అమీర్ ఖాన్ ‘పీకే’ పోస్టర్ కాపీ అట!!

  బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ సినిమాలు సొంత క్రియేటివిటీతో రూపొందిస్తారన్న అభిప్రాయం ఇండియాలో వుంది. సినిమాల విషయం ఏమోగానీ, ఆయా సినిమాల పోస్టర్లు మాత్రం కాపీ పోస్టర్లన్న అభిప్రాయం వినిపిస్తోంది. తాజాగా అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమా వాల్ పోస్టర్ వార్తల్లో నిలిచింది. అమీర్ ఖాన్ బట్టల్లే కుండా నిల్చుని, ఆచ్ఛాదన కోసం ఒక టేప్ రికార్డర్ని పెట్టుకుంటాడు. అయితే ఈ పోస్టర్ అసభ్యకరంగా వుందంటూ ఇప్పటికే ఒక కేసు నమోదైంది. దీంతోపాటు ఈ పోస్టర్‌కి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. 1973 సంవత్సరంలో క్విమ్ బారియోరోస్ అనే పోర్చుగీస్ సంగీత కళాకారుడు తన మ్యూజిక్ ఆల్బమ్ కోసం రూపొందించిన పోస్టర్ని కాపీకొట్టీ ‘పీకే’ పోస్టర్ రూపొందించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విమర్శకులు తమ విమర్శలకు బలం చేకూర్చడానికి 1973 నాటి పోస్టర్‌ని కూడా సాక్ష్యంగా చూపిస్తున్నారు.

శ్రీదేవి మా అమ్మ కాదు.. మా నాన్న రెండో భార్య..అంతవరకే..

  చాలామంది టాప్ హీరోయిన్లు ఎవరికో ఒకరికి రెండో భార్యగానే సెటిలయ్యారు. అదో బ్యాడ్ లక్. దక్షిణాదిలో, ఉత్తరాదిలో దుమ్ము దులిపిన శ్రీదేవి కూడా బోనీ కపూర్‌కి రెండో భార్యే. బోనీకపూర్‌తో ఆమె సంసారం చక్కగా సాగుతోంది. అందంలో శ్రీదేవితో పోటీ పడలేకపోయినప్పటికీ బంగారం లాంటి ఇద్దరు ఆడపిల్లలు కూడా వున్నారు. అంతా బాగానే వుంది. అయితే బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ మాత్రం సవతి తల్లి అయిన శ్రీదేవిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వుంటాడు. తన తండ్రిని శ్రీదేవి హైజాక్ చేసిందని అర్జున్ అభిప్రాయపడుతూ వుంటారు. శ్రీదేవికి, అర్జున్‌కి మధ్య సయోధ్య కుదర్చడానికి గతంలో బోనీ కపూర్ ప్రయత్నించి అది కుదరకపోవడంతో చేతులెత్తేశాడు. తాజాగా అర్జున్ కపూర్ మరోసారి శ్రీదేవి మీద తన కోపాన్ని బహిర్గతం చేశాడు. శ్రీదేవి ఎప్పటికీ మా నాన్న బోనీ భార్యే, అంతకుమించి మా మధ్య బంధం లేదు.. ఆమె నాకు తల్లి కాదు అంటూ అర్జున్ మరోసారి చెప్పాడు. శ్రీదేవితో తన అనుబంధం ఎప్పటికీ ఉండదని స్పష్టం చేశాడు.

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న రాజా

  శ‌ర్వానంద్‌ ర‌న్ రాజా ర‌న్‌ సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్టాడు. బాక్స్ ఆఫీస్ వద్ద రాజా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సినిమా తొలి రోజు కంటే, శ‌నివారం వ‌సూళ్లు బాగున్నాయి. తొలివారం వసూళ్లు ఆరు నుంచి ఏడు కోట్లు వరకు రావచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ ఊపురెండో వారం కూడా కొనసాగే అవకాశమే ఎక్కువగావుంది. సినిమాకు ఆరు కోట్ల వరకు ఖర్చయింది. దాంతో ఈ సినిమాకు లాభాలు ఎక్కువగా వస్తాయని నిర్మాతలు ఆశిస్తున్నారు. రాజా వ‌ల్ల అల్లుడు శీను కలెక్షన్ల జోరు తగ్గింది. బీసీ సెంట‌ర్ల‌లో అల్లుడి శీనుకి మంచి గిరాకీ ఉంది. ఏ సెంట‌ర్ల‌లో పూర్తిగా ర‌న్ రాజా ర‌న్ హ‌వా చూపిస్తోంది.

ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ... రన్ రాజా రన్

  తారాగణం: శర్వానంద్, సీరత్ కపూర్, సంపత్, జయప్రకాష్ అడివి శేషు, విద్యుల్లేఖ రామన్, కోట శ్రీనివాసరావు, సంగీతం: జిబ్రాన్, కెమెరా: మది, నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణారెడ్డి, దర్శకత్వం: సుజిత్. ‘రన్ రాజా రన్’ సినిమా శుక్రవారం విడుదలైంది.   ఇది ఒక యూత్ ఫుల్ సినిమా. కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో వినోదాత్మకంగా వుండే సినిమా ఇది. కథ విషయానికి వస్తే, ఒక ముఠా సమాజంలో ప్రముఖుల మాస్క్‌లని ముఖాలకు పెట్టకుని కిడ్నాప్‌లు చేస్తూ వుంటుంది. ఈ ముఠాని పట్టుకునే బాద్యతని దిలీప్ (సంపత్‌రాజ్) అనే పోలీస్ ఆఫీసర్‌కి అప్పగిస్తారు. ఇదిలా వుంటే, చాలామంది అమ్మాయితో లవ్ ఫెయిలైపోయి ప్రేమంటేనే విసుగుపుట్టిన దశలో వున్న రాజా హరిశ్చంద్రప్రసాద్ (శర్వానంద్)తో పోలీసు ఆఫీసర్ కూతురు ప్రియ (సీరత్ కపూర్) ప్రేమలో పడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. వీరి ప్రేమ తనకు నచ్చకపోయినా పోలీస్ ఆఫీసర్ నచ్చినట్టు నటిస్తూ వుంటాడు. తన కూతుర్ని రాజా నుంచి దూరం చేయడానికి ఒక కిడ్నాప్ డ్రామా ప్లాన్ చేస్తాడు.. ఇక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరిగి వినోదాన్ని పంచుతుంది.   హీరో శర్వానంద్ చాలా చలాకీగా నటించాడు. అతనిలోని నటుడు డెవలప్ అయ్యాడు. సీరత్ కపూర్ అందగత్తె మాత్రమే కాదు.. అభినయం కూడా తెలిసిన హీరోయిన్. సీరత్ కపూర్ తన అందంతో కుర్రాళ్ళని కట్టిపారేస్తుంది. మది మంచి కెమెరా పనితనం చూపించాడు.   కిడ్నాప్ కథ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాని ఓ అందమైన ప్రేమ కథగా రూపొందించడంలో దర్శకుడు సుజీత్ విజయం సాధించాడు. తెలుగు, తమిళ, హిందీ హీరోలు, రాజకీయ నాయకులు, క్రికెటర్ల మాస్క్ లతో వెరైటీగా కిడ్నాప్ ముఠాను దర్శకుడు వెరైటీగా డిజైన్ చేసిన తీరు బాగుంది. సినిమా నిర్మాణ విలువులు బాగున్నాయి.

బట్టలిప్పేసిన అమీర్‌ఖాన్!!

