పుచ్చకాయని కోయడమే నేరమైపోయింది.. ఏవిటో..

  అమెరికాలో చాలా వెరైటీ సంఘటనలు జరుగుతూ వుంటాయి. అలాంటి వాటిని చూస్తే మనలాంటోళ్ళకి బుర్ర తిరిగిపోతూ వుంటుంది. అలాంటి సంఘటనలకు ఒక శాంపిల్ ఇప్పుడు చూద్దాం. అమెరికాలోని థామస్టన్‌కి చెందిన సెర్విల్లీనో అనే వ్యక్తికి పెళ్ళాంతో ఎప్పుడూ పడదు. దాంతో వీళ్ళిద్దరూ విడిపోదామని నిర్ణయించుకున్నారు. వారం పదిరోజుల్లో ఈ జంట విడాకుల ముచ్చట కూడా తీరిపోయేది. అయితే ఇంతలోనే అతనో పెద్ద నేరం చేశారు. ఆ నేరానికి పోలీసులు అరెస్టు చేశారు. చివరికి కోర్టులో బెయిల్ తీసుకుని బయటపడాల్సి వచ్చింది. ఇంతకీ సెర్విల్లీనో చేసిన నేరం ఏమిటంటే, తన భార్యమీద వచ్చిన కోపాన్ని భార్యమీద చూపించే సీన్ లేక ఆ కోపాన్ని అక్కడే వున్న ఓ పుచ్చకాయ మీద చూపించడం. భార్యమీద కోపమొచ్చిన అతగాడు అక్కడే వున్న ఓ పుచ్చకాయని కత్తితో కసితీరా కోశాడట. దాంతో ఆయన భార్యగారు భయపడిపోయి పోలీసులను ఆశ్రయించింది. తనను కూడా ఇలా కసిగా కోసి చంపేస్తాడేమోనని భయపడిపోయింది. దాంతో పోలీసులు సెర్విల్లీనోని అరెస్టు చేశారు. భార్యముందు పుచ్చకాయని కసిగా కోయడం కూడా గృహ హింస చట్టం పరిధిలోకి వస్తుందని చెప్పారు.

తెలుగువన్ షార్ట్ ఫిల్మ్ విజేత 'సదాశివ' కు పదివేలు బహుమతి

ఇప్పుడు ఎక్కడ చూసిన షార్ట్ ఫిల్మ్ హావా నడుస్తుంది. చాలా మంది యంగ్ టాలెంట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు మెయిన్ స్ట్రీమ్ సినిమా దర్శకులుగా ఎదుగుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన తెలుగువన్‌ అనేకమంది యువతీయువకులకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పేరుతో ఓ అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా షార్ట్ ఫిలిం దర్శకులను ప్రోత్సహించడంలో భాగంగా తెలుగువన్ నెలనెలా ఉత్తమ షార్ట్ ఫిలిం దర్శకుడికి ప్రతి నెల పదివేల రూపాయల నగదు బహుమతి అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తెలుగువన్ అందించిన షార్ట్ ఫిలిం అవకాశం మెట్టు ఎక్కిన చాలామంది తమ ప్రతిభతో మరిన్ని మెట్లు ఎక్కి సినిమా రంగానికి చేరువయ్యారు కూడా. 16 మే నుంచి 15 జూన్ వరకు తెలుగువన్ ప్రోత్సాహంతో రూపొందించిన షార్ట్ ఫిలిమ్స్ లో 'సదాశివ' దర్శకత్వంలో రూపొందిన ‘Unknown’ షార్ట్ ఫిల్మ్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్౦గా ఎంపికయింది. ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించిన ఉత్తమ దర్శకుడు సదాశివ కి తెలుగువన్ చీఫ్ ఎడిటర్ మల్లిక్ గారు పదివేల రూపాయల చెక్‌ని ఇచ్చి ప్రోత్సహించారు. షార్ట్ ఫిల్మ్ రూపకర్తలకు తెలుగువన్ అందిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకుని మరిన్ని ఉత్తమ షార్ట్ ఫిలింలను రూపొందించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు.

మీడియాకి రామ్ గోపాల్ వర్మ సారీ!

