లెస్బీ కిస్ సంచలనం!
posted on Apr 5, 2014 @ 11:39AM
హిందీ సినిమాల్లో లిప్ టు లిప్ కిస్ సీన్లు మామూలైపోయాయి. ఏదైనా సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లిప్ కిస్ లేకపోతే ఆ సినిమా దర్శక నిర్మాతలకు టేస్ట్ లేదని ప్రేక్షకులు డిసైడైపోతున్నారు. ఇదిలా వుంటే సన్నీ లియోన్ నటించిన ‘రాగిణి ఎంఎంఎస్-2‘ సినిమా ఈ మధ్య విడుదలైంది. ఈ సినిమాలో సన్నీ లియోన్, సంధ్యా మృదుల్ మధ్య ఒక లిప్ టు లిప్ లెస్బీ కిస్ సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలోనే ఇది అత్యంత హాట్ సీన్ అని, హీరో హీరోయిన్ల లిప్ కిస్ కంటే ఇద్దరు హీరోయిన్ల లిప్ కిస్ ఎక్కువ కిక్ ఇస్తోందని ప్రేక్షకులు అంటున్నారు.
అసలే హాట్ గర్ల్ అయిన సన్నీ లియోన్ ఈ లిప్ కిస్ సీన్‌లో పూర్తిగా లీనమై నటించిందని చెబుతున్నారు. మొత్తం సినిమా అంతా ఒక ఎత్తు. లిప్ టు లిప్ లెస్బీ కిస్ ఒక ఎత్తు అని అంటున్నారు. హాలీవుడ్ సినిమాల్లో లెస్బీ కిస్‌లు మామూలేగానీ, బాలీవుడ్‌లో మాత్రం ఎప్పుడోగానీ ఇలాంటి సందర్భాలు రాలేదు. ‘ఫైర్’ సినిమాలో షబానా ఆజ్మీ, నందితాదాస్ మధ్య చిత్రీకరించిన కిస్ సీన్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాగే ‘ఐ కాంట్ థింక్ స్ట్రెయిట్’ అనే హిందీ సినిమాలో లీసారే, శీతల్ సేథ్ మధ్య చిత్రీకించిన లిప్ లాక్ సీన్ కలకలం సృష్టించింది. పరిస్థితులను చూస్తుంటే ముందు ముందు హిందీ సినిమాల్లో మరిన్ని ఇలాంటి కిస్‌లు వుండే అవకాశాలున్నాయని సినీ పండితులు భావిస్తున్నారు.