  ఇప్పటి వరకూ బాలీవుడ్ సినిమాల్లో సల్మాన్‌కాన్, జాన్ అబ్రహాం, హృతిక్ రోషన్ లాంటి హీరోలు చొక్కాలు మాత్రమే విప్పేశారు. అమీర్ ఖాన్ ఎలాగూ వీళ్ళందరి కంటే పెద్ద హీరో కాబ్టటి, పైగా ఆయన మిస్టర్ పర్‌ఫెక్ట్ కూడా కాబట్టి ఆయన ఏకంగా మొత్తం బట్టలే విప్పేశాడు. అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హీరానీ నిర్మిస్తున్న ‘పి.కె.’ అనే సినిమా కోసం అమీర్‌ఖాన్ తన బట్టలని పీకేసుకుని నగ్నంగా నిలబడ్డాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ శుక్రవారం విడుదలైంది. అమీర్ ఖాన్ ఒంటిమీద నూలు పోగులేకుండా రైలు పట్టాలపై నిలబడి కోపంగా చూస్తున్నట్టుగా వుంటాడు. అయితే అమీర్ ఖాన్ ప్రేక్షకుల మీద కాస్తంత దయ చూపించాడు. ఎక్కడైతే ఆచ్ఛాదన అవసరమో అక్కడ ఒక పాత టేప్ రికార్డర్ ను మాత్రమే అడ్డు పెట్టుకుని కరుణించాడు. ‘పి.కె.’ సినిమా మొదట్లో అమీర్ ఖాన్ ఇలా దర్శనమిస్తాడట. అనుకోకుండా భూమిపైకి వచ్చిన గ్రహాంతర జీవి పాత్రను ఆమిర్ ఖాన్ ఈ సినిమాలో పోషించాడు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై వ్యంగాస్త్రంగా ఈ సినిమాను హిరానీ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఆమిర్, హిరానీ కాంబినేషన్ వచ్చిన త్రీఇడియట్స్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఫస్ట్ లుక్‌తోనే సంచలనం సృష్టించిన ‘పి.కె.’ సినిమా విడుదలయ్యాక ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.ఈ సినిమా 19 డిసెంబర్‌న విడుదలవుతోంది.

షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ: మాయ

  తారాగణం: హర్షవర్ధన్ రాణే, అవంతికా మిశ్రా, సుష్మా రాజ్, నాగబాబు, ఝాన్సీ, సంగీతం: శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి, నిర్మాత: మధుర శ్రీధర్, దర్శకత్వం: నీలకంఠ.   ‘షో’, ‘మిస్సమ్మ’ సినిమాల ద్వారా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు నీలకంఠ వైవిధ్యమైన కథాంశాలతో చిత్రాలను రూపొందిస్తారన్న గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇప్పుడు రూపొందించిన సస్సెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘మాయ’. టీవీ ఛానల్ రిపోర్టర్‌గా పనిచేసే మేఘన (అవంతికా మిశ్రా)కి జరగబోయే సంఘటనలను ముందుగానే తెలిసిపోతూ వుండే మానసిక వ్యాధి వుంటుంది. ఆమె ఫ్యాషన్ డిజైనర్ సిద్ధార్థ (హర్షవర్ధన్ రాణే) ప్రేమలో పడుతుంది. అయితే సిద్ధార్థ మాత్రం మేఘన చిన్ననాటి స్నేహితురాలు పూజతో పెళ్ళి కుదుర్చుకుంటాడు. సిద్ధార్థ మొదటి ప్రియురాలు రోడ్డు ప్రమాదంలో మరణించిందన్న విషయం తర్వాత బయటపడుతుంది. ఇదిలా వుండగా తన స్నేహితురాలు పూజని సిద్ధార్థ చంపేయబోతున్నాడన్న విషయం జరగబోయే సంఘటనలు ముందే తెలిసిపోయే మేఘనకు తెలిసిపోతుంది. దాంతో ఆమె తన స్నేహితురాలిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నాల్లో అనేక వాస్తవాలు బయటపడతాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మాయ’ సినిమా దర్శకుడిగా నీలకంఠలోని మరో కోణాన్ని బయటపెట్టింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పెర్ఫార్మెన్స్, బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకున్నాయి.

ముద్దులిస్తా బికినీ మాత్రం వేయను

  పాకిస్థానీ మోడల్, నటి హుమైమా మాలిక్‌కి లైఫ్‌లో క్లారిటీ చాలా ఎక్కువగా వున్నట్టు కనిపిస్తోంది. అందుకే కొన్ని ‘బోల్డ్’ విషయాలని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తోంది. ఈ భామ బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. హిందీలో ఆమె తొలి చిత్రం ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించిన ‘రాజా నట్వర్‌లాల్’. ఈ సినిమా ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇమ్రాన్ హష్మీ నటించిన ఏ సినిమాలో అయినా లిప్ టు లిప్ కిస్ లేకుండా వుంటుందా? కచ్చితంగా వుండదు. అలాగే ‘రాజా నట్వర్‌లాల్’ సినిమాలో కూడా బోలెడన్ని లిప్ టు లిప్ కిస్సులున్నాయి. ఈ కిస్సు సీన్లలో హుమైమా మాలిక్ చాలా ఇన్వాల్వ్ అయిపోయిన నటించిందని, కిస్సుల విషయంలో ఇమ్రాన్ హష్మీ కంటే నాలుగాకులు ఎక్కువే చదివినట్టుగా హుమైమా మాలిక్ వుందని అనుకుంటున్నారు. హుమైమా కూడా తాను ఇమ్రాన్ హష్మీతో ముద్దు సీన్లలోనటించడానికి పెద్దగా ఇబ్బందేమీ పడలేదని, హాయిగా ముద్దులిచ్చేశానని చెబుతోంది. ముద్దుల విషయంలో ఓకే.. ఎన్ని ముద్దులు కావాలన్నా ఇచ్చేస్తాను. కానీ బికినీ వేయమంటే మాత్రం నా వల్ల కాదని హుమైమా క్లియర్‌గా చెప్పేస్తోంది. దేవుడా.. బికినీ విషయంలో కొంతకాలానికైనా హుమైమా మనసు మారేట్టు చూడు అని బాలీవుడ్ కోరుకుంటున్నట్టు సమాచారం.

అల్లుడు శీను: బెల్లంకొండ శ్రీనివాస్‌కి మార్కులు!!

  ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ సమంత కథానాయికగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ‘అల్లుడు శీను’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని అభినందిస్తున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ చాలా ఈజ్‌గా నటించాడని అంటున్నారు. నటుడుగా బెల్లంకొండ శ్రీనివాస్ మంచి మార్కులు పొందాడని అంటున్నారు. కథాంశం బాగుందని, వినాయక్ స్టయిల్లో అదిరిపోయేలా సినిమా వుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా భారీ నిర్మాణ విలువలతో రూపొందిందని, పాటల కోసం వేసిన సెట్స్ అద్భుతమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సమంత సినిమాకి ప్లస్ అయిందని, తమన్నా పాట సూపర్‌గా వుందని అంటున్నారు.

బుల్లి తెరపై మెగా ఎంట్రీ..!!

  కాంగ్రెస్ పార్టీ ఓటమితో రాజకీయాల్లో విరామం దొరికాక మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం ప్రస్తుతం కథలు వింటున్నాడని ఇండస్ట్రీ టాక్. ఆయన సినిమా కోసం మెగా అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మెగా హీరో తొందరలోనే బుల్లి తెరపై మెగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్వహిస్తూ తొలిసారిగా తన సినీ జీవిత విశేషాలు చెబుతున్న ‘సౌందర్యలహరి’ ప్రొగ్రాంలో అతిథిగా వచ్చి మెగా అభిమానులను పలకరించనున్నాడట. ఇది ఆగస్ట్ 3న ప్రసారంకానుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ షో ద్వార మెగాస్టార్ బుల్లితెర‌పై కనిపించి ప్రేక్షకుల్లో జోష్ పెంచబోతున్నారని లేటెస్ట్ టాక్.

బ్రహ్మానందానికి దయ్యాలు కనిపిస్తాయా?

  బ్రహ్మానందానికి దయ్యాలు కనిపిస్తాయా? అవును కనిపిస్తాయని అంటున్నారు పాపులర్ తెలుగు సినిమా రచయిత కోన వెంకట్. బ్రహ్మానందానికి దయ్యాలు కనిపించడం అనేది రియల్ లైఫ్ మేటర్ కాదు.. రీల్ లైఫ్ మేటర్. అంజలి హీరోయిన్‌గా త్వరలో విడుదలకు సిద్ధమైన ‘గీతాంజలి’ సినిమాలో బ్రహ్మానందం సూపర్ కామెడీ కేరెక్టర్ ధరించినట్టు కోన వెంకట్ చెప్పారు. ఈ సినిమాలో బ్రహ్మానందం కేరెక్టర్ దయ్యాలు అనే పాయింట్‌నే నమ్మదు. అలాంటి కేరెక్టర్‌కి దయ్యాలు కనిపిస్తే పరిస్థితి ఎలా వుంటుందనే అంశం చుట్టూ అల్లిన కామెడీ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తుందని కోన వెంకట్ చెబుతున్నారు.

ఆగష్టు 1న 'రభస' ఆడియో..ఇది ఫిక్స్

సినీ పరిశ్రమలోనున్న ప్రముఖులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు ‘రభస’ సినిమా పాటల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. మొదట ఈ చిత్రం ఆడియోను జులై మొదటి వారంలో విడుదల చేయాలనుకున్నారు. కాని అనుకోని పరిస్థితుల వల్ల ఆడియోను 25కు వాయిదా వేశారు. అలాగే జులై 27కి పోస్ట్ పోన్ అయిందని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో ఈ సినిమా ఆడియో రిలీజ్ పై అభిమానుల్లో అస్పష్టత నెలకొంది. అయితే, తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో ఆగష్టు 1న రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే శిల్పకళావేదికను ఆడియో వెన్యూగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమంత, ప్రణీత హీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ఒక పాట పాడటం విశేషం. ఆగస్టు 14న రాబోతున్న ఈ చిత్రంపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

'రుద్రమదేవి' బంగారం కొట్టేశారు

రాణీ రుద్రమదేవి సినిమా కోసం అనుష్క ధరించవలసిన నగలు మాయమయ్యాయి.గుణశేఖర్‌ తానే దర్శకుడిగా, తానే నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న ‘రుద్రమదేవి’ సినిమా కోసం నిజమైన బంగారు ఆభరణాల్ని అనుష్కకి అలంకరిస్తున్నారు. ఈ విషయాన్ని గతంలోనే గుణశేఖర్‌ వెల్లడిరచాడు కూడా. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా భోజన విరామ సమయంలో బంగారు ఆభరణాల్ని ఎవరో కొట్టేశారన్న వార్త అందరిని షాక్ కి గురి చేసింది. గుణశేఖర్‌ వెంటనే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో నగలు పోయిన విషయమై ఫిర్యాదు చేశారు.పోలీసులు దీనిమీద దర్యాప్తు జరుపుతున్నారు.

అల్లు అర్జున్ అభిమానులపై లాఠీ ఛార్జ్

ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ అభిమానుల మీద పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తిరుపతిలొ ఓ నగల షాప్ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ వెళ్లారు. ఈ విషయం ముందే తెలుసుకున్న అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సంధర్భంగా అల్లు అర్జున్ తో కరచాలనానికి పోటెత్తడంతో ఆయన జనం మధ్యలో ఇరుక్కుపోయారు. ఓ దశలో ఆయన ఊపిరి ఆడని పరిస్థితి ఎదుర్కొన్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి సురక్షితంగా పక్కకు తీసుకెళ్లారు. ఈ సంధర్భంగా జరిగిన తోపులాటలో ఓ కానిస్టేబుల్ కు గాయాలు అయ్యాయి. మన దేశంలో సినీ నటులపట్ల ఉన్న క్రేజ్ తగ్గడం లేదు. కొన్ని సార్లు అది హద్దులు దాటితే ఆ అభిమాన నటులకు కష్టాలు తప్పడం లేదు.

దియా మిర్జా పెళ్ళి మళ్ళీ వాయిదా!

  బాలీవుడ్ నటి, హైదరాబాద్‌ అందగత్తె దియా మిర్జా శుభమా అని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటూ వుంటూ ఆ పెళ్ళి వినాయకుడి పెళ్ళిలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వుంది. కొన్ని సినిమాల్లో నటించి, రీసెంట్‌గా ‘లవ్ బ్రేక్ అప్’, ‘జిందగీ’ సినిమాలను నిర్మించింది. లేటెస్ట్‌గా విద్యాబాలన్‌ హీరోయిన్‌గా ‘బాబీ జాసూస్’ సినిమాని నిర్మించింది. ఇదిలా వుంటే దియా మిర్జా గత కొన్నే్ళ్ళుగా సాహిల్ అనే కత్తిలాంటి కుర్రోడితో డేటింగ్ చేస్తోంది. ఎంతకాలం ఈ డేటింగ్.. ఎంచక్కా పెళ్ళి చేసుకుని సెటిలైపోవాలని గత సంవత్సరకాలంగా దియా మిర్జా ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటికి రెండు మూడుసార్లు వీళ్ళిద్దరి పెళ్ళి వాయిదా పడింది. తాజాగా దియా మిర్జా పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభించేసరికి ఈసారి ఆమె నిర్మించిన ‘బాబీ జాసూస్’ సినిమా అడ్డం వచ్చిపడింది. చివరికి ఈసారి కూడా ఈ సినిమా విడుదలయ్యాక పెళ్ళి పీటల మీదకి ఎక్కాడని దియా డిసైడ్ చేసుకుంది.