  మొన్నీమధ్య రామ్ గోపాల్ వర్మ ఫేస్ బుక్‌లో ఒక పోస్టు పెట్టాడు. అది తన ‘ఐస్ క్రీమ్’ సినిమాకి వ్యతిరేకంగా రివ్యూ రాసిన వారిని కుక్కలతో పోలుస్తూ రాశారు. అయితే ఆ పోస్టు గురించి రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో వివరణ ఇచ్చారు. దాంట్లో తాను కుక్కతో పోల్చింది రివ్యూలు చేసే అందరి గురించి కాదనీ, ఒకానొక వెబ్ సైట్‌లో రివ్యూ రాసిన ఒకానొక వ్యక్తి గురించి అని వివరించాడు. వేరే ఎవరైనా ఈ విషయంలో హర్ట్ అయి వుంటే వారికి సారీ చెప్పాడు. ఆ మాట ఆయన మాటల్లోనే.. ‘‘నేను రివ్యూవర్ల గురించి రాసిన ప్రెస్ నోట్‌లో నేను ఉద్దేశించింది కేవలం ఆ పేరు, మొహం కూడా దాచుకొని తిరిగే ఆ పిరికి (వెబ్ సైట్ పేరు) మనుషుల్లా౦టోళ్ళ గురించి... అంతే కానీ కామన్ గా రివ్యూవర్లందరిని, ఇంకా వేరే మీడియావాళ్ళని కలిపి ఉద్దేశించింది కాదు.. ఒకవేళ ఆ మూడ్‌లో, తొందరలో నేను రాసిన దాంట్లో అలా వచ్చుంటే దానికి నా క్షమాపణలు. బొంబాయిలోనూ, హైదరాబాద్‌లోనూ నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఎక్కువగా మీడియా వాళ్లు, రివ్యూవర్స్ ఉన్నారు. అలాంటప్పుడు నేను ఉద్దేశ్యపూర్వకంగా అలాఅనటం అనేది జరగదు’’ అని రామ్ గోపాల్ వర్మ వివరణ ఇచ్చాడు. పర్లేదు.. వర్మకి ఈ కర్టసీ కూడా వుంది.

యాహూ సంస్థలో వెరైటీ లైంగిక వేధింపులు!

  సాధారణంగా లైంగిక వేధింపులు అనేవి మగవాళ్ళు ఆడవాళ్ళని చేస్తూ వుంటారు. అలాగే మగ బాస్‌లు ఆడ ఉద్యోగులను లైంగికంగా వేధిస్తూ వుంటారు. కాలిఫోర్నియాలో యాహూ సంస్థలో మాత్రం ఒక లేడీ బాస్ తన దగ్గర పనిచేసే లేడీ ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేస్తోంది. కాలిఫోర్నియాలోని యాహూ మొబైల్ విభాగంలో సీనియర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మారియా ఝాంగ్ తనను లైంగికంగా వేధించిందని నాన్ షీ అనే ప్రిన్సిపల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై పై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని, అందువల్ల తనకు కోర్టే దిక్కయిందని ఆమె వెల్లడించింది.

సాహసయాత్ర చంపేసింది: హేరీపోటర్ విలన్‌ మృతి

  హేరీపోటర్ సిరీస్ సినిమాలన్నింటిలో విలన్గా నటించిన డేవ్ లెగెనో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఓ సాహస యాత్రకు వెళ్ళిన ఆయన అనూహ్య పరిస్థితుల్లో మరణించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో సాహసయాత్ర చేయడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే. ఆ వ్యాలీలోకి సాహస యాత్ర చేయడానికి డేవ్ లెగెనో ఒంటరిగా వెళ్ళాడు. ఫ్రెండ్స్ వారించినా ఆయన కొద్ది రోజుల క్రితం ఆ యాత్రకు వెళ్ళాడు. అయితే మరో ఇద్దరు సాహసయాత్రికులు ఇటీవల డెత్ వ్యాలీ మీదుగా వెళ్తున్నప్పుడు వారికి దారిలో ఒక మారుమూల ప్రాంతంలో లెగెనో మృతదేహం కనిపించింది. ఆయన మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించడానికి హెలికాప్టర్ రావలసి వచ్చింది. హేరీపోటర్ సినిమాల్లో ఎన్నో సాహసాలు చేసిన ఆయన రియల్ లైఫ్‌లో సాహస యాత్ర చేస్తూ మరణించడం బాధాకరం అని ఆయన అభిమానులు అంటున్నారు. యాభై ఏళ్ళ వయసున్న డేవ్ లెగెనో చనిపోవడానికి గుండెపోటు కారణం అని తెలుస్తోంది.

ఈరోజు ఆకాశంలో మెగా చందమామ!

  ఈరోజు గురు పౌర్ణమి. చాలా పవిత్రమైన రోజు. ఆధ్యాత్మికతకు సంబంధించిన మేటర్ని అలా వుంచితే, ఖగోళపరంగా కూడా ఈ పౌర్ణమికి ప్రత్యేకత వుంది. ఈ రాత్రికి ఆకాశంలోకి చూస్తే చాలా పెద్ద చందమామ కనిపిస్తుంది. ప్రతి పౌర్ణమి రోజు కనిపించే నిండు చందమామ కంటే చాలా పెద్ద చందమామ ఆకాశంలో కనిపిస్తుంది. ఇలా పెద్ద చందమామ కనిపించడం ఈ వేసవి కాలంలో ఇది మూడోసారి అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇలా కనిపించడానికి కారణం చందమామ భూమికి మరింత దగ్గరగా రావడం కారణం కాదని, చందమామని భూమి మీద వున్న వారు చూసే కోణంలో ఏర్పడే మార్పు వల్ల చందమామ పెద్దగా కనిపిస్తున్నట్టు భూమి మీద వున్న వారికి అనిపిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఇది ఒక భ్రాంతి లాంటిదని అంటున్నారు. భ్రాంతో, మరొకటో.. ఈరోజు ఆకాశంలో చందమామ పెద్దదిగా కనిపిస్తుంది.. చూసి ఎంజాయ్ చేద్దాం అంతే!

మనకి అలాంటి కలలే ఎక్కువట: పరిశోధన

  మనకి కలలు వస్తూ వుంటాయి. రకరకాల కలలు వస్తూ వుంటాయి. మనకి ఎక్కువ శాతం వచ్చే కలలేమిటో చెబితే మీరు సిగ్గుతో చితికిపోతారు. ఎందుకంటే, మనకు ఎక్కువశాతం ‘అలాంటి’ కలలే వస్తాయట. ఈ విషయాన్ని మానసిక శాస్త్రవేత్తలు పరిశోధించి కనుక్కున్నారు. ఈ పరిశోధన కూడా ఓ పదిమందో, ఇరవై మంది మీదో చేయలేదు. ఏకంగా 570 మంది అమ్మాయిలు, అబ్బాయిల మీద పరిశోధనలు చేసి ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘అలాంటి’ కలలతోపాటు గాలిలో తేలినట్టుందే అన్నట్టుగా, గాలిలో తేలిపోతున్నట్టుగా కలలు కూడా ఎక్కువగా వస్తూ వుంటాయట. కాబట్టి మీకు ‘అలాంటి’ కలలు ఎక్కువగా వస్తుంటే అదేదో తప్పని బాధపడిపోవద్దు.. అబ్దుల్ ‘కల’మ్ గారు ఏం చెప్పారు? కలలు కనండి.. వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి. స్వీట్ డ్రీమ్స్!

రెండో పెళ్ళిని ఆపిన ఈ మెయిల్!

  ఈ మెయిల్ ఒక మంచి పని చేసింది. ఒక ప్రబుద్ధుడు రెండో పెళ్ళి చేసుకోబోతుంటే ఆపింది. అదెలా జరిగిందంటే, శ్రీలంకకి చెందిన శాంతి వాసన్, సీతకి కెనడాలో పరిచయమైంది. వాళ్ళిద్దరూ ఆ తర్వాత ప్రేమలో పడి, అనంతరం పెళ్ళి కూడా చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా కలిగారు. ఆ తర్వాత శాంతివాసన్‌కి సీత అంటే మొహమ్మొత్తింది. ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దాంతో శాంతివాసన్ తన మాజీ ప్రియురాలిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి సీతని కెనడాలోనే వదిలేసి కొచ్చిన్ వచ్చాడు. తన లవర్ని రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. దాంతో సీత శాంతి వాసన్ తనకు చేసిన మోసాన్ని తిరుచ్చి నగర పోలీస్ కమిషనర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే స్పందించిన కమిషనర్ స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. సీతతో సహజీవనం చేశానని, ముగ్గురు పిల్లలు కూడా తమకు ఉన్నారని శాంతి వాసన్ చెప్పడంతో పోలీసులు శాంతి వాసన్ తన లవర్‌తో చేసుకుని రిజిస్టర్ మ్యారేజీని రద్దు చేశారు.

మోడల్‌కి తప్పతాగించి దోచుకున్నాడు???

  ముంబైకి చెందిన సుబ్రతా దత్తా అనే యువ మోడల్ మోడలింగ్ ద్వారా ముంబైలో బాగానే డబ్బు సంపాదించింది. ఆమెకి సినిమా హీరోయిన్ అవ్వాలనేది కోరిక. మొదట తెలుగు సినిమా రంగం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవ్వాలని ఆశపడింది. ఆ ఆశను క్యాష్ చేసుకోవాలని ఒక మోసగాడు ఆలోచించాడు. నెట్ ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు. ఆ మోసగాడి పేరు రాజు. సికింద్రాబాద్‌ వాస్తవ్యుడు. తెలుగు సినిమాల్లో ప్రముఖ హీరోల సరసన హీరోయిన్ వేషాలు ఇప్పిస్తానని సుబ్రతా దత్తాని రాజు నమ్మించాడు. రాజు మాటలు నమ్మిన సుబ్రతా దత్తా హైదరాబాద్‌కి వచ్చింది. రాజు ఆమెని సికింద్రాబాద్ ప్రాంతంలో వున్న తన ఇంటికి తీసుకెళ్ళాడు. రెండు రోజుల పాటు ఆమె చేత బాగా తాగించాడు. గురువారంనాడు బ్యూటీ పార్లర్‌కు తీసుకువెళ్ళాడు. తిరిగి వస్తుండగా కారులోనే ఆమెకి మత్తు కలిపిన మద్యం ఇచ్చాడు. అది తాగి ఆమె స్పృహ తప్పింది. ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను చక్కగా ఒలుచుకుని రాజు ఆమెను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వదిలేసి పోయాడు. కొద్ది గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన ఆమె జరిగిన మోసాన్ని తెలుసుకుని అతనిపై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజు కోసం వెతుకుతున్నారు.

‘దృశ్యం’ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ!

  వెంకటేష్, మీనా, నదియా, నరేశ్, రవి కాలే, కృతిక, బేబి ఎస్తేర్ నటించిన ‘దృశ్యం’ సినిమా శుక్రవారం విడుదలైంది. డి.సురేష్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి నిర్మించిన ఈ సినిమాకి నటి శ్రీప్రియ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. ‘దృశ్యం’ సినిమా సస్పెన్స్, థ్రిలర్, ఫ్యామిలీ డ్రామాల మేళవింపుగా రూపొందిన సినిమా. పోలీస్ ఆఫీసర్లయిన నదియా, నరేష్‌ల కుమారుడు వరుణ్ కనిపించకుండా పోతాడు. దాంతో పోలీసులకి ఒక చిన్న పల్లెటూరిలో కేబుల్ ఆపరేటర్‌గా వున్న రాంబాబు (వెంకటేష్) అనే కుటుంబం మీద అనుమానం కలుగుతుంది. భార్యా, భర్త, ఇద్దరు ఆడపిల్లలతో సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబంలోకి పోలీసులు ప్రవేశిస్తారు. ఆ కుటుంబానికి వరుణ్ కనిపించకుండా పోవడానికి సంబంధమేంటి? ఆ కుటుంబాన్నే ఎందుకు అనుమానించారు? పోలీసుల విచారణ నుంచి రాంబాబు కుటుంబం తప్పించుకుందా? ఈ కుటుంబమే వరుణ్‌ని కిడ్నాప్ చేసిందా? అసలేం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘దృశ్యం’ సినిమా చూడాల్సిందే! కేబుల్ ఆపరేటర్ రాంబాబుగా వెంకటేష్ విభిన్నమైన పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన కొన్ని సన్నివేశాలలో చక్కటి ఎమోషన్స్ పలికించారు. చాలాకాలం తర్వాత మీనాకి మరో మంచి పాత్ర దొరికింది. వెంకటేష్ కుమార్తెలుగా నటించిన కృతిక, బేబీ ఎస్తేర్ ప్రశంసనీయమైన నటన ప్రదర్శించారు. నదియా, నరేష్ జంట కూడా బాగుంది. వెంకటేష్ కుటుంబాన్ని వేధించే కానిస్టేబుల్‌గా నటించిన రవి కాలే ఆకట్టుకున్నారు. ప్రేక్షకులకు చక్కని అనుభూతి కలిగేవిధంగా శ్రీప్రియ ‘దృశ్యం’ చిత్రాన్ని మలిచారు. దర్శకురాలిగా మంచి మార్కులు పొందారు.

విజయకాంత్‌కి సీరియస్‌!

  ప్రముఖ తమిళ కథానాయకుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్‌ ఆరోగ్యం సీరియస్‌గా వున్నట్టు తెలుస్తోంది. ఆయన తీవ్రమైన ఛాతీనొప్పితో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. బుధవారం పార్టీకి సంబంధించిన పనుల్లో బిజీగా వున్న ఆయనకు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన్ని ఇంటెన్సి్వ్ కేర్‌లో వుంచి ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. భారీ పర్సనాలిటీ అయిన విజయకాంత్ గడచిన ఎన్నికల కోసం ఎంతో శ్రమించారని, ఎంతమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఎన్నికలలో పనిచేశారని, దానివల్ల ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిందని ఆయన సహచరులు చెబుతున్నారు. విజయకాంత్ అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే తమ ‘కెప్టెన్’ను పరామర్శించేందుకు ఎవరూ ఆస్పత్రి వద్దకు రావాల్సిన అవసరం లేదని, విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని విజయకాంత్ సన్నిహితులు చెబుతున్నారు.

రివ్యూ: ‘దృశ్యం’ సినిమాకి అంత దృశ్యం వుందా?

  తారాగణం: వెంకటేష్, మీనా, నదియా, నరేశ్, రవి కాలే, కృతిక, బేబి ఎస్తేర్, పరుచూరి వెంకటేశ్వరరావు. నిర్మాతలు: డి.సురేష్‌బాబు, రాజ్ కుమార్ సేతుపతి, సంగీతం: శరత్, సినిమాటోగ్రఫి: ఎస్.గోపాల్ రెడ్డి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, దర్శకత్వం: శ్రీ ప్రియ. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీప్రియ దర్శకురాలిగా మారి రూపొందించిన ‘దృశ్యం’ సినిమా. ఈ సినిమాలో నటించడానికి వెంకటేష్ లాంటి టాప్‌స్టార్ అంగీకరించినప్పుడే ‘దృశ్యం’ మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాకి అంత ‘ద‌ృశ్యం’ (సీన్) ఉందా, లేదా అనే విషయాన్ని చూద్దాం. ఈ సినిమా మలయాళ మాతృక ఘన విజయం సాధించింది. తెలుగులో రేపు (శుక్రవారం) విడుదల అవుతున్న ఈ సినిమాని గత రెండు రోజులుగా మీడియాకి ప్రదర్శించారు. సినిమా విడుదలయ్యే వరకూ మీడియాకి ప్రదర్శించే సాహసం ఈమధ్యకాలంలో ఎవరూ చేయలేదు. ఈ సినిమా మీద సంపూర్ణ నమ్మకంతో నిర్మాతలు ముందుగానే మీడియాకు ప్రదర్శించారు. ః ‘దృశ్యం’ సినిమా సస్పెన్స్, థ్రిలర్, ఫ్యామిలీ డ్రామాల మేళవింపుగా రూపొందిన సినిమా. కథ విషయానికి వస్తే, పోలీస్ ఆఫీసర్లయిన నదియా, నరేష్‌ల కుమారుడు వరుణ్. ఒకసారి వరుణ్ కనిపించకుండా పోతాడు. దాంతో పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభిస్తారు. ఈ దర్యాప్తులో పోలీసులకు ఒక చిన్న పల్లెటూరిలో కేబుల్ ఆపరేటర్‌గా వున్న రాంబాబు (వెంకటేష్) అనే కుటుంబం మీద అనుమానం కలుగుతుంది. భార్యా, భర్త, ఇద్దరు ఆడపిల్లలతో సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబంలోకి పోలీసులు ప్రవేశిస్తారు. ఆ కుటుంబానికి వరుణ్ కనిపించకుండా పోవడానికి సంబంధమేంటి? ఆ కుటుంబాన్నే ఎందుకు అనుమానించారు? పోలీసుల విచారణ నుంచి రాంబాబు కుటుంబం తప్పించుకుందా? ఈ కుటుంబమే వరుణ్‌ని కిడ్నాప్ చేసిందా? అసలేం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘దృశ్యం’ సినిమా చూడాల్సిందే! కేబుల్ ఆపరేటర్ రాంబాబుగా వెంకటేష్ తన వయసుకు తగిన విభిన్నమైన పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన కొన్ని సన్నివేశాలలో చక్కటి ఎమోషన్స్ పలికించారు. చాలాకాలం తర్వాత మీనాకి మరో మంచి పాత్ర దొరికింది. వెంకటేష్ కుమార్తెలుగా నటించిన కృతిక, బేబీ ఎస్తేర్ ప్రశంసనీయమైన నటన ప్రదర్శించారు. నదియా, నరేష్ జంట కూడా బాగుంది. కానిస్టేబుల్ గా నటించిన రవి కాలే ఆకట్టుకున్నారు. రాంబాబును, ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురిచేసే పాత్రలో రవి కాలే గొప్పగా నటించాడు. ప్రేక్షకులకు చక్కని అనుభూతి కలిగేవిధంగా శ్రీప్రియ ‘దృశ్యం’ చిత్రాన్ని మలిచారు. దర్శకురాలిగా మంచి మార్కులు పొందారు. సినిమా ఎక్కడా గ్రిప్ సడలకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తమ్మీద ‘‌దృశ్యం’ సినిమాకి అంత ‘దృశ్యం’ (సీన్) వుందని చెప్పొచ్చు.

తెలుగులో హాట్ మలయాళ శృంగార చిత్రం

  మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై మంచి కలెక్షన్లు సాధించి సినీవిమర్శకుల అంచనాలను సైతం తలకిందుల చేసిన చిత్రం ‘పితావుమ్ కన్యకయుమ్'. ఇప్పుడు ఈ సినిమాను ‘సీక్రెట్స్ ఆఫ్ టీనేజ్' పేరుతో తెలుగులో కూడా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వన్ విజన్ మీడియా సమర్పణలో అభిఎంటర్ ప్రైజెస్ పతాకంపై కె. అభిషేక్ రెడ్డి ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ బాషల్లో అనువదించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను అన్ని పూర్తి చేసి ఆగస్ట్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు. కృపా, ఎం.జి.శశి, శశి కళింగ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి, సంగీతం సందీప్ జయరాజ్ అందించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే టెన్త్ క్లాస్ చదివే అమ్మాయితో ఓ రాత్రి గడపాలనుకొనే మధ్య వయస్కుడి కోరిక తీరిందా లేదా అనేది ఈ సినిమా స్టొరీ, ఇందులో ఎక్కడా వల్గారిటీ సన్నివేశాలు వుండవని, మంచి మెసేజ్ వుంటుందని ఈ సినిమా నిర్మాత తెలిపారు. అలాగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఎంపికైన శృంగార చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుందనే నమ్మకం మాకుందని అన్నారు.

మెగా సినిమా దర్శకుడి కోసం చరణ్ వెతుకులాట

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ ఓటమితో కొంత నిరాశ చెందిన, త్వరలో తన 150వ సినిమాతో అభిమానులను అలరించడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే చిరంజీవి ఈ సినిమా కోసం మూడు కథలను ఓకే చేసి పెట్టాడట. తన పుట్టినరోజున ఈ సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నారట. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన తండ్రి 150వ సినిమాలో నటించాలని ఫిక్స్ అయ్యాడట. ఒకవేళ కథలో తన పాత్రకు ఛాన్స్ లేకపోయినా సినిమాలో ఏదో ఒక చోట తనను చేర్చేలా చూడాలని డైరెక్టర్‌ని కోరుతానని రామ్‌చరణ్ చెబుతున్నాడు. ఈ చిత్రాన్ని చిరంజీవి భార్య సురేఖ తమ సొంత బ్యానర్ పైన ప్రొడ్యూస్ చేస్తారట. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తమ సొంత బ్యానర్ పైన చేసే మంచి దర్శకుడి కోసం చిరు, చరణ్ అన్వేషిస్తున్నారట.

భూమి కబ్జా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మపైన చెన్నై పోలీసులు చార్జీషీట్ నమోదు చేశారు. అతనికి చెన్నై నీలాంగరై సమీపంలో కానత్తూర్లో సొంత స్థలం కొంత ఉంది. దాని పక్కనే సేలంకుప్పన్ నీలాంగరై అనే వ్యక్తికి 75సెంట్ల స్థలం వుంది. తన 75 సెంట్ల భూమిని మణిశర్మ కంచె వేసినట్లు ఆయన పోలీసులకు పిర్యాదు చేశారు. క్రైం బ్రాంచ్ పోలీసులు మణిశర్మ స్థలం వద్దకు వెళ్లి పరిశీలించగా ఆయన ఆక్రమణకు పాల్పడ్డారనడానికి ఆధారాలు దొరికాయని అంటున్నారు. దీంతో పోలీసులు మణిశర్మపై కేసును నమోదు చేసి అతనికి అరెస్టు వారెంట్ జారీ చేశారు. మణిశర్మ మాత్రం కోర్టులో ముందస్తు బెయిల్ పొందారు.

మరో చెల్లినీ రంగంలోకి దించిందండోయ్!

ఆల్రడీ బాలీవుడ్‌లో ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా విరగదీస్తోంది. తాను విరగదీస్తోంది చాలదన్నట్టు తన చెల్లి పరిణితి చోప్రాని కూడా ప్రియాంక బాలీవుడ్ రంగంలోకి దించింది. ప్రియాంకే అనుకుంటే పరిణితి చోప్రా ప్రియాంక కంటే నలుగాకులు ఎక్కువే చదివినట్టుగా బాలీవుడ్‌లో విజృంభిస్తోంది. అన్ని విషయాల్లోనూ పరిణితి చోప్రా పరిణతి చూస్తుంటే ఏదో ఓ రోజుకి అక్క ప్రియాంకని దాటిపోయేట్టు వుంది. ఇప్పుడు ప్రియాంకా చోప్రా మరో చెల్లెలు బార్బీ హాండాని రంగంలోకి దించుతోంది. పేరుకు తగ్గట్టుగానే బార్బీ బొమ్మలా వుండే బార్బీ హండా త్వరలో వెండితెరమీద కనిపించబోతోంది. బార్బీ హాండా బాలీవుడ్ అరంగేట్రం కోసం తయారు చేసుకున్న ఫొటో ఆల్బం కళ్ళు తిరిగించేలా వుందని తెలుస్తోంది.

2013 ఫిలిం ఫేర్ నామినేషన్లు

  2013 సంవత్సరానికి తెలుగు సినిమా రంగం నుంచి వివిధ విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్న చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలివి.   ఉత్తమచిత్రం: అత్తారింటికి దారేది, గుండెజారి గల్లంతయ్యిందే, మిర్చి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ఉయ్యాలా జంపాలా. ఉత్తమ దర్శకుడు: కొరటాల శివ (మిర్చి), శ్రీకాంత్ అడ్డాల (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), త్రివిక్రమ్ శ్రీనివాస్ (అత్తారింటికి దారేది), విజయ్ కుమార్ కొండా (గుండె జారి గల్లంతయ్యిందే), విరించి వర్మ (ఉయ్యాలా జంపాలా). ఉత్తమ నటుడు: మహేష్ బాబు (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), నితిన్ (గుండె జారి గల్లంతయ్యిందే), పవన్ కళ్యాణ్ (అత్తారింటికి దారేది), ప్రభాస్ (మిర్చి), రామ్ చరణ్ (నాయక్). ఉత్తమ నటి: అనుష్క (మిర్చి), నందిత (ప్రేమకథాచిత్రమ్), నిత్యా మీనన్ (గుండె జారి గల్లంతయ్యిందే), రకుల్ ప్రీత్ సింగ్ (వెంకటాద్రి ఎక్స్ప్రెస్), సమంత (అత్తారింటికి దారేది). ఉత్తమ సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్ (గుండెజారి గల్లంతయ్యిందే), దేవిశ్రీ ప్రసాద్ (మిర్చి), దేవిశ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేది), ఎంఆర్ సన్నీ (స్వామి రారా), మిక్కీ జె మేయర్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు). ఉత్తమ సహాయనటుడు: బ్రహ్మాజీ (వెంకటాద్రి ఎక్స్ప్రెస్), ప్రకాష్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె  చెట్టు), సందీప్ కిషన్ (గుండెల్లో గోదారి), సునీల్ (తడాఖా), వెంకటేష్ (మసాలా). ఉత్తమ సహాయనటి: అంజలి (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), లక్ష్మి మంచు (గుండెల్లో గోదారి), నదియా (అత్తారింటికి దారేది), ప్రణీత (అత్తారింటికి దారేది), పునర్నవి (ఉయ్యాలా జంపాలా). ఉత్తమ గీత రచయిత: అనంత శ్రీరామ్ (రామయ్యా వస్తావయ్యా), చంద్రబోస్ (గుండెల్లో గోదారి), రామజోగయ్య శాస్త్రి (మిర్చి), శ్రీమణి (అత్తారింటికి దారేది), విశ్వ (బాద్షా). ఉత్తమ గాయకుడు: దలేర్ మెహందీ (బంతిపూల జానకి.. బాద్షా), కైలాష్ ఖేర్ (పండగలా దిగివచ్చావు.. మిర్చి), రంజిత్ (జాబిల్లి నువ్వే చెప్పమ్మా.. రామయ్యా వస్తాయ్యా), శంకర్ మహదేవన్ (బాపుగారి బొమ్మో.. అత్తారింటికి దారేది), సుచిత్ సురేశన్ (మీనాక్షి మీనాక్షి .. మసాలా). ఉత్తమ గాయని: చిన్న పొన్ను (మిర్చి లాంటి కుర్రోడే.. మిర్చి), చిత్ర (సీతమ్మ వాకిట్లో.. సీతమ్మ వాకిట్లో), గీతామాధురి (వెచ్చని వయసు.. గుండెల్లో గోదారి), ఇందు నాగరాజ్ (ప్యార్ మే పడిపోయానే.. పోటుగాడు), శ్రేయా ఘోషల్ (హే నాయక్.. నాయక్).  

నటిని గోకాడు.. నటుణ్ణి లోపలేశారు!

  అతడో నటుడు. సినిమాల్లో, సీరియళ్ళలో చిన్న చిన్న కేరెక్టర్లు చేస్తూ వుంటాడు. ఆమె ఓ నటి. ఆమె కూడా సినిమాల్లో చిన్నా చితక పాత్రల్లో నటిస్తూ వుంటుంది. వీరిద్దరికీ ఎంతోకాలం నుంచి పరిచయం వుంది. ఆమెతో తనకున్న పరిచయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని సదరు నటుడు అనుకున్నాడు. ఆమె మీద వున్న తన కోరికని ఆమె దగ్గర వ్యక్తం చేశాడు. ఆమె అతని కోరికను తిరస్కరించింది. అయితే ఆ నటుడు ఆ విషయాన్ని అక్కడితో వదిలేయకుండా ఆమెని వేధించడం ప్రారంభించాడు. అయితే అతను ఎంత వేధిస్తున్నా ఆమె ఇంతకాలం మౌనం వహించింది. అయితే మంగళవారం నాడు సదరు నటుడికి పైత్యం పతాకస్థాయికి చేరుకుంది. డైరెక్టుగా ఆమె ఇంట్లోకే వెళ్ళి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి సదరు నటుడి ఓవర్ యాక్షన్‌ని ప్రత్యక్షంగా చూశారు. ప్రస్తుతం సదరు నటుణ్ణి లాకప్‌లో వేసి కోటింగ్ ఇస్తున్నారు.