలుసుకొన్న ఘంటసాల తన దగ్గర ఉన్న నలభై రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి ఆంధ్రరాష్ట్రం లో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకొన్నారు.            1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలయిన సావిత్రిని పెళ్ళి చేసుకున్నారు. ఆ రోజు సాయంత్రం తానే తన పెళ్ళికి కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెతారు. కొన్నాళ్ళకు దగ్గరి వూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయనను కలిశారు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాలవారు మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నారు. ఘంటసాల రెండు నెలలు కష్టపడి కచేరీలు చేసి, కొంత అప్పు చేసి మద్రాసు వెళ్ళారు. సముద్రాలవారు ఘంటసాలను రేణుకా ఫిలింస్‌కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్‌.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించారు.          ఘంటసాల పాట విని అవకాశాలు ఉన్నప్పుడు ఇస్తామన్నారు..సముద్రాల వారు అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయ కుడి అవకాశాన్ని ఇప్పించారు. ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవారు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపు పొందారు. ఘంటసాల చేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తురు నాగయ్య, బి.ఎన్‌.రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమలో మొదటిసారి నేపథ్య గాయకుడి అవకాశాన్ని ఇచ్చారు.           భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆ పాటకు ఆయనకు 116 రూపాయల పారితోషకం లభించింది. తర్వాత బాలరాజు, మనదేశం వంటి హిట్‌ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించారు. 1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారు మోగింది. తరువాత విడుదలయిన మల్లిశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. సాలూరి రాజేశ్వరరావు సంగీతానికి ఘంటసాల గాత్రం తొడై రసానందం తారస్థాయికి చేరింది.            1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీ జీవితంలో మరో మైలురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలో నా నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడూ చెపుతుంటారు. 1955లో విడుదలయిన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని 'శేష శైలవాస శ్రీ వేంకటేశ' పాటను తెరపైన కూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాట అయినా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్న ఖ్యాతి తెచ్చుకొన్నాడు. 1970 వరకు దాదాపు ప్రతి పాట ఘంటసాల పాడినదే! ఏ నోట విన్నా ఆయన పాడిన పాటలే.         1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేశారు. 1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరారు. అప్పటికే చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. చాలా రోజులు చికిత్స అనంతరం హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ అయ్యారు. అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరిక కలిగింది. భగవద్గీత పూర్తి చేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నారు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలయిన హిట్‌ చిత్రాలకు పాటలు పాడారు. 1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూశారు.             ఘంటసాల వెంకటేశ్వరరావు మనని వదలి వెళ్ళి దాదాపు దశాబ్దాలు కావస్తున్నా ఈనాటికీ ఆయన పాటలను ఎవరూ మరిచిపోలేదు. ఆయనకు సాటి రాగల గాయకుడూ రాలేదు. తెలుగు సినీ సంగీతపు స్వర్ణయుగానికి ప్రతీకగా ఆయన అమరుడే.