విడాకుల బాటలో విద్యాబాలన్?
posted on May 6, 2014 @ 1:45PM
బాలీవుడ్ కథానాయిక విద్యాబాలన్ పెళ్ళి పెటాకులు కాబోతోందా? మొన్నీమధ్యే జరిగిన ఆమె పెళ్ళి మూడునాళ్ళ ముచ్చట కాబోతోందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. విద్యాబాలన్ బాలీవుడ్ నిర్మాత, వ్యాపారవేత్త సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని 2012లో పెళ్ళి చేసుకుంది. సిద్ధార్థ్ రాయ్ కపూర్ కపూర్ తక్కువోడేం కాదు. అయ్యగారికి గొప్ప ఫ్లాష్ బ్యాక్‌లే వున్నాయి. మామూలుగా టాప్ హీరోయిన్లందరికీ సెకండ్ హ్యాండ్ భర్తలే దొరకుతారన్న అభిప్రాయం వుంది. అయితే విద్యాబాలన్‌కి మాత్రం థర్డ్ హ్యాండ్ భర్త దొరికాడు. సిద్ధార్థరాయ్ కపూర్ పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చాలా చిన్న వయసులోనే తన క్లాస్‌మేట్‌ని పెళ్ళి చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమెకి విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత టీవీ సీరియళ్ళు నిర్మించే ఒకామెని పెళ్ళి చేసుకున్న సిద్ధార్థ్ 2011లో ఆమెకీ చెల్లుచీటీ రాశాడు. 2012లో విద్యాబాలన్‌ని పెళ్ళి చేసుకున్నాడు. ఇప్పుడీ జంట కూడా విడాకుల బాటలో పయనిస్తోందని సమాచారం. విద్యాబాలన్ పిల్లల్ని కనాలని సిద్ధార్థ్ కోరుకుంటుంటే, విద్యాబాలన్ మాత్రం అప్పుడే నాకు పిల్లలేంటీ అంటోందట. ఈ విషయంలో భార్యభర్తలిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వున్నాయట. అలాగే గత ఏడాది విద్యాబాలన్ విదేశీ పర్యటనలలోనే బిజీగా వుంది. దాంతో సిద్ధార్థ్ ఒక హీరోయిన్‌కి చేరువయ్యాడట. ఇది విద్యాబాలన్‌కి ఆగ్రహం తెప్పించిందట. ఇలా రకరకాల కారణాల వల్ల వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